24, మే 2011, మంగళవారం

AlfredHitchcock--continued

ఆల్ఫ్రెడ్హిచ్ కాక్; 
బ్రిటన్లో తీసిన టాకీలు:
 ౧.లాద్జర్ (హత్యారహస్యం కథ )
౨.బ్లాక్మెయిల్ 
౩.మాన్ హూ న్యూ టూమచ్
 ౪.39Steps  (ఒక నవల ఆధారంగా తీసిన అపరాధ పరిశోధక కథ )౫.లేడీ వానిషేస్  (ట్రైన్లోఒక స్త్రీ అదృశ్యం ,పరిశోధన గురించి ౧౯౪౦లొ అమెరికా వెళ్లి హాలీవుడ్లో చాలా సినిమాలు తీసాడు. అందులో నేను చూసినవీ ,ముఖ్యమైనవీ క్లుప్తంగా పరిచయం చేస్తాను.
౧.౧౯౪౦రెబెక్కా -డాఫ్నేదు మారియర్ అనే రచయిత్రి ప్రసిద్ధ నవల ఆధారం జమీందారుని పెళ్లి చేసుకొని కొత్తగా పెద్ద  హవేలీలో హీరొయిన్ కి కలిగిన విచిత్రమైన అనుభవాల గురించి .నవల లాగే బాగా పాపులర్ అయింది. 
౨.షాడో ఆఫ్ డౌట్. హిచ్ కాక్ కి తన చిత్రాల్లో బాగా ఇష్టమైనది. ౧౯౪౨లొ తీసినది 
౩.౧౯౪౨లొ సాబోటీర్,౧౯౪౩లొ ౪.లైఫ్బోటు. ఈ రెండూ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తీసినవి.
౫.స్పెల్బౌండ్ -౧౯౪౫-టాప్ స్టార్ గ్రిగారీపెక్ నటించినది. మతి మరుపు గురించి మనస్తత్వ విశ్లేషణ ప్రధానాంశం. ఇందులో ప్రసిద్ధ చిత్రకారుడు సాల్వడార్ దాలి చిత్రించిన స్వప్న దృశ్యాలు ఒక ప్రత్యేకత.
౬.నటోరియస్--౧౯౪౬=కెరీ గ్రాంట్, ఇంగ్రిడ్ బెర్గ్మన్ వంటిగొప్ప తారలు నటించినది. జర్మన్ నాజీలు యాటం బాంబు ని తయారు  చేయడానికి ప్రయత్నం చెయ్యడం  కథాంశం. పెద్ద బాక్సాఫీసు హిట్. 
౭.పారదిన్ కేసు -౧౯౪౭-కోర్టు లో నాటకీయ సంఘటనలు. ముఖ్యాంశం. 
 ౮. రోప్ =౧౯౪౮=టేక్నికలర్లో తీసినది. ఒకపెద్ద గదిలోనే కథ అంతా జరుగుతుంది. హత్యచేసి శవాన్ని ఆ గదిలోనే ఒక పెద్ద భోషాణంలో దాస్తారు. చివరకు రహస్యం తెలిసిపోతుంది. జేమ్స్ స్తీవార్ట్ నటించిన చిత్రం. విజయవంతమైనది. 
౯.౧౯౪౯ -అండర్ ద కేప్రికార్న్ కలర్లో ఆస్ట్రేలియా నేపధ్యంలో తీసినది.అంతగా పేరు గాంచ లేదు. 
౧౦.స్టేజ్ ఫ్రైట్-వార్నర్ బ్రదర్స్ వారితో కలిసి ఇంగ్లాండ్ నేపథ్యంతో తీసిన చిత్రం.  
౧౧.స్ట్రేంజర్స్ ఆన్ ఎ ట్రైన్ప్ర. సిద్ధ డిటెక్టివ్ నవలా కారుడు రేమాండ్ శాండ్లర్ సంభాషణలు రాసాడు. చిత్రమైన కథ. ఇద్దరు అపరిచితులు రైల్లో తమకు అడ్డుగా ఉన్నవారిని తమ మీద అనుమానం రాకుండా రెండో వ్యక్తీ తొలగించాలని ఒప్పందం చేసుకొంటారు. మొదటివాడు.రెండోవాడి ప్రేయసిని చంపేస్తాడు. రెండో వాడు మాత్రం మొదటి వాడి తండ్రిని చంపడానికి 
వెనుకంజ వేస్తాడు. బ్లాక్మెయిల్, సస్పెన్సుతో, మలుపు తిరుగుతుంది. హిచ్ కాక్ టచెస్ ఇందులో చూడవచ్చ్చును. 
౧౨.డయల్-యమ్ఫర్ మర్డర్ ౧౯౫౪ గ్రేస్కెల్లీనటించినది. భర్త, తన భార్యను చంపడానికి కిరాయి హంతకుణ్ణి పంపిస్తాడు. భార్య ఆత్మరక్షణలో వాడిని చంపుతుంది. హత్యానేరం తో ఆమె అరెస్తావుతుంది. చివరకు పోలీసు ఆఫీసరు నిజం తెలుసుకొని ఆమెను రక్షిస్తాడు. ఇది కూడా ఉత్కంతతోకూడిన విజయవంతమైన చిత్రం. ప్రఖ్య శ్రీరామ మూర్తిగారు ఈ నాటకాన్ని తెలుగులో రాసారు.చాల పాపులర్ అయింది. dial  M  for Murder


మిగిలిన చిత్రాల గురించి మరొక సారి తెలియ చేస్తాను. 
సెలవు. 
రమణారావు.ముద్దు 

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

అసలు మీ వివరణలు అర్ధవంతంగా లేవండీ. ఎక్కడో ఉన్న వాటిని తిరిగి ట్రాన్స్ లేట్ చేసిన చందంగా వున్నాయి. పై పెచ్చు ఆ తెలుగు అంకెలొకటి. అస్సలు అర్ధం కావడం లేదు. కనుక కాస్త డీటైల్డ్ గా రాస్తే మంచిది. హిచ్ కాక్ అంటే పడి చచ్చే వాళ్ళు ఇంకా చాలా మంది వున్నారు. ఆ ఎవరు చూస్తారు లే అన్నట్టు రాసినట్టు కనిపిస్తోంది. ఇంతగా మీకెందుకు రాస్తున్నానంటే ఆఖర్లో మీరు మరిన్ని వివరాలు మరోసారి అన్నట్టు రాసింది చదివి ఇలా చేస్తున్నాను.