23, ఫిబ్రవరి 2012, గురువారం

china-contd.-3


 

 క్విన్ లేక చిన్ సామ్రాజ్యపు  చక్రవర్తి తన తర్వాత తన రాజ్యం శాశ్వతంగా ఉంటుందనుకొన్నాడు.కాని అతని మనమడి కాలంలోనే అంతరించింది.కొంతకాలం ఆధిపత్యపు పోరు ,అంతర్యుద్ధాలు ,తిరుగుబాట్ల తర్వాత ,క్రీ.పూ.210 నుండిక్రీ.పూ.140 వరకు ,మళ్ళీ క్రీ.శ.25 నుండి క్ర్హినాలో ఈ.శ.210 వరకు హాన్ వంశీయులు పాలించారు.మధ్య కాలంలో అనగా క్రీ.పూ.140 నుండి క్రీ.శ.25 వరకు వేరే వంశీయులు పాలించారు.మొత్తం మీద ఈ నాలుగు   వందల సం; కాలంలో దాదాపు చైనా అంతా ఒక పరిపాలనలోకి  వచ్చింది.ఈకాలంలో మన దేశంలో ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యం వర్ధిల్లినది.( క్రీ.పూ.200-క్రీ.శ.200)వరకు.వీరి కాలం లోనే బౌద్ధమతం మధ్య ఆసియా నుంచి చైనాలో ప్రవేసించి ప్రజాదరణ పొందినది.కాని,కంఫుసస్ ,తావో బోధల ప్రభావం కూడా బాగా ఉండినది     చివరి రాజులు  బలహీనులు ,చిన్నపిల్లలు అగుట  రాజమాతలు  సలహాదారులు,రాజ్య పాలన సాగించే వారు.అంతహ్ పుర కుట్రలు ,తిరుగుబాట్లచేసామ్రాజ్యం పతనమై 4 రాజ్యాలు ఏర్పడి కలహించుకొంటూఉండేవి.సరిహద్దుల్లో హూణులనే జాతివారు తరచు దాడి చేసేవారు.
 ఐనా ఈ400సం;లోను చైనా సంపన్నమై,ప్రశాంతంగా వర్తక వ్యాపారాలతో వర్ధిల్లినదని చెప్పవచ్చును.
  హాన్ సామ్రాజ్య పతనం తర్వాత 400 సం;చిన్న రాజ్యాలు ఏర్పడి అస్థిరం గా ఉండేద్ .
 హాన్ సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం కి సమకాలికమైందే.కాని 4వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనమైనాక యూరప్లో మళ్ళీ సామ్రాజ్యం ఏర్పడలేదు.కాని చినాలో ఒక సామ్రాజ్యం పడిపోయాక ,కొన్నాళ్ళు పోయాక మరొక సామ్రాజ్యం ఏర్పడేది.
   తరవాత చరిత్ర మరొకసారి చెప్పుకొందాము.     

17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

china-contd.


 

 చైనా చరిత్రలో మొదటి సామ్రాజ్యం క్విన్ లేక చిన్ వంశంలో 5వ తరం వాడైన ఝెంగ్ అనే రాజు స్థాపించాడు.ఇతని కాలం క్రీ.పూ.246 నుంచి 210 వరకు.దాదాపు చైనా అంతటినీ జయించి చక్రవర్తిగా (షి హువాంగ్డి ) గా పాలించాడు.ఇతడు సమర్థుడు, క్రూరుడు.చైనా వాళ్ళ పేర్లు మనకు చిత్రంగా ఉంటాయి.ఇంగ్లిష్ లోకి వచ్చేసరికి ఉచ్చారణ మారిపోతుంది.అందువలన క్లుప్తంగానే రాస్తాను.క్విన్ చక్రవర్తి పాలన వలన చైనా చరిత్రలో కలిగిన ఫలితాలు,మార్పులు మనకు ముఖ్యం. ఇతని పాలనలో చేసిన పనులు ,జరిగిన సంఘటనలు ముఖ్యం.
  1.రాజులు,రాజవంశాలు ఎన్ని మారినా చైనాకు అంతటికి ఒక సామ్రాజ్యం, సామ్రాట్టు ఉండాలనే భావం బలంగా నాటుకొనడం .
  2.చైనా జాతి ,దేశం ఇతరుల కన్నా గొప్పదని భావం కలగడం.
  3.సరిహద్దుల్లో నుంచి అనాగరక ,సంచారక జాతుల దాడుల నుంచి రక్షించు కొనుటకు ఉత్తర సరిహద్దులో పెద్ద గోడను నిర్మించడం .కాని మనం అనుకొన్నట్లు 3000 మైళ్ళ దూరం ఒకే గొప్ప గోడ కాదట.సందర్శకులు రాజధాని బీజింగ్ దగ్గర ఉన్నట్లు మహాకుడ్యం కాదు.అక్కడక్కడ కోటలు ,బురుజులు ,కొన్ని చోట్ల కట్టెలు ,మట్టి తో కట్టినవి కూడా ఉన్నవి.
 4.రాళ్ళతోను,మట్టితోను వందల మైళ్ళ దూరం రహదార్లు నిర్మించడం.
 5.(అప్పటికే ఉన్న) హొయాంఘో,యాంగ్ సీ ,నదుల మధ్య కాలువల సిస్టమ్ని అభివృద్ధి చేయడం.
 6.శాసనాలద్వారా పరిపాలనా నియమాలని అమలు చేయడం.ఒకే పాలనాపద్ధతులను చైనా అంతటా ప్రవేశపెట్టుట.
 7.అప్పటికి ఉన్న గ్రంథాలన్నిటినీ పనికిరావని తగలబెట్టించాడు.కాని కొన్ని కాపాడ బడ్డాయి.
 8.తన రాజ్యానికి చిన్న నకలుగా (miniatureempire) గా పెద్ద సమాధిని తన జీవితకాలంలోనే నిర్మింప జేసాడు.కాని దీనిని తర్వాత కాలంలో కొల్లగొట్టారు. A.D.1974లో ఈ సమాధి బయట పడింది.అందులో వందలకొద్ది మట్టితో చెసిననిలువెత్తు సైనికులు,రథాలు కనుగొన్నారు.(Toy army) చైనా పర్యాటకులు విధిగా  దర్శించేవి చైనా గోడ,బొమ్మల సైన్యం.
  తన తర్వాత శాశ్వతంగా తన వంశం,సామ్రాజ్యం నిలిచి ఉంటాయనుకున్నాడు ,ఈ క్విన్ చక్రవర్తి.కాని త్వరగానే అతని మనమడి కాలంలోనే ఈ సామ్రాజ్యం అంతరించింది.కాని దాని ముద్ర మాత్రం చైనా పైన శాశ్వతంగా పడినది.అది ఎలా జరిగిందో,తర్వాతి పరిణామాలేమిటో  మరోసారి రాస్తాను. 

15, ఫిబ్రవరి 2012, బుధవారం

chaina
 జాన్ కే అనే రచయిత చాలా పరిశోధించి రాసిన 'china-a history అనే గ్రంథాన్ని చదువుతున్నాను.అగ్రరాజ్యంగా వేగంగా ఎదుగుతున్న చైనా గురించి తెలుసుకోవాలంటే దాని ప్రాచీన చరిత్ర కూడా తెలుసుకోవాలని రచయిత అంటాడు .చాలా క్లుప్తంగా వివరిస్తాను.
 1.బి.సి.2000సం. పూర్వం మన షట్ చక్రవర్తులలాగే వాళ్ళు 5 గురు చక్రవర్తులు పాలించారని నమ్ముతారు.
 2.చారిత్రక కాలానికి వస్తే దాదాపు బి.సి.2000 నుంచి బి.సి.250 వరకు మూడు రాజవంశాలు పాలించినట్లు  ఆధారాలు ఉన్నాయి.ఐతే వీరిని రాజులుగానే గుర్తించారు.కారణం; వారు హొయాంగ్ హో ( yellow river ) పరీవాహక ప్రాంతాన్ని మాత్రమే పాలించారు.1.క్సియా (xia) వంశం బి.సి.2070 - బి.సి.1600 వరకు.2.షాంగ్ (shang) వంశం బి.సి.1600 - 1050 బి.సి.వరకు.3.ఝౌ ( zhou) వంశం బి.సి.1050- 256 బి.సి.వరకు పాలించాయి.వీరి గురించి సమాచారం ,ఎముకలు,వెదురుదబ్బలు ,కంచు పాత్రలపై చెక్కిన లిపులచేతను ,కొన్ని సమాధులలో లభ్యమైన అవశేషాల ద్వారా
 లభ్యమైనది.ఇవి కాక దక్షిణాన 'చు ' (chu) అనే రాజ్యం ,ఇంకా   కలహించుకొంటూ ఉండే చిన్న రాజ్యాలు కొన్ని ఉండేవి.(warring states)
  చైనా  వారికి మన లాగ మతాలు,వేదాంతాలు లేవు.వారికి కొన్ని నమ్మకాలు ఉండేవి.పిత్రుదేవతల ఆరాధన ముఖ్యం.(ancestor worship) బి.సి.6,5,శతాబ్దుల్లో కంఫుషస్   (confushiyas) ,లాత్సె (Laotse) ,మెంజి (mencius) అనే తత్వవేత్తలు  నీతిసూత్రాలు,సమాజనియమాలు,ప్రవర్తనావళి ,రచించారు.బోధించారు.వారి కాలంలో ప్రసిద్ధి కాంచకపోయినా ,తర్వాత కాలంలోను, ఈనాటికి కూడా చైనీయ సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయి.
 క్రీ.పూ.256 లో చైనాలో మొదటి సామ్రాజ్యం స్థాపించబడి చైనాలో అత్యధిక భాగం తన ఏలుబడి లోకి తెచ్చుకున్నది.ఈ వంశం పేరు క్విన్ లేక చిన్ .ఇతడు తనని చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు.(huyangDi).తర్వాతి చరిత్ర మరొకమారు తెలియజేస్తాను    చైనా చరిత్ర మనకెందుకు అని చాలా మంది అనుకోవచ్చును.కాని ఈ క్రింది కారణాలవలన అది మనకు ముఖ్యం.
  1.టిబెట్ని ఆక్రమించుకోడం చేత చైనా మనకు పొరుగు దేశం ఐనది మనకు,వాళ్ళకు సరిహద్దు తగాదాలు ఉన్నవి.2.1962 లో  మనపై దండయాత్ర చేసి ఆక్సాఇచిన్ ప్రాంతం ఆక్రమించింది.అరుణాచల్ తనదే అంటున్నది.3.మనకు విరోధి ఐన పాకీస్తాన్ కు బలమైన సప్పోర్టు ఇస్తూ ఉంటుంది.4.మనం కూడా క్రమంగా అగ్రరాజ్యంగా ఎదుగుతున్నాము.అందుచేత భారత్,చైనాలు అనేక రంగాల్లో పోటీ పడే అవకాశం ఉంది.5.మనదేశంలో చైనా అనుకూల  వర్గాలు,లాబీలు ఉన్నాయి.అవి మన దేశంలో అస్థిరత్వం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.
      -----------------------------
          

8, ఫిబ్రవరి 2012, బుధవారం

known already


  1.
 మా అబ్బాయి అప్పుడప్పుడూ ఫోన్ చేసి కొత్త విషయాలని చెప్పుతూ ఉంటాడు.సైన్సు సంగతులు వదిలేస్తే ,మేనేజ్మెంట్,పరిపాలన,మానవసంబంధాలు, నీతిసూక్తులు,వ్యాపార సూత్రాలు మొ;వాటి గురించి చెప్పినప్పుడు ,నేను ఇవన్నీ వేమన పద్యాల్లో ,సుమతీ శతకంలో ,భర్తృహరి సుభాషితాల్లో,మహాభారతంలో,భగవద్గీతలో,లేక కంఫూషస్ సూత్రాల్లోనో ఉన్నాయని చెప్పేసరికి ,మీరు అగ్నిహొత్రావధానులు లాగ 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయష 'అన్నట్టు మాట్లాడతారని విసుక్కొంటాడు.అవును,మరి ఇవన్నీ పూర్వులు ఎవరో, ఎప్పుడో చెప్పినవే అంటాను.
 2.ఈ మధ్య హొయసాల శిల్పాల ఫొటోలతో ఒకరు బ్లాగు రాశారు .అందులో వరాహావతారంలో విష్ణుమూర్తి భూమిని పైకెత్తినట్లు చూపిస్తూ మామూలుగా చెక్కే స్త్రీమూర్తిగా కాకుండా గోళంలాగ ( globe ) చెక్కేరు.ఆశిల్పాలు 13వ శతాబ్దమ్నాటివి.  యూరప్లో భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దందాకా తెలియదు.బల్లపరుపుగా ఉందని అనుకొనే వాళ్ళు.కపిత్థాకారం భూగోళం అని మనవాళ్ళు   ఎప్పుడో చెప్పారు.( కపిత్థం అంటే వెలగపండు అని అర్థం ) .
 రచన పత్రికలో  చిట్టెన్రాజుగారి  జోకులతో ముగిస్తాను.ఆయనే చెప్పినట్లు జోకులమీద అందరికీ 'కాపీ రైటు ' ఉందికదా.
  1.మొగుడూ, పెళ్ళం, ఒకే నాణేనికి రెండు పక్కలే,ఎందుకంటే  పెళ్ళయ్యాక కొన్నాళ్ళకి ఒకరిమొహం మరొహరు చూసుకోలేరు కాబట్టి!
  2.ఒక ఫిలాసఫర్ యువకుడికి ఇచ్చిన సలహా ' తప్పకుండా  పెళ్ళి చేసుకో .మంచి పెళ్ళాం వస్తే జీవితాంతం ఆనందిస్తావు. లేకపోతే నాలాగ ఫిలాసఫర్వి అవుతావు.
  3.డాక్టర్ పేషెంటుతో 'ఈ రెండు మాత్రలు తీసుకొని రాత్రి ఒకటి వేసుకొండి .పొద్దున్న లేస్తే రెండో మాత్ర వేసుకొండి!

      -------------------------------