30, ఏప్రిల్ 2011, శనివారం

గల్పిక - 2

2.గల్పిక;అర్ట్ బుచ్వాల్డ్ రచన 'మేడ్ ఇన్ యూ.యస్ .యే ఆధారంగా.========మేడ్ ఇన్ ఇండియా==
గాంధీగారి విదేశీవస్తు బహిష్కరణ,స్వదేశీవస్తు ఉద్యమం గురించి చదివి వంటపట్టించుకొని స్వదెశీ వస్తువుల్నే కొనాలనినిశ్చయించుకొన్నాను.ఈ మధ్య మా మున్సిపాలిటీ వారు కొన్ని పనులు చేయించడానికి పూనుకొని పెద్దయంత్రాలను కొనాలనుకొన్నారు.మార్కెట్లో అందుకు సరిపోయే యంత్రాలు తయారుచేసే కంపెనీలు రెండే వున్నాయి. ఒకటి కొమటూసు అనే జపాన్ కంపెనీ ,రెండుభూలోక్ అనేఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీదే కొనాలని కొందరు దుమారం లేవదీశారు. సరేననిభూలోక్వారికే ఆర్డర్ ఇచ్చారు. కొన్న తరవాతతెలిసిందండీ.కొమటూసు మెషీను చెన్నై దగ్గరమనకంపెనీలొనే తయారవుతుందని.భూలోక్ మెషీను జపాన్లో క్యోటో దగ్గర తయారవుతుందని.!
ఒకసారి మా వాళ్ళతో చీరలు కొనటానికి వెళ్ళాము.బెనారస్,కంచి,గద్వాల్ చీరలు కొన్ని సెలెక్టు చేసుకొన్నారు.మాటల్లో తెలిసింది సిల్కుదారం చైనానుంచి ,జరీ తైవాన్ నుంచి వస్తాయని.చీరలనేతమాత్రం మనదేశంలోనేనని.
మరొకసారి మ్యూజిక్సిస్టం కొందామని బజారంతా తిరిగాను.అన్నెవిదెశీబ్రాండ్లే వున్నాయి.చివరకు ఒక సందులో గోల్మాల్చంద్ షాపులోస్వర అనేపేరుతో ముంబైలో తయారైన సిస్టం దొరికింది.ఐనా అంత సులువుగా వదలను కదా.గట్టిగా అయిష్టంగానే ప్రశ్నించేసరికి అయిష్టంగానే చెప్పాడు.కంపెనీ ఇండియందే ఐనా విడిభాగాలు జపాన్,కొరియాలనుంచి వస్తాయని ,వాటిని అసెంబుల్చేసి ,జలగంలొ పై డబ్బా తయారుచేసి కంపెనీముద్రతో అమ్ముతారని చెప్పాడు. షాపుఓనరు .కాని, నాసమస్య ఏమంటే పూర్తిగాభారత్లోనే తయారయే వస్తువుల్నే కొనాలని.ఆమాట చెప్తేఅతను అలాగయితే ఖాదీభండారుకి వెళ్ళండి,లేకపోతే లేపాక్షి ఎంపోరియంకి వెళ్ళండి,అనిసలహా ఇచ్చాడు. అక్కడయినా బొమ్మలువగైరాలకి రంగులూఅవీ విదేశాలనుంచి వస్తాయేమో కదా అన్నాను.'అదెలాచెప్పగలమండీ ,వాళ్ళనే అడగండీని నా చాదస్తానికి చిన్నగానవ్వుతూ అన్నాడు.
సరేనని లేపాక్షికి వెళ్ళి చూసాను. అక్కడి వస్తువులు ఏవీ నాకు అందుబాటు ధరల్లో లేవని తెలుసుకొని ఇంటి దారి పట్టేను.

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

satyasaibaba=contd.

ఆరోజుల్లోనే సత్యనారాయణరాజుకి జ్ఞానోదయం కలిగింది.తాను షిర్దీ సాయిబాబా అవతారంగా ప్రకటించేడు.స్కూలు మానివేసాడు. ప్రతి గురువారం పాండురంగస్వామి గుడిలో భజనలుచేసి "చక్కెరపొట్లాలు "స్రుష్టించి భక్తులకు ఇచ్చే వాడు.ఒకరోజు హనుమంతరెడ్డి అనే విద్యార్ధి నాయకుడూఅ పొట్లాన్ని బాబా మీదికే విసిరికొట్టాడు.ఐనా కోపగించుకోక ,బాబా అతనిని ఏమీ అనవద్దని అందరినీ శాంతపరచారట.ఈవిషయం విన్నాను, కాని చూడలేదు. తరువాత హనుమంతరెడ్డి బాబా భక్తుడయాడు. మరి కొన్నాళ్ళకే సాయిబాబా కుటుంబం అందరూ ఉరవకొండ విడిచి పుట్టపర్తికి వెళ్ళిపోయారు.ఆతర్వాత ఆయనపేరు,ప్రఖ్యాతులు ,కథలు,మహిమలు అన్నీవిండం,చదవడమే కాని వెల్లి చూడలేదు.=== రమణారావు.ముద్దు


28, ఏప్రిల్ 2011, గురువారం

satyasaibaba

1940,1941లోనేను6,7తరగతులు ఉరవకొండహైస్కూల్ లో చదివెటప్పుడు ,సత్యనారాయణరాజు మాకు సీనియర్. తెల్లగా,పొట్టిగా,గిరిజాలజుత్తుతోవుండెవాడు.నెను ,అతను. స్రీరాములు అనె సహపాఠి 'చెప్పిందంతాచేస్తారా' అనె నాటికను ప్రదర్సించాము.మానాన్న గారు గవర్నమెంటు డాక్టర్.అందువల్ల అందరూఆయనవద్దకు చికిత్సకోసం వచ్చేవారు.;=మిగతా మరోసారి.;=రమణారావు .ముద్దు

26, ఏప్రిల్ 2011, మంగళవారం

Art Buchwald

"ఆర్ట్ బుచ్వల్ద్, ప్రసిద్ధ అమెరికన్ హాస్య రచయిత. అతని రచనలలో కొన్నిటిని తెలుగు లో గల్పికలుగా రాస్తున్నాను.

25, ఏప్రిల్ 2011, సోమవారం

20, ఏప్రిల్ 2011, బుధవారం

galpikalu

Artbuchwald is a famous American humorist.He wrote many columns in newspapers and magazines with wry humor and sarcasm about various topics but without indulging in crude and painful manner. Im going to write translations of a few of these columns,which I liked into telugu naming them as "GALPIKALU". They will be up in a few days.
You can read and enjoy.

RAMANA RAO.MUDDU

11, ఏప్రిల్ 2011, సోమవారం

మీ కిచిడి శ్లోకం చదివాను.చమత్కారం వివరిస్తె తప్ప తెలియలేదు.బాగుంది.2అతిధి సత్కారం గురించి;ఒకప్పుడు ఆర్థిక కారణాలవల్ల ఇష్టపడెవాళ్ళు కాదు. కాని ఇప్పుడు న్యూసన్సు ,అక్కరలెని లంపటం అని చికాకు పడుతున్నారు.3సీతాపతిగారి /పుష్పవేదన/బాగుంది. కరుణస్రీ పుష్పవిలాపం కి విరుద్ధంగా వున్నా లాజికల్గా వుంది .ఒకె అంసం మీద రెండు అభిప్రాయాలు వుండవచ్హును కదా.పద్యాలు మాత్రం చక్కగా వున్నాయి.అభినందనలతో ;రమణారావు..ముద్దు