22, డిసెంబర్ 2014, సోమవారం

20, డిసెంబర్ 2014, శనివారం

Sri.D.V.Subbarao.




 శ్రీ డి.వి.సుబ్బారావుగారి తో నాకు బాగా పరిచయముంది.ఆయన వివిధరంగాల్లో ప్రసిద్దికెక్కారు. న్యాయవాదిగా,క్రికెట్ అఫిషియల్గా,విశాఖ మేయర్గా వినుతిచెందారు.ముఖ్యంగా  మేయర్గా విశాఖను సుందరంగా అభివృద్ధి చెయ్యడంలో ఆయన కృషి ప్రశంసనీయం.వ్యక్తిగా కూడా స్నేహశీలుడు,నిజాయితీపరుడు, మేధావి .ఆయన మరణవార్త నన్ను కలచివేసింది.అయనకు నా నివాళి, శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతి  తెలుపుకొంటున్నాను.

17, డిసెంబర్ 2014, బుధవారం

premature deaths


 
శీర్షిక
--------
  ఈ మధ్య కొందరు ప్రముఖులు,సినీ,సాహితీ,రాజకీయ రంగాలలోవారు అకాల మృత్యువు బారిన పడుతున్నట్లు చదవడం కలవరపెడుతున్నది. ప్రసిద్ధులు కాకపోయినా ఇతర రంగాలలో కూడా ( వైద్యరంగంతోసహా) ఇలాగే జరుగుతున్నది.కర్మానుసారం జరుగుతుందనే  మాట పక్కన పెడితే,మానవ ప్రయత్నాలు ఏం చెయ్యాలంటే;
    1.40సం:దాటిన ప్రతి మనిషి  ఏడాదికొకసారి  మెడికల్ చెకప్ చేయించుకోవాలి.
    2.చెకప్ లో  ఏవైన,అధిక రక్తపోటు మధుమేహలక్షణాలు కనిపిస్తే  తగిన చికిత్స తీసుకోవాలి.
     3.మద్యపానం,ధూమపానం మానివేయాలి.
   4.  డబ్బు సంపాదించాలి కాని దానికోసం ఆరోగ్యాన్ని బలిపెట్టకూడదు.
      5.జీవితవిధానాన్ని life style ని తగిన విధంగా మార్చుకోవాలి. ఆహరనియంత్రణ,తగుమాత్రం వ్యాయామం  అవసరం.
     6.ముఖ్యంగా  జబ్బుని దాచుకోకూడదు.జీవితభాగస్వామి,లేక దగ్గరి బంధువుల సహకారం తీసుకోవాలి. 

11, డిసెంబర్ 2014, గురువారం

కమనీయం: o,visakhaa!

కమనీయం: o,visakhaa



  !

o,visakhaa!


 

 విశాఖా!ఓ విశాఖా,నావిశాఖా!
----------------------
     
          పసిప్రాయంలో నీ వడిలో పరుండితి,
          నీలతరంగ హస్తాలతో నిమిరావు నన్ను.
          ఎల జవ్వనములో కోరి వలచాను నిన్ను,
 తరులతా కుంతలాల మురిపించావు నన్ను
          సుందర విశాఖా!విలాసరేఖా!

            నీ శైల కందరాలలో
            సానుప్రదేశాలలో
            సైకతచుంబిఫేనరాశుల్లో
            సంధ్యామారుతసౌరభాల్లో
            చంద్రోదయసువర్ణరోచుల్లో
            అలలపై జలతారుదారుల్లో
            ఉదయారుణజలదపంక్తుల్లో
            ఆడియాడి అలసి నిదురించాను
               సుందరవిశాఖా! విలాసరేఖా!
             సుదూరంలో నౌకోపరితలం నుండి
             నీహారదుకూలపరీవృతమైన
             నీ తీర సౌభాగ్యాన్ని తిలకించినాను .
             తిలకించి,తిలకించి పరవశించాను
                సుందరవిశాఖా!విలాసరేఖా!
                 విశాఖా!,ఓ విశాఖా,నా విశాఖా!