26, జూన్ 2012, మంగళవారం

Rio-20 conference. ఈ మధ్య రియోడీజనీరో నగరంలో జరిగిన జీ-20 దేశాల శిఖరసమావేశం పెద్దగా ఏమీ సాధించకుండానే ముగిసింది.అందుకు కారణం అభివృద్ధి చెందిన అమెరికా,బ్రిటన్ ,వంటి అగ్రరాజ్యాలు ఆసక్తి చూపక పోవడమే.స్థూలంగా చెప్పాలంటే ; ఆ రాజ్యాలు బాగా  పారిశ్రామికీకరణం చేసుకొని,తమ బలం ,సంపదల వలన ప్రపంచంలో వనరులను వశపరచుకొన్నాయి.వాతావరణ కాలుష్యం,ఉద్గారాలు (toxic emissions ) ఆదేశాలే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.అవి తగ్గించుకోవడం  వాటికి ఇష్టం లేదు.కాని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను మాత్రం మీరు పరిశ్రమల కాలుష్యం,ఉద్గారాల్ని బాగా తగ్గించుకోమని సలహా ఇస్తాయి.అప్పటికీ మన ప్రధానమంత్రి గత దశాబ్దంలో ఈ దశగా తీసుకొన్న చర్యలను వివరించారు.మనము,చైనా, ఎక్కువగా తినడం వలన ఆహారపదార్థాల కొరత,వాటి ధరల పెరుగుదల కలుగుతున్నాయంటారు. అలాగే మన పరిశ్రమల పెరుగుదల వలన ప్రపంచం వేడెక్కుతున్నదని ,కాలుష్యం పెరుగుతున్నదని  వారి వాదన.కాని వాళ్ళ ప్రధాన బాధ్యత,భాగం పట్టించుకోరు.ఈ కారణాల వలన ఆ సమావేశం సఫలం కాలేదు.  

19, జూన్ 2012, మంగళవారం

INTACH.SEMINAR ON KALINGASEEMA
 17,18 జూన్ 2012న స్థానిక గాయత్రి కళాశాలలో  ,అధికారుల,దాతల సహాయంతో I.N.T.A.C.H.ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ తరఫున ఉత్తరాంధ్ర  సాంస్కృత ,వారసత్వ ,చారిత్రక సదస్సు జయప్రదంగా జరిగింది.రాష్ట్రం లోని వివిధ నగరాలనుంచి,ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన పరిశోధకులు,చరిత్ర ప్రొఫెసర్లు,పురావస్తు వేత్తలు(archeologists)ఉత్తరాంధ్ర ,కళింగ సీమ పై ముఖ్యంగా శ్రీ కాకుళం జిల్లాపై కేంద్రీకరించి వివిధ అంశాలపై పరిశోధనా పత్రాలు చదివి చర్చించారు.ఈ సదస్సును నిర్వహించిన వారినందరినీ అభినందిస్తూనే ,ఒక విషయం వ్రాయదలచుకొన్నాను.కార్యక్రమవివరాలు చివర దాకా ప్రజలకు తెలియజేయలేదు.సదస్సు గురించి పత్రికలు,టీ.వీ.లో ఏ ప్రచారమూ ముందుగా జరగలేదు.పేపర్లు,ఉపన్యాసకార్యక్రమాలు ఇంగ్లిష్ బదులు తెలుగులో జరిపించివుంటే  బాగుండేది. 

8, జూన్ 2012, శుక్రవారం

remakes ఈ మధ్య గుండమ్మకథ సినిమా రెమేక్ గురించి ఆలోచిస్తున్నారు.తెలుగులోనేకాక ,హిందీ,ఇంగ్లిష్ లో కూడా రెమేక్స్ వచ్చాయి.గతంలో ఆర్థికంగా బాగా విజయవంతమైనవి,లేక కళాత్మకమైనవని పేరు తెచ్చుకొన్నవి ఐన చిత్రాలను రీమేక్  చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఇందులో అనుకూలతలు 1.కథ,సంఘటనలు కొత్తగా వెతుక్కో నక్కర లేదు.beaten track .ఇంతకు ముందు విజయ వంతమైంది , లేక పేరు తెచ్చుకొంది కాబట్టీమళ్ళీ విజయవంతం అవుతుందని ఆశ,నమ్మకం.2.ప్రతికూలత - వద్దన్నా పాతచిత్రంతో పోలుస్తారు.దానిని మించకపోయినా కనీసం అందులో 75 శాతమైనా బాగు లేకపోయినా,నచ్చకపోయినా చిత్రం విజయవంతం కాదు. నాటికీ నేటికీ అభిరుచులూ,ఆలోచనలూ మారిపోవచ్చును.సరీఇన పాత్రధారులు దొరకక పోవచ్చును.ఇప్పుడు గుండమ్మకథకి సూర్యకాంతం పాత్ర లాగ.మొఘల్-ఇ-అజాం ,సికందర్,మదర్ ఇండియా రీమేక్లు అలోచనలోనే ఉండిపోయాయి.
  తెలుగులో 'పోతన ' ,వేమన ' ,త్యాగయ్య ' పల్నాటియుద్ధం,' బీదలపాట్లు  ' వీటి రీమేక్స్ ఒరిజినల్స్ అంత ప్రజాదరణ పొందలేదు.'రామదాసు ' ,శ్రీరామరాజ్యం , పరవా లేదనిపించుకున్నాయి.
 'మల్లీశ్వరి,'విప్రనారాయణ ' మళ్ళీ రంగుల్లో తీస్తే బాగుంటాయి.కాని,పాత్రధారులకన్నా,వాటిలోని,అద్భుతసంగీతాన్ని కొత్తరకంగా కంపోజ్ చెయ్యడం చాలా కష్టం.మంచి సంగీతం లేకుండా ఆ రెండు సినిమాలూ,రక్తి కట్టవు.'నర్తనశాలకి  'S.V.రంగారావు లాంటి కీచక 'పాత్రధారిని తేవడం  కష్టం.అందుకే ఇటీవల అమితాభ్ బచ్చన్ ' క్లాసిక్స్ ' మళ్ళీ నిర్మించకుండా ఉండడమే మంచిదని అన్నాడు.
 

5, జూన్ 2012, మంగళవారం
  అజ్ఞాతగారికి,నేను బాణామతి,తులసిదళం నవలలు రెండూ చదివాను.అవి popular thrillers కిందికి వస్తాయిగాని ఉత్తమనవలల కిందికి రావు.రచయిత భావాలతో మనం ఏకీభవించనక్కర లేదనుకోండి.కాని ,వస్తువు,శిల్పం రెండూ బాగుంటే మంచిది కదా.విశ్వనాథవారి నవలల్లో నేను ఉత్తమం గా పరిగణించేవి 1.వేయిపడగలు.2.చెలియలికట్ట.3.ఏకవీర. ofcourse  లోకో భిన్న రుచి . 

visvsnatha novels -contd.
  నాకు విశ్వనాథవారి  'దిండు కింద పోకచెక్క 'నవల జ్ఞాపకం లేదు.అది నేపాళ రాజ వంశచరిత్రలలో ఒకటి అనుకొంటాను.'బాణామతి 'అంటే చేతబడి.అది మూఢ విశ్వాసం ఆధారంగా రాసిన నవల కాబట్టి మనకు నచ్చదు.
  'ఏకవీర 'చాలా కాలం కింద చదివిన నవల.దాని ఆధారంగా తీసిన సినిమా కూడా దాదాపు 40 ఏళ్ళు కావచ్చింది.గుర్తు తెచ్చుకొని రాస్తున్నాను.ఈ సినిమాలో N.T.రామారావు, కాంతారావు ,K.R.విజయ ,జమున ప్రధాన పాత్రధారులు.నటన,సంగీతం బాగుంటాయి కాని high brow అవడంవలన విజయం సాధించలేదు.
 ఏకవీర కథ 18 వ శతాబ్దం ,చారిత్రక నేపథ్యం గలది.అప్పటికే ఇంగ్లిష్ వారు ,ఫ్రెంచ్ వారు మన దేశంలో రాజ్యస్థాపన కోసం ,ఆధిపత్యం కోసం పెనగులాడుతున్నారు. మధుర,తంజావూరు రాజ్యాలను ,దక్షిణాంధ్ర నాయక రాజులు పరిపాలిస్తున్నారు.
  రాజకుమారుడు ,అతని మిత్రుడు ఇద్దరు చెరొక యువతిని ప్రెమిస్తారు.కాని విధివశాత్తు, ఒకరు ప్రేమించిన యువతిని మరొకరు వివాహం చేసుకో వలసి వస్తుంది.అందువలన వాళ్ళ జీవితాల్లో కలిగిన సంక్షోభం ,ఆవేదన చక్కగా చిత్రింపబడినవి.విశ్వనాథ వారి శైలి ,వర్ణనలు బాగుంటాయి.అవి వారి ప్రత్యేకత.చివరకు కథ విషాదాంతం అవుతుంది.
  ఈ నవల మళ్ళీ చదువుదామని ప్రయత్నించాను.కాని ఎక్కడా దొరకలేదు.(to be contd.)
  

3, జూన్ 2012, ఆదివారం

novels of ViSwanatha Satyanarayana

విశ్వనాథ వారి బహుముఖ ప్రజ్ఞా విశేషాల గురించి తెలిసిందే.ఆయన రామాయణ కల్ప వృక్షం ,ఆంధ్రప్రశస్తి, వంటి గొప్ప కావ్యాలే గాక కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి వంటి సరళ గేయాలు కూడ రచించారు. నవలలు,నాటకాలు రాసారు.ఆయన చేపట్టని ప్ర క్రియ లేదు.వేయి పడగలు  అనే బృహత్ నవల గు రించి ఈ మధ్య చర్చించు కున్నాము.దాని  తర్వాత చెలియలి కట్ట ,ఏకవీర నవలలు  ప్రసిద్ధి పొందాయి .
  చెలియలి కట్ట అంటే సముద్రపు గట్టు. సాధారణంగా ఆ హద్దుని దాటి సముద్రం రాదు.వచ్చింది అంటే ఏ సునామీ లాగానో నాశనం చేస్తుంది .అలాగే కొన్ని సాంఘిక కట్టుబాట్లు దాటితే సమాజానికి చేటు కలుగుతుంది .ఈ  నవల లో ,వదిన ,మరది  మధ్య అక్రమ సంబంధం కథావస్తువు .దాని వలన

 కలిగిన దుష్ ఫలితాలు  చిత్రించ బడినవి .చివర
 ముగింపు విషా దంతం.  (మిగతా మరొక సారి .)

1, జూన్ 2012, శుక్రవారం

BLOGS మా తరంవారికి కప్యూటర్లు ,ఇంటర్నెట్,తెలియదు.అప్పుడివి ఇండియాలో ప్రచారంలోకి రాలేదు.ఇటీవల కాలక్షేపం కోసం కొంచెం నేర్చుకొని బ్లాగులు చదవడం,వ్రాయడం చేస్తున్నాను.కాని ఫొటోలు,ఆడియోలు  ఉటంకించడం రాదు.ఆ మాయా మర్మాలు తెలిసిన నిపుణులు పెట్టుతున్న మంచి ఫొటోలు ,విడియోలు, ఆడియోలు చూసి ,విని ,ఆనందిస్తున్నాను.ఎన్నో sources నుంచి సేకరించిన దృశ్యాలు,సమాచారము,విజ్ఞానము కొద్దిగానైనా ఒకే చోట లభ్యం అవుతున్నది.
  ఈ బ్లాగులు వ్రాసేవారిలో 20నుంచి 80 వరకు వయస్సు వున్నవాళ్ళు,మహిళలు,కవులు,పండితులు,డాక్టర్లు,ఇంజనీర్లు,సైంటిస్టులు,ఉద్యోగులు,విద్యార్థులు  ఇంకా ఎన్నో వర్గాల వాళ్ళు ఉన్నారు.వివిధ అంశాల మీద సాధికారంగా వ్రాయగలిగిన వాళ్ళు ఉన్నారు.తీవ్రవాదులూ,మితవాదులూ ,సనాతనధర్మ వాదులూ ,నాస్తికులూ అందరూ ఉన్నారు.మంచిదే.ఎవరి అభిప్రాయాల్ని వారు గట్టిగా,తీవ్రంగా ప్రతిపాదించవచ్చును.వాదించవచ్చును.
  కాని కొందరు హద్దుమీరి పరుషవాక్యాలు రాయడం, తిట్టడం,indecent and unparliamentary language  తో అసభ్యంగా ఒకరినొకరు దూషించుకొంటున్నారు.ఇది మంచిదికాదు.ఎందుకంటే వారు మాత్రమే కాక ఎవరైనా చదువుతారు కదా!పెద్దవాళ్ళు,స్త్రీలు కూడా.అందువలన కాస్త సం యమనం పాటించమని విజ్ఞప్తి చేస్తున్నాను.బ్లాగు మిత్రులందరికీ అభినందనలు.