14, ఏప్రిల్ 2012, శనివారం

communist China




 వేగంగా అగ్రరాజ్యంగా వృద్ధి చెందుతున్న చైనాతో మనదేశం ఎలా వ్యవహరించాలి అన్నది ముఖ్యాంశం.టిబెట్ ని ఆక్రమించేవరకు మనకు చైనాతో  సరిహద్దు లేదు .తరవాత చైనాతో సరిహద్దు సమస్య తలెత్తింది.1962 లో చైనా మనపై దండెత్తి ఆక్ -సయ్ -చిన్ కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది.పైగా అరుణాచల్ తమదే అంటున్నది.
  రెండవది; మనకు వ్యతిరేకంగా ఉండే పాకిస్తాన్ తో స్నేహం చేసి సహాయం ,చేస్తూ ఉంటుంది. మూడు; ముందు ముందు ప్రపంచంలో వనరులకోసం ,వ్యాపారం ,ఖనిజాల కోసం చైనా, ఇండియా ల మధ్య పోటీ ఉంటుంది అనుకొంటున్నారు.నాల్గు; టిబెట్ పీఠభూమి లో పుట్టే పెద్దనదుల జలాలను ఉత్తరానికి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నది.ఇది జరిగితే మన దేశమే కాక బర్మా,థయిలాండ్, వీత్నాం ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నదీజలాల కొరతను ఎదుర్కోవలసి వస్తుంది.(సింధు, సట్లెజ్ ,బ్రహ్మపుత్ర,సాల్వీన్ మీకాంగ్ నదులు టిబెట్లో జన్మిస్తాయి. )2050 నాటికి చైనా,అమెరికాల తర్వాత మూడవ అగ్రరాజ్యంగా భారత్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, భారత్ల మధ్య వాణిజ్యం పెరుగుతున్నది.ఈ నేపథ్యంలో ఇండియా చైనా పట్ల ఏ విధానాలు అవలంబించాలన్నది పెద్ద ప్రశ్న.మన నాయకులు,నిపుణులు ,మిలిట్రీ ,సివిల్ అధికారులు జాగ్రతగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి.ఈ రెండు పెద్ద రాజ్యాల మధ్య ఘర్షణ రెండింటికి మంచిదికాదు.
  ఏమైనా చైనా పాకిస్తాన్ల మధ్య మైత్రి ,అణు ఆయుధాల ఉత్పత్తి సహకారం దృష్ట్యా మనం కూడా మన బలాన్ని బాగా పెంచుకో వలసి వుంటుంది.కాని సాధ్యమైనంత వరకు చైనాతో సత్సంబంధాలకై ప్రయత్నం చెయ్యాలి.(eternal vigilance is the price of Liberty )అన్నారు కదా!
   ఈ బ్లాగు పరంపరపై పాఠకుల విజ్ఞతకే ,వారి conclusions కి వదిలివేస్తున్నాను.
                    (సమాప్తం )   

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

China-contd-12



 చైనా-11బ్లాగుల్లో Mr.John Keay రచించిన పెద్ద గ్రంథం China-a history (Harper press)ని అనుసరించి క్లుప్తంగా వ్రాసాను.నా అవగాహన,మేరకు ,నా అభిప్రాయాలను ,నా conclusionsతెలియజేస్తున్నాను.ఎవరైనా ఇంకా వివరాలు కావాలంటే జాన్ కే గ్రంథాన్ని చదవ వలసిందే.మొదట ప్రాచీన,మధ్యయుగాలలో చైనా గురించి ;-
  1.మన దేశంలాగే చైనా 5000సం; ప్రాచీన చరిత్ర గల దేశం.ఒకే సంస్కృతి వరుసగా కొనసాగిన దేశం.2.కంఫుసియస్ నీతి శాస్త్రం ,బౌద్ధ మతప్రభావాలతో సమాజం నడుస్తుంది.కాని మత మౌఢ్యం లేదు.3.హాన్ జాతి ప్రజలు ,అత్యధిక సంఖ్యాకులు .చైనీస్ భాష మండలిక భేదాలతో అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.అందువలన మనకన్న ప్రజలు ఐకమత్యంతో ఉండే అవకాశం ఉన్నది.లిపి కూడా ఒకటే.4.మధ్యలో విచ్చిన్నమై అనేక రాజ్యాలుగా విడిపోయినా ఎక్కువ కాలం ఒకే సామ్రాజ్యంలో ఉన్నది.5.ఐనా సరిహద్దుల్లో ఉన్న సంచారజాతులు ( మంగోలులు, తార్తారులు, హూణులు ,మంచూలు,జుర్చెన్లు,టర్కులు,ఉయిఘర్లు  దాడిచేసి సరిహద్దు ప్రాంతాలని ఆక్రమించుకొనే వారు .అందులో  మంగోలులు,మంచూలు,చైనా మొత్తం ఆక్రమించి దాదాపు 4శతాబ్దాలు పాలించారు.చైనా మహాకుడ్యం (Great wall of China ) దండయాత్రలను ఆపలేకపోయింది.6.చైనా ప్రపంచానికి ఇచ్చిన బహుమతులు (gifts)  సిల్కు దారం ,బట్టలు ,పింగాణీ వస్తువులు,కాగితం,ప్రింటింగ్, నావికుల దిక్సూచి .7,పూర్వకాలం నుంచి చైనా ఎగుమతి,దిగుమతి  వ్యాపారాలు చేస్తూ ఉండేది.పేదరికంతో బాటు అధిక సంపదలు కూడా ఉండేవి.8.చైనా భూభాగంలో విస్తరించింది కాని సముద్రాంతర వలసరాజ్యాలు స్థాపించ లేదు.13,14,శతాబ్దాలలో తప్పించి పెద్ద నౌకా బలం ఏర్పాటు చేసుకో లేదు.9.మనదేశం,యూరప్ ,ఈజిప్టు వలె గొప్ప ప్రాచీన కట్టడాలు చైనాలో లేవు.కారణమేమంటే ,ప్రాచీనకాలంలో వారు ఎక్కువగా మట్టి,కర్రwood ఇటుకలు,పెంకులతో పెద్ద కట్టడాలనికట్టేవారు .అవి సిధిలమయేవి.10.మందుగుండు (gunpowder) చైనావారే కనిపెట్టారు కాని దానిని ఎక్కువగా  బాణాసంచా తయారీకి fireworks కే వాడేవారు.వారి నుంచి నేర్చుకొన్న అరబ్బులు,టర్కులు ,యూరపియన్లు దానిని తుపాకులు,ఫిరంగులు తయారు చేయడానికి ఉపయోగించుకొన్నారు
  11.ఇప్పటికీ చైనాలో దర్శించవలసిన వాటిలో ముఖ్యమైనవి.1 బీజింగ్ వద్ద చైనా గోడ 2మొదటి క్విన్ చక్రవర్తి సమాధి దగ్గర నిలువెత్తు వేలకొద్ది మట్టి బొమ్మల సైన్యం(TOY ARMY) 3 తియెన్మెన్ రాజ భవనల సముదాయం.4.పెద్ద బౌద్ధ విగ్రహాలున్న నదీ లోయ.5.సిల్కు వస్త్రాలు ,వాటిపై చిత్రకళ,జేడ్ అనే విలువైన రాళ్ళతో తయారు చేసిన కళాత్మక వస్తువులు.(వచ్చే సారి ఆధునిక  చైనా ,దాని ప్రాముఖ్యం గురించి వ్రాసి ముగిస్తాను.    

12, ఏప్రిల్ 2012, గురువారం

China-contd.-11




  1978లొ డెంగ్-సియాఓ -పింగ్ తన అభిప్రాయాల ప్రకారం ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు.అంతకు ముందే సోవియట్  యూనియంకి ,చైనాకి అభిప్రాయభేదాలు కలిగాయి.1972 లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ విదేశాంగ మంత్రి కిస్సింజెర్ సలహాతో బీజింగ్ వెళ్ళి మావో -సె - జంగ్  ని కలుసుకొని రహస్య చర్చలు జరిపాడు.
  డెంగ్ సూత్రాలలో ఎక్కువగా ఉదహరింప బడే వాటిని బట్టి అతని విధానాలు అర్థమౌతాయి.1.ధనం సంపాదించడం పాపం కాదు.(To get rich is no sin )2.ఎలకల్ని పట్టుతూ వుంటే పిల్లి తెల్లగా వున్నా నల్లగా వున్నా ఫరవా లేదు. (It does not matter whether the cat is black or white as long as it catches mice ) ఈ ఆర్థిక సంస్కరణల ద్వారా జరిగిన మార్పులు; 1.వ్యవసాయం మళ్ళీ ప్రైవేటు రైతు కుటుంబాల చేతులకు స్వాధీనమై ,ఉత్పత్తి పెరిగింది. 2.పరిశ్రమలలో ప్రైవేటు పెట్టుబడి ప్రోత్సహించుట వలన అవి బాగా పెంపొంది ఎక్కువ ఉత్పత్తిని సాధించాయి.3.విదేశీ పెట్టుబడులను,సాంకేతిక సహాయాన్ని ఆహ్వానించుట వలన సంపద, ఉత్పత్తుల నాణ్యత పెరిగింది.4.తీరప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండలులను ఏర్పాటు చేసి నిబంధనలను సడలించడం వలన అక్కడ ఎగుమతి, దిగుమతులు బాగా జరగ సాగాయి. చైనాలో కార్మికశక్తి (Labour power ) చవకగా లభ్యం కాబట్టి ,చవకగా అనేక వస్తువులు ఉత్పత్తి చేసి అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసి విశేషంగా విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్లలో చైనా ఆర్జించింది.
  1980 నుండి గత 30 ఏళ్ళుగా చైనా 10 % జాతీయోత్పత్తి లో అభివృద్ధి సాధించింది.( Fastest growth in G.D.P.) ఇప్పుడు ప్రపంచంలో ఆర్థిక, సైనిక, రంగాలలో మూడవ ప్రబలశక్తిగా రూపొందింది. విద్యా,ఆరోగ్యరంగాలలో కూడా మంచి అభివృద్ధి సాధించింది.
  కాని,చైనాలో స్వేచ్చ,ప్రజాస్వామ్యం లేవు.20 సం;; క్రితం బీజింగ్లో విద్యార్థులు స్వేచ్చ,ప్రజాస్వామ్యం కోసం జరిపిన ఆందోళనని ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. టిబెట్ ,సింకియాంగ్ లలో స్వయమ్నిర్ణయాధికారం కోసం జరిగిన తిరుగుబాట్లను తీవ్రంగా అణచివేసింది.మన దేశంలోవలె స్వెచ్చాయుత ఎన్నికలు లేవు.
   రాజకీయంగా కమ్యూనిస్టు ఏకపక్ష నియంతృత్వం ,ఆర్థికంగా ప్రైవేటు పెట్టుబడిదారి వ్యవస్థ ; ఇది నేటి చైనాలో పరిస్థితి.
   (వచ్చే సారి నా అభిప్రాయాలతో చైనా గురించి ఈ బ్లాగుల పరంపరను ముగిస్తాను.)   

10, ఏప్రిల్ 2012, మంగళవారం

China-contd.-11



 చైనా -1949-2012 ఈ కాలంలో కమ్యూనిస్టు పాలన కొనసాగింది.దీనిని rough గా 1950 నుంచి  1980 వరకు 30 సం;మావో యుగంగాను ,1980 నుంచి 2010 వరకు మావో అనంతరయుగం(post Mao era)లేక సంస్కరణల యుగంగా పేర్కొనవచ్చును.1976లో మరణించేదాకా  మావో తిరుగులేని నియంత.అతని కమ్యూనిస్టు భావజాలం ప్రకారం ,ప్రయివేటు కమతాలు రద్దు చేయబడి,ప్రభుత్వ పరమై ,కమ్యూనిస్టు కార్యకర్తల నిర్వహణలో గ్రామ రైతు సహకారసంఘాలచే వ్యవసాయం చేయబడింది. ( communes) అందరికి  కాంటీన్ల ద్వారా ఉచితంగా భోజన వసతి కల్పించారు.మొదట్లో ఈ విధానం బాగానే ఉన్నట్లు కనిపించింది.పెద్ద రైతులను,భూస్వాములను ప్రజాశత్రువులు గా ప్రకటించి శిక్షించారు.చాలామందిని చంపివేసారు.
  ఈ ఉమ్మడి వ్యవసాయం విఫలమైనది.కష్టించి పనిచేసే రైతులలో సోమరితనం ప్రబలింది.కార్యకర్తలు ఉత్పత్తి తప్పుడు లెక్కలు ,చూపించారు.పెరుగుతున్న జనాభా కి తగినంత ఆహార ఉత్పత్తి జరగలేదు .ఐనా పట్టణాలకి ఆహారం విధిగా ఎగుమతి చేయవలసి వచ్చింది.అందుచే గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వచ్చింది.లక్షలాది ప్రజలు తిండి లేక మరణించారు
 పరిశ్రమల్లో త్వరిత ప్రగతి సాధించాలని ,కుటీరపరిశ్రమల ద్వారా దేశమంతా ప్రయత్నించారు.కాని ఆధునిక వస్తుసముదాయాన్ని,ఉక్కు వంటి వాటిని పాత కొలుముల్లో (furnaces of old model) తయారు చేసినవాటికి నాణ్తత లోపించి ,గిరాకి లేక (massproduction of big modern machines )ముందు విఫలమైనవి.దీనినే గొప్ప ముందంజ ( great leap forward ) అన్నాడు.
  మరొక ప్రతిపాదన కూడా ఆచరణలో విఫలమైనది.మావోయిజాన్ని దేశంలో బాగా ప్రచారం చేసి ,ఆచరించడానికి విశ్వవిద్యాలయాలు,కళాశాలలు ,మూసివేసి అధ్యాపకుల్ని,విద్యార్థులను గ్రామాలకి తరలించారు.ఎర్రసైనికులు (red guards ) అనేపేరుతో యువతీ యువకుల్ని తయారు చేసారు.వాళ్ళు,విప్లవవ్యతిరేకులనుకొన్న వారినందరినీ శిక్షించ సాగారు.
  ఐతే మావో యుగంలో ఏమీ సాధించలేదని చెప్పలేము.భారీ పరిశ్రమలు,విద్యుత్ ప్రాజక్టులు నెలక్ల్పబడినవి.(ప్రభుత్వరంగంలోనే) .విద్య,వైద్య సేవలు ఉచితం చేయబడినవి.స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వబడినవి.చైనా మిలిటరీ బలం బాగా వృద్ధి చెందింది.రోదసీ,అణు ,పరిశోధనలు విజయం సాధించాయి.(space and atomic research) సోవియట్ యూనియన్ ఈ విషయాల్లో  చైనాకి చాలా సహాయం చేసింది.
  1976 లో మవో సె జంగ్  మరణించాక అధికారం కోసం పోరాటం జరిగింది.మావో భార్య జియాంగ్క్వింగ్ ( jiyangqing)ఆమె అనుచరులు(gang of four ) ప్రయత్నాలని వమ్ముచేసి డెంగ్ సి యా వో పింగ్ (Deng tse yao ping )  అతని సహచరులు అధికారం చే జిక్కించుకొన్నారు.జియాంగ్ వర్గం అతివాదులు,డెంగ్ వర్గం మితవాదులు.(మిగతా మరొక సారి    

CHINA-contd.10


 

   జపాన్ యుద్ధకాలంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజాబలం బాగా సంపాదించుకున్నది. మావో సమర్థనాయకత్వం,ఎత్తుగడల వలన కొమింటాంగ్ ప్రభుత్వ సైన్యాలను పూర్తిగా ఓడించగలిగింది.చైనాని దాదాపు అంతటినీ ఆక్రమించింది.చియాంగ్ కై షేక్ లక్ష సైన్యంతో ఫార్మోజా దీవికి (నేటి తైవాన్) పారిపోయి అక్కడ అమెరికా రక్షణలో ప్రభుత్వం కొనసాగించేడు.
 1949లో  బీజింగ్ రాజధానిగా  కమ్యూనిస్టు రిపబ్లిక్ ప్రకటించ బడినది.మావో పార్టీ కార్యదర్శి ఐనా సర్వాధికారి అతడే.అతని సహచరులలో లీ షా చీ (lee shao chi ) రిపబ్లిక్ అధ్యక్షుడు; చౌ ఎన్ లే (chou en lay )  విదేశాంగ మంత్రి; లింబియావో (lin bi yao ) సర్వసేనాధిపతి.
 అసలు చైనా లో భాగాలు కాని (హాన్ జాతి వారి రాష్ట్రాలు కాని ) ప్రాంతాల సంగతి 1.మంచూరియా ; జపాన్ సైన్యాల ఉపసమ్హరణ తర్వాత కమ్యూనిస్టు సైన్యాలు మంచూరియాను ఆక్రమించేయి .2.మంగొలియా ; సోవియట్ యూనియన్ సహాయంతో స్వతంత్ర రాజ్యమైనై.3.ఇన్నర్ మంగోలియా ;ఇక్కడ్డ హాంజాతి ప్రజలు కూడా నివసిస్తూ ఉండటం వలన చైనా రిపబ్లిక్ లో భాగంగా కలిపివేసారు.4.సిన్ కి యాంగ్ ; ఉయిఘర్ జాతి ముస్లిములు ఉన్న ఎడారి ప్రదేశం.వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడినా అణచివేసారు.5.టిబెట్ ; చాలా కాలం ఇది స్వతంత్ర రాజ్యం.బ్రిటిష్ హయాంలో దీనిపై చైనాకి నామమాత్రపు సార్వభౌమ అధికారం ఇస్తూ ఒడంబడిక జరిగింది.దీని ఆధారంగా శాంతికాముకులు,సైన్యబలం లేని టిబెటన్లను అణచివేసి ఆక్రమించుకున్నారు.బౌద్ధ మతగురువు దలై లామా కొందరు అనుచరులతో కలసి రహస్యంగా 1959లో మనదేశానికి పారిపోయి వచ్చి శరణార్థిగా ఉంటున్నాడు.6.తైవాన్ ద్వీపం; అమెరికన్ నౌకా ,రాకెట్ సైన్య రక్షణలో స్వతంత్ర రాజ్యంగా ,ప్రజాస్వామిక విధానంలో ఉన్నది.ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది.7.హాంగ్కాంగ్; లీజు ఒడంబడిక కాలం పూర్తయాక 1999లో ఈ బ్రిటిష్ కాలనీ తిరిగి చైనాలో ప్రత్యేక ప్రతిపత్తితో చేరిపోయింది.ఆర్థికంగా సంపన్నమైన నగరం.
 చైనా సైన్యాన్ని P.L.A.peoples liberation army  అంటారు.            

China-contd.-10


 ౩.ఈలోగా జపాన్ బలపడి కొరియా,మంచూరియా,ఫార్మోజా లను ఆక్రమించింది.చైనాలో కూడా ఉత్తర,తూర్పు భాగాలని వసపరచుకోన్నది .షాంఘై ,నాన్జింగ్ వంటి ముఖ్య నగరాలను ఆక్రమించింది .రాజధాని,పశ్చిమాన చుంకిన్గ్కి తరలించారు.ఈ విపత్కర పరిస్థితులలో కమ్యూనిస్టులు,కౌమింటంగ్ ఒక సమాధానానికి వచ్చి ఉమ్మడిగా జపాన్ ని ఎదుర్కొన్నారు.1939 లో నాజీ జర్మనీ,ఇటలీ ,జపాన్లు కూటమిగా #(axispowers )గా ,అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్ ,చైనాలు మరొక కూటమిగా (allied  powers  )గా రెండవ ప్రపంచ మహాయుద్ధం 6 ఏళ్ళు జరిగింది.చివరికి 1945 లో జర్మనీ ,జపాన్లు ఓడిపోయినవి.జపాన్ తన సైన్యాలను పూర్తిగా ఉపసంహరించుకున్నది.
  తర్వాత మళ్ళీ ఆధిపత్యం కోసం కొమింటాంగ్ కి ,కమ్యూనిస్తులకీ పోరాటం ప్రారంభమైనది.

china-contd-10




 ఐనా అతివిశాలము,అధికజనాభా గల వ్యావసాయిక దేశమైన చైనాలొ గ్రామీణప్రాంతాలు,మారుమూల ప్రాంతాల్లో నిరక్షరాస్యత,పేదరికం ,వెనుకబాటుతనం ఇంకా ఎక్కువగానే ఉండినవి.పట్టణప్రజలు,ముఖ్యంగా యువత లో చైతన్యం ఎక్కువయింది.
   ఇక రాజకీయ పరిణామాల విషయం;; వివరాలలోకి పోకుండా క్లుప్తంగా ఇలాగ సమీక్షించవచ్చును.1.రిపబ్లిక్ స్థాపన తర్వాత ఎన్నికలు జరిగాయి.(కాని అప్పట్లో స్త్రీలకు వోటు హక్కు ఇవ్వలేదు.)  సన్యెట్సెన్ (sun yet sen)అనే యువనాయకుడు చాలా ప్రజాదరణ కలిగిఉండేవాడు.అతనికి దక్షిణ చైనాలో ఎక్కువ బలం ఉండగా ,ఉత్తర చైనాలో యువాన్షికాయ్ (yuvanshikayi) అనే నాయకునికి ఎక్కువ బలం ఉండినది.వీరి మధ్య విభేదాలవలన అంతర్ యుద్ధం జరిగింది.చివరికి సన్యత్సెన్ మరణించాక అతని పార్టీకి కౌమింటాంగ్ పార్టీకి (koumintang party)కి చియాంగ్కైషెక్ (chiyang kai shek ) అనే మిలిటరీ జనరల్ నాయకుడై 1924 నుండి 1949 వరకు చైనాను పాలించాడు.
  ఇతని కాలంలో మావో  సే తుంగ్ (mao tse djang)) నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి బలపడింది .కొమింటెర్న్ (communist international) సలహాలతో నడచింది.నేషనలిస్ట్ కొమింటాంగ్ తో తలపడి పొరాడింది. పారిశ్రామిక దేశాల దృష్టి తో మార్క్స్ రాసిన దానిని గ్రామీణ,వ్యవసాయ చైనాకి మావో అన్వయించి గెరిల్లా పోరాటం కొనసాగించాడు.కొమింటాంగ్ సైన్యాలు వెంట తరుముతూ వుండగా 20000మంది అనుచరులతో 3000 మైల్లు ప్రయాణం చేసి యనాన్ ప్రాంతంలో(మంగొలియా సరిహద్దుకు దగ్గరగా స్థావరాన్ని ఏర్పరచుకొన్నాడు. దీనినే ప్రసిద్ధమైన లాంగ్ మార్చ్ (long march )అని పిలుస్తారు.

9, ఏప్రిల్ 2012, సోమవారం

China-contd-10

చైనా 1911 -1949 రాజరికం అంతరించి రిపబ్లిక్ అవతరించిన తర్వాతి చరిత్ర.మంచూ రాజుల పరిపాలన చివరికాలం లోనే  ఆధునికమైన పరిణామాలు ప్రారంభమై ,20 శతాబ్దంలో కొనసాగాయి.పాస్చ్చాత్య ప్రభావం వల్ల ప్రజాస్వామ్యభావాలు, శాస్త్రీయ ,సాంకేతిక విద్యా వ్యాప్తి జరిగాయి.రైలు మార్గాలు,టెలిగ్రాఫ్,టెలిఫోన్, కార్లు,బస్సులు,లారీల వలన మనుషులు,సరకుల రవాణా,పెరిగి సమాచారసౌకర్యం ఏర్పడింది .వ్యాపారం,పరిశ్రమలు వ్రిద్ధి చెందాయి.స్త్రీవిద్య,హక్కులు పెంపొందాయి.1902 లో బాలికల పాదాలు కట్లతో బంధించే దురాచారం నిషేధింపబడినది.చైనాలో కాగితం,ముద్రణ పూర్వ కాలంనుంచి ఉన్నా ,గ్రంథాలన్నీ పండితభాషలో రాసేవారు.వ్యవహారిక భాషలో వ్రాయడం ప్రారంభమైనది.ఆధునిక ముద్రనాయంత్రాలు ,టైపు మెషీన్ల తో అనేక పత్రికలూ,పుస్తకాలు ప్రచురించడం జరిగింది.పాథసాలలు,కళాశాలలు స్తాపనతో విద్యావ్యాప్తి జరిగింది  

China-contd-10.ain

చైనా 1911 -1949 రాజరికం అంతరించి రిపబ్లిక్ అవతరించిన తర్వాతి చరిత్ర.మంచూ రాజుల పరిపాలన చివరికాలం లోనే  ఆధునికమైన పరిణామాలు ప్రారంభమై ,20 శతాబ్దంలో కొనసాగాయి.పాస్చ్చాత్య ప్రభావం వల్ల ప్రజాస్వామ్యభావాలు, శాస్త్రీయ ,సాంకేతిక విద్యా వ్యాప్తి జరిగాయి.రైలు మార్గాలు,టెలిగ్రాఫ్,టెలిఫోన్, కార్లు,బస్సులు,లారీల వలన మనుషులు,సరకుల రవాణా,పెరిగి సమాచారసౌకర్యం ఏర్పడింది .వ్యాపారం,పరిశ్రమలు వ్రిద్ధి చెందాయి.స్త్రీవిద్య,హక్కులు పెంపొందాయి.1902 లో బాలికల పాదాలు కట్లతో బంధించే దురాచారం నిషేధింపబడినది.చైనాలో కాగితం,ముద్రణ పూర్వ కాలంనుంచి ఉన్నా ,గ్రంథాలన్నీ పండితభాషలో రాసేవారు.వ్యవహారిక భాషలో వ్రాయడం ప్రారంభమైనది.ఆధునిక ముద్రనాయంత్రాలు ,టైపు మెషీన్ల తో అనేక పత్రికలూ,పుస్తకాలు ప్రచురించడం జరిగింది.పాథసాలలు,కళాశాలలు స్తాపనతో విద్యావ్యాప్తి జరిగింది  

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

China-contd-9

౧౮వ శతాబ్దంలో ఉన్నత స్థితిలో ఉన్న మంచూ సామ్రాజ్యం ౧౯వ శతాబ్దిలో కూడా కొనసాగినా ఇబ్బందుల్ని ఎదుర్కొంది.కొంత ప్రతిష్తను కోల్పోయింది.మొదట పేర్కొన్న ఆరుగురు చక్రవర్తుల తర్వాత మరి ఆరుగురు చక్రవర్తులు పాలించారు.చివరి నలబది సంవత్సరాలు నామమాత్రంగా ఇద్దరు చక్రవర్తులు ఉన్నా చిక్సీ అనే రాజమాత తెర వెనుక నుంచి పరిపాలన నిర్వహించింది.
   బ్రిటన్,ఫ్రాన్స్ ,పోర్చుగల్ ,హాలండ్ వంటి పాశ్చాత్య దేశాలు అప్పటికే ఇతర దేశాల్లో సామ్రాజ్యాలు స్థాపించుకొని ,చైనాలో వర్తకం,స్థావరాలు,రేవు పట్టణాల్లో ఆధిపత్యం గురించి చైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ,రాయితీలు రాబట్టే వారు.
  ఇండియాలో తమ స్వాధీనంలో ఉన్న ప్రాంతాల్లో గంజాయి పంటను ప్రోత్సహించి  బ్రిటిష్ వారు దానిని చైనా వర్తకులతో కలసి ఆ దేశానికి ఎగుమతి చేసేవారు .ఇండియా ,ఛీ నాలలో  పూర్వకాలం నుంచి నల్లమందు వైద్యానికి వాడేవారు.కాని దానిని వ్యసనంగా మార్చి ప్రజలని దానికి బానిసలుగా చేసారు.గంజాయిని నిషేధించి ,మాన్పించడానికి ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమైనవి.ఈ విషయంలో బ్రిటిష్ ,చైనా నౌకా దళాలకు పోరాటం జరిగింది.అందులో చైనా ఓడిపోయింది.దీనినే నల్లమందు యుద్ధం అంటారు.ఇది చైనా దేసభక్తులకు అవమానం గా తోచింది.
   స్వతహాగా హాన్జాతి వారికి మంచూ జాతి మీద గల వైమనస్యం తిరుగుబాట్లకు దారితీసింది.ఇందులో ముఖ్యమైనది ఎర్ర తలపాగాలు లేక red  Turbans  అనే సంఘం వారి తిరుగుబాటు.
  ఎక్కువ కాలం ,దాదాపు ఇరవయి సంవత్సరాలు జరిగిన ఉద్యమం,విప్లవం టైపింగ్ తియాన్గో '(heavenly kingdom of great peace )1899 లో తీవ్రమైనది.హాంగ్ క్సిక్వాన్ అనే యువకుడు క్రైస్తవ మాట ప్రభావం చేత తనను తాను ఏసుక్రీస్తు అపరావతారంగా భావించుకొని ప్రకటించుకొన్నాడు. 20000మన్ది అనుచరులను సంపాదించి యాన్గ్సీ నదీ ప్రాంతాన్ని ,అక్కడ కొన్ని నగరాలను స్వాధీన పరచుకొన్నాడు.కొంత సైన్యాన్ని రాజధాని బీజింగ్ పైకి ముట్టడికి పంపించాడు.కాని మంచూ రాజులు విదేశీ సైనిక సహాయంతో ఈ తిరుగుబాటుని అణచివేశారు.
  ఉత్తరాన రష్యా సామ్రాజ్య విస్తరణ ఆందోళన కలిగించింది.జపాన్ కూడా బలపడి కొరియా,మంచూరియాలను ఆక్రమిన్చెఅ ప్రయత్నం చేసింది.కాని అగ్రరాజ్యాల పరస్పర వైరుధ్యాల వలన రష్యా,జపాన్ల ప్రయత్నాలు ఫలించలేదు .
 మరొక ముఖ్యమైన తిరుగుబాటు మల్లయోధుల తిరుగుబాటు Boxers rebellion .కాని ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు.విదేశీయులు,వారి మతస్తులైన క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగింది.చాలామంది క్రైస్తవుల్ని ,మిశానరీలను చంపేశారు.చర్చీలను ద్వంసం చేసారు.కాని ప్రభుత్వం చూస్తూ మిన్నకుండింది.అంతర్జాతీయంగా దీనిపై తీవ్ర ఆందోళన కలగడంతో పాశ్చాత్య దేశాలు తమ సైన్యాలు పంపి ఈ తిరుగుబాటుని అణచివేసాయి.
 19va శతాబ్దంలో జాతీయ, అంతర్జాతీయ మార్పులు చాల జరిగాయి.శాస్త్రీయ విజ్ఞానం పెరిగింది.ఆధునిక విద్య,భావాలు అభివ్రిద్ది చెందాయి.రైలు మార్గాలు,టెలిగ్రాఫు వంటివి ప్రవేశ పెట్టబడినవి.స్త్రీలపై నిర్బంధాలు కొన్ని తొలగించారు .అందంకోసం బాలికల పాదాలు ఎదగకుండా కట్లు కట్టే దురాచారం నిషేధింపబడినది.
   సరిహద్దుల్లో తిరుగుబాట్లు జరుగుతూ ఉండేవి.కేంద్ర ప్రభుత్వం బలహీనపడి రాష్ట్ర గవర్నర్లు, పాలెగార్లు బలపడ్డారు.
   ఈ నేపధ్యంలో జాతీయ,ప్రజాస్వామిక  ఉద్యమం విజయవంతమై ,రాజరికం తొలగింపబడి రిపబ్లిక్ స్థాపించబడినది.అప్పటి చక్రవర్తి పేరు  పీ-యూ.చంతిపిల్లవాడు .అందువలన సంరక్షకులతో రాజప్రాసాదం లోనే ఒక భాగం లో ఉంచారు. 1911 లో రిపబ్లిక్ ప్రకటించబడి చైనా రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ఆధునిక యుగంలోకి అడుగుపెట్టింది.కాని ముందు ముందు ఎన్నో అంతర్పోరాటాలు,యుద్ధాలు,రక్తపాతం,కరవుకాటకాలు అనుభవించింది.
   (మిగతా మరొక సారి.)

5, ఏప్రిల్ 2012, గురువారం


2, ఏప్రిల్ 2012, సోమవారం

కమనీయం: CHINA-CONTD.=8

కమనీయం: CHINA-CONTD.=8

CHINA-CONTD.=8

 
  
 మింగ్ చక్రవర్తులలో చివరి వాడైన 'చోంగ్జెన్ 'ఆత్మహత్య చేసుకొన్నాక 'మంచూ ' సైన్యం రాజధాని బీజింగ్ ని ఆక్రమించుకొన్నది.కాని,మిగతా చైనా సామ్రాజ్యాన్ని ,సరిహద్దులలోని అనేక తెగల,జాతుల రాజ్యాలను ఆక్రమించడానికి 40 సంవత్సరాలు పట్టింది.మింగ్ రజవంశీయులి,సైనికాధికారులు చాలా తిరుగుబాట్లు లేవదీశారు.కొందరు మంచూ పక్షం చేరారు.తిరుగుబాటు దార్లలో ముఖ్యులు 'లీజిచెంగ్ ' ,'జెంగ్ చెంగాంగ్ 'అనేవారు.తీవ్రమైన పోరాటాల తర్వాత,విపరీతమైన జననష్టం,రక్తపాతం,నగరాలవిధ్వంసం జరిగాక మంచూలు తిరుగుబాట్లన్ని అణచివేశారు.యునాన్ కొండప్రాంతం,ఫార్మోసా (నేటి తైవాన్ ) తో సహా చైనా అంతా వారి అధీనంలోకి వచ్చింది.జుంగారియా, సింకియాంగ్ వంటి సరిహద్దు ప్రాంతాలు కూడా ఏళ్ళ తరబడి పోరాటాల తర్వాత వారి వశమైనవి.ఇవి బీడునేలలు,ఎడారులు.ఐనా చైనా రక్షణకి అవసరమని వీటిని ఆక్రమించారు. చివరగా లామాల అంతహ్ కలహాలను ఉపెయోగించుకొని టిబెట్ని కూడా ఆక్రమించారు.కాని అక్కడ కొద్ది సైన్యాన్ని,అధికారులను మాత్రం ఉంచి ఉపసమ్హరించుకొన్నారు.
   మంచూ రాజులు లామాలని గౌరవించేవారు.వజ్రయాన బౌద్ధమతాన్ని అనుసరించేవారు. చాల బౌద్ధ ఆలయాలను కట్టించారు.క్రీ.శ.1620నుంచి,1820 వరకు 7గురు చక్రవర్తులు పాలించారు.అందులో ముగ్గురు బాగా ప్రసిద్ధులు.వీరు ముగ్గురు మొత్తం 100 ఏళ్ళు పాలించారు.వీరి పేర్లు వరసగా ,'కాంగ్ క్సీ ' ,యోంగ్జెంగ్ ,'క్వియన్లాంగ్ ' .యుద్ధభూమిలోనేగాక పరిపాలనలో కూడా సమర్థులే.అటు మంచూ,మంగోలు ,సంస్కృతులు,ఆచారాలతో బాటు ,ఇటు చైనా హాన్ జాతి సంస్కృతి, ఆచారాలను కూడా పాటించారు.బొద్ధమతాన్ని.కంఫూసియస్ నీతిని కూడా అనుసరించేరు.    సాహిత్యాన్ని,కళలను పోషించారు.ఈ కాలంలో చైనా వైశాల్యంలోనే గాక సిరిసంపదలలో కూడా ప్రముఖంగా ఉన్నట్లు విదేసీ యాత్రికుల వ్రాతల వలన తెలుస్తోంది.ప్రధానంగా సిల్కు వస్త్రాలని ,పింగాణీ వస్తువుల్ని ఎగుమతి చేసి ,నూలు వస్త్రాలను ,సుగంధద్రవ్యాలను దిగుమతి (మన దేశం,ఇండొనీసియా దీవులనుండి ) చెసుకొనేది .ఈ వ్యాపారాన్ని పోర్చుగెసు,డచ్ ,ఇంగ్లీషు వర్తకులు చేజిక్కంచుకొని బాగా లాభాలు పొందేవారు.
  ఐతే మంచూ రాజుల నిరంకుశత్వం చినా వారికి పడలేదు.ముక్ఖ్యంగా వారి ఆచారం అంటే మగవారందరూ తలవెంట్రుకలు ముందుభాగంలో గొరిగించుకొని ,వెనక జుత్తు జడ వేసుకోవాలని నిబంధన.కాని దీనిని ఇష్టం లేకపోయినా పాటించకతప్పలేదు.లేకపోతే కఠిన శిక్షలు పడేవి.మనం ఈ దృశ్యాలను చైనా కుంగ్ఫూ,కరాటే సినిమాల్లో చూడవచ్చును.
  చైనా చక్రవర్తులు విదేశీ రాయబార్లను లెక్క చేసే వారు కాదు.అప్పటి బ్రిటిష్ రాజు జార్జి 3 రాయబారితో కానుకలు పంపిస్తే ఇవన్నీ మాకు ఉన్నాయి ,అవసరం లేదని పంపించేసాడు.
     ఈ వంశాన్ని '  క్వింగ్ మంచు ' వంశం అంటారు.(మిగతా మరొక సారి)