30, డిసెంబర్ 2011, శుక్రవారం

wlnter


 

  ఈ హేమంత నిశాంత వేళల నహో ,హీరప్రభల్ వెల్గుచున్,
  నీహారాంబు పరీత పత్ర లతికల్ నీరాజనమ్మెత్త స
  మ్మోహాత్మప్రకృతిన్ బహుసుమామోదమ్ము ,శేవంతి భూ
  షాహారమ్ముల ,పౌష్య లక్ష్మికి విలాసంబెంతొ రంజిల్లెడిన్.
                 ---------------------  
   

27, డిసెంబర్ 2011, మంగళవారం

lokpal bill


 

  లోక్పాల్ బిల్ కోసం శాంతియుతంగా ఆందోళన,సత్యాగ్రహం,చేయవచ్చును.కాని,పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టాక,కావాలంటే సవరణలు తేవచ్చును.అంతిమ నిర్ణయం మాత్రం పార్లమెంటుదే.నచ్చకపోతే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ని ఓడించి మీ ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకొండి.ప్రజాస్వామ్యంలో ఇదే సరి ఐన పద్ధతి .కాని మన పత్రికలు,టీ.వీ.చానెళ్ళూ,విశ్లేషకులూ ,రచయితలూ,కాంగ్రెస్ వ్యతిరేకులు .వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వం చెయ్యాలని మొండి పట్టు పట్టుతారు.
      
  

26, డిసెంబర్ 2011, సోమవారం

vipranarayana


 

 చాలా కాలం తర్వాత నిన్న మళ్ళీ'  విప్రనారాయణసినిమా'టీ.వీ.లో చూసాను.చిత్రం పాతదైనా బాగున్నది.భానుమతి, నాగేశ్వరరావు  ,బాగా నటించారు.చిత్రానికి హైలైట్ రాజేశ్వరరావు సంగీతం.భానుమతి పాడిన జావళీలు,ఆవిడ ఏ.యం.రాజాతో కలిసి పాడిన యుగళ గీతాలు,చా లా మధురంగా ఉంటాయి.భానుమతి సోలో 'ఎందుకోయీ తోటమాలీ ',పాట,ఏ.యం. రాజా సొలో ,'చూడుమదే చెలియా ' పాట ఇప్పటికీ విండానికి ఎంతో హాయిగా ఉన్నాయి.
   ఈ సినిమా సారంగు తమ్మయ అనే కవి (16వ శతాబ్దం)రచించిన 'వైజయంతీ విలాసం' అనే ప్రబంధం ఆధారంగా తీసారు.విప్ర నారాయణుడు శ్రీ రంగం లో జీవించిన చారిత్రక వ్యక్తి అని,7వ శతాబ్ది వాడని చరిత్రకారుల అభిప్రాయం.12మంది ఆళ్వారులలో ఒకడని ,తమిళంలో 'తొండరడిప్పొడి ఆళ్వారు '  అని అంటారు.
        ఆ పాటలను టెక్నిక్ తెలిసినవారు ఎవరైనా వారి బ్లాగులో చేర్చి వినిపిస్తే సంతోషిస్తాను.   

chalam samaadhi


 

 26-12-11 ఆంధ్రజ్యోతిలో చలం సమాధి గురించి రంగనాయకమ్మగారు రాసిన వ్యాఖ్యతో చాలావరకు ఏకీభవించవచ్చును.మరణించినవారికి సమాధి కట్టినా ,వారి పుస్తకాలు మనం దాచుకొన్నా   ,చదివినా వాళ్ళకేమీ తెలియదు కదా.ఏమి చేసినా మనకోసమే.వారి వంశీకులు .,అనుచరులు,అభిమానుల ,భక్తుల,తృప్తి కోసమే.సెంటిమెంట్  కోసమే.ఐతే ,మృత దేహాలనుగాని,మమ్మీలనుగాని భద్రపరచే సంప్రదాయం మనకి లెకపోడం మంచిదే.బుద్ధుడి అస్తికల మీదేకదా స్తూపాలను నిర్మించారు. అవి బౌద్ధ మత ప్రచారానికి ఆలవాలమైనాయి.ఏ సమాధి,ఏ పుస్తకం   ఏ కళాఖండం, ఎంతకాలం నిలుస్తుందో  ఎవరూ చెప్పలేరు కదా! ఏమైనా సమాధుల  కోసం ఆవేశం,పెంచుకోడం, తగవులాడుకోడం విజ్ఞత కాదు.కాని కొందరు విశిష్ట వ్యక్తులమరణానంతరం సమాధులో,స్మారక చిహ్నాలని ఏర్పరచడం జరుగుతూనేవుంటుంది.
                                                 
   

23, డిసెంబర్ 2011, శుక్రవారం

saradaga


  బాల్యంలో బాడ్మింటన్ లో -ప్రావీన్యంకోసం
  ప్రయత్నించి  విఫలుడ నయ్యాను.
  యౌవనం లో సంగీతం నేర్వాలని
  స్వరజతులను  దాటలేక పోయాను.
  నడివయస్సులో సైకాలజీ నేర్వాలని
  అడియాస లే అయినాయి.
  వృద్ధాప్యం లో వేదాంతం చదివితే
  వేడెక్కి పోయింది తల
   మన గమ్యాలన్నీఎందుకో
  మహా దూరంగానే ఉంటాయి.
      ---------------------                   

12, డిసెంబర్ 2011, సోమవారం

harikatha




 నిన్న ఒకరి ఆహ్వానంపై హరికథా ఉత్సవానికి వెళ్ళాను.ఉదయం నుంచి రాత్రి వరకు ,ఒక్కొక్కరు గంట  చొప్పున కథాగానం చేసారు.నేను రెండు కథలు మాత్రం ,రామదాసు ,తులసీదాసు కథలు బాగా చెప్పారు.ఆడిటొరియం నిండి పోయింది .ప్రేక్షకుల స్పందన బాగున్నది.మరుగున పడిపోతున్న ఈ కళారూపం ఇంకా శ్రీకాకుళం జిల్లాలో ఇంకా సజీవంగా ఉన్నట్లు అనిపించింది.కొన్ని దేవాలయాల్లో కూడా హరికథలు చెప్పిస్తున్నారు.ఇది సంతోష కరమైన పరిణామమే. 

6, డిసెంబర్ 2011, మంగళవారం

devanand



 సుప్రసిద్ధ సినిమా నటుడు దేవానంద్ తన 88వ ఏట లండన్లో మరణించిన వార్త అందరూ చదివే ఉంటారు.1948నుండి దాదాపు 1968 వరకూ ముగ్గురు నటులు ఒక వెలుగు వెలిగారు.రాజ్కపూర్,దిలీప్కుమార్, దేవానంద్ త్రిమూర్తులు.రాజ్ కపూర్ మంచి దర్శక నిర్మాత,షోమన్ గా,కూడా పేరు పొందేడు.దిలీప్ కుమార్,ముగ్గురిలోకీ గొప్ప నటునిగా ,ట్రాజెడీ కింగ్ గా పేరు పొందాడు.దేవానంద్ లైట్ కామెడీ చిత్రాలకీ ,సిటీ స్లికెర్ గా పేరు గాంచాడు.అందగాడు.handsome hero ఇండియన్ గ్రెగరీ పెక్ అని బిరుదు పొందేడు. అతని హెయిర్  స్టైల్  ,పఫ్ తో యువకులు అనుకరించే వాళ్ళు. ప్రసిద్ధనటి గాయని  సురయా ,అతను ప్రేమించుకొన్నారు.కాని ఇద్దరి మతాలూ, వేరవడం చేత పెళ్ళి చేసు కో లేక పోయారు. తర్వాత దేవానంద్ ఇంకొ నటి కల్పనా కార్తిక్ ని వివాహం  చేసుకొన్నాడు.పాపంసురయాజీవితాంతం  అవివాహితగానే ఉండి పోయింది.దేవానంద్  నవకేతన్ సంస్థ స్థాపించి గైడ్ వంటి కొన్ని మంచి చిత్రాలు కూడా తీసాడు. 1970 తర్వాత కూడా చాలా సినిమాలు తీసి,నటించాడు కాని అవి అంత విజయం సాధించలేదు.అతని heyday అయిపోయింది.రాజేష్ ఖన్నా ,అమితాభ్ శకం ప్రారంభమయింది. dadasahebphalke award,filmfare lifetime achievement awardలతో సత్కారం పొందేడు. 'గాతా రహే మెరా దిల్ '  

  

30, నవంబర్ 2011, బుధవారం

kandam.contd.


   విందగు జవ్వనమును కడు
   నందముగా గడుప వలయు  నా పిమ్మట నీ
   కుం దగు ,తామరపై జల
   బిందువు వలె జీవితమ్ము వెచ్చింప దగున్
                  --------------

    ఎందో,ఏమో అటు  జరి
    గిందని తబ్బిబ్బగు ప్రజ ,కేలకున ఘోరా
    క్రందన లం దీన జనులు
    క్రున్దుట జూచియును సరకు గొనరది ఏమో .
                ---------------

27, నవంబర్ 2011, ఆదివారం

rendu kandalu.


  పస లేని వంటకమ్మును
  రసహీన మయిన కవితయు ,రాగము తాళం
  బెసగని సంగీత పటిమ
  వెస కరుణ రహిత మతమును  విడువంగ దగున్ .
                 --------------------                            
   వృత్తులలో వ్యవసాయము ,
  పుత్తడి లోహముల యందు ,పువ్వుల పద్మం
   బత్తారు లందున జాస్మిన్
   అత్తరు ణుల యందు పత్ని అధికము సుమ్మీ.
                     ---------------                

21, నవంబర్ 2011, సోమవారం

ghantasala


   ఓ ఘంటసాలా , మధుర సంగీత లోలా , గంధర్వ లోక వాసీ  భూతలప్రవాసీ,
  జనరంజనము చేయ  చనుదెంచి  మరలావు, మా గుండెలో నిలిచి రాగమై మ్రోగావు,
  నీలాల గగనాన నిండిన వెన్నెలలో ,నీలిమేఘాలలో గాలికేరటాలలో
  కొండగాలి తిరిగితే  గుండె వూసులాడితే ,నీవు పాడిన పాట వినిపించు నేవేళ ,=ఓ ఘంటసాలా =
   మది శారదాదేవి మందిరమే నీకు  ,మధు మురళీగాన మాధుర్యమే నీవు,
  శివ శంకరీమంత్ర చింతనను చేసావు ,ఆలపించితివి గీతా సుధా బోధనలు నీవు ,=ఓ ఘంటసాలా =
   మోహనము పాడితే మోహనాస్త్రముగాదె ,కల్యాణి నీ నోట కళ్యాణ శుభకారి ,
   పాడుతా తీయగా అని పాడేవు అద్భుతముగా ,మరువ లేని మనీషీ ,మరలి రాని మహతీ .=ఓ ఘంటసాలా =

      డిసెంబర్ నాలుగో తేదీ ఘంటసాల జయంతి లో పాడుటకు నేను రచించిన పాట.
 
 .

17, నవంబర్ 2011, గురువారం

hevakamu


  పద్యమొ గద్యమో,గేయమొ,
  హృద్యము గా నుండ  వలయు ,హేవాకము రస సం
  వేద్యము గా నుండి మధుర
  వాద్యము మ్రోగించి నటుల  వర్ధిలవలయున్
   
              -------------
   నన్నయ ,తిక్కన ,పోతన
   చెన్నుగ నా భట్టుమూర్తి ,శ్రీ నాదా దుల్ ,
   ఎన్నాల్లయినను  రసికుల
   మన్ననలను  పొందు చుండు  మహనీయ గుణుల్ .
               --------------        
      

16, నవంబర్ 2011, బుధవారం

kandam


 కందము మాకందము,మా
 కంద తరుఫల సుమధుర మరందము ,విందౌ
 డెందము ,కందలితమ్మౌ
 నందపు కందమ్మే వ్రాయ నభిమతమౌ గా .
                  ------------      
 వాద్యముల వీణ శ్రేష్టము
 పద్యము లన్నింట కంద పద్యము మేలౌ
 మద్యమ్ములలో  వైనును
 విద్యలలో వైద్య విద్య  అద్యంబగుగా
               ------------

14, నవంబర్ 2011, సోమవారం

bombay


  గగన హర్మ్యముల గంధర్వ నగరం ==కోట్లకు పడగెత్తిన కుబేర పురం
  దరిద్ర దేవత అనుంగు బిడ్డల=కుచేల వాటిక
  తిమిరలోకపు వికృత  రూపం =చీకటి దారుల గజిబిజి లోకం
  విపర్యయాల వ్యత్యాసాల =విపరీతాల పద్మ వ్యూహం
  చిత్ర జగతి నేలె =విచిత్ర జీవుల కేళీ వినోదం
  చీమల బారుల శ్రామిక జీవుల =పుట్టలలో  పాముల ఆక్రమణ
  క్షణము విరామమెరుగక =పరిభ్రమించు జనయంత్రం
  సకల సంపదల సంసోభితం=స ర్వ జాతుల సమాహారంm ra
                      క్వీన్స్ నెక్లెస్
  మనిదీపాల సుందరహారం =శక్రచాపపు సప్త వర్ణములు
     మురిపించే మనోహర దృశ్యం
       ది సిటీ దట్ నెవెర్ స్లీప్స్
  వలసకు వచ్చే ప్రజలకు =బతుకు తెరువగు ఆశా దీపం
       అందరికీ అన్నీ అగుచును
  లక్షలాది ప్రజలకు =భిక్ష నొసంగుచు
  గర్భంలో దాచుకొనే =కామిత దాయని
         కరుణా హృదయిని
  కాదిట పొమ్మను =కఠిన చిత్త కూడా
            ------------------
 
         

11, నవంబర్ 2011, శుక్రవారం

yuganta


 

 ఇండియన్ మినర్వా గారు యుగాంత గురించి రాసిన విషయాల గురించి;=మన కళ్ళేదుటే జరుగుతున్న చరిత్ర గురించే భిన్నాభిప్రాయాలు ఉన్నవి.4,5,వేల క్రితం   జరిగిన విషయాల గురించి రకరకాల వ్యాఖ్యలు ఉండటంలో ఆశ్చర్యం లేదు.అలాటి వ్యాఖ్యల్లో యుగాంత ఒకటి మాత్రమే .దానితో మనం పూర్తిగా ఏకీభవించనక్కర లేదు.జయాఅనే చిన్న కావ్యమే విస్తరించి మహా భారతమైనది.జైమిని భారతం వ్యాస భారతం కన్న కొంత భిన్నంగా ఉంటుంది.ముందు మీరుకవి త్రయంవారి ఆంధ్ర మహాభారతం ( పద్యకావ్యం కాకపోయినా వచనంలో epic  అనే దృష్టి తో చదవండి.కొంతమంది హీరోలను deify చెయ్యడం ఇతరదేశల్లో కూడాఉంది.సముద్రంలో మునిగిన ద్వారక సిధిలాలు బయట పడడం తో మూలకథ నిజమని తెలిసింది.కాని interpretations మాత్రం మారుతాయి .భారతం పూర్తిగా చదివాక మీ అభిప్రాయాలు మీరే ఏర్పరచు కోవడం మంచిది.;=     కమనీయం.   

31, అక్టోబర్ 2011, సోమవారం

genome


 aటీవల జన్యు శాస్త్రంలో పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నవి.మన దేశం కూడా ఇందులో  అగ్రగామి గా ఉంది .ఒక వ్యక్తీ జేనోమ్ ని అంటే శరీర కణాలలో ఉండే ,వారసత్వాన్ని సంక్రమింప జేసే  డి.యన్.ఎ .వంటి మాలిక్యూల్స్ ని కల్పి జేనోమ్ అంటారు.ఇప్పటికి ముప్పయి ఐదు వేలు జీన్స్ ని కనుగొన్నారు.వీటిని  చిత్రించుట (మాపింగ్ )ద్వారా ఆ వ్యక్తీ కి సంక్రమించే వ్యాధులు,మధుమేహం ,రక్తపోటు ,కీల్లవాతం,కేన్సరు, మొదలైన వాటిని తెలుసుకొని ముందుగానే తగిన చర్యలు,జాగ్రతలు తీసుకోవచ్చును.ముందు కాలం లో ఈ జేనోమ్ సీక్వెన్సింగ్ అనే శాస్త్రం ఒక విలువైన పెద్ద పరిశ్రమ ఔతుంది అని అంటున్నారు.

30, అక్టోబర్ 2011, ఆదివారం

is the world better?

  sankalini.org అవును అంటున్నారు కొందరు అమెరికన్ రచయితలు.తాత్కాలిక ఘటనల బట్టి గాక గత ౫౦ ఏళ్ళ దీర్ఘ చరిత్రను గణాంకాలను చూడమంటున్నారు.క్లుప్తంగా వారి వాదనలు ఇవి  .
 ౧.వలస సామ్రాజ్యాలు అంతమై అన్ని దేశాలు స్వతంత్రమైనవి.
 ౨.చాలా దేశాల్లో నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం ఏర్పడింది.
 ౩.చిన్న యుద్ధాలు ,తిరుగుబాట్లు తప్ప పెద్దయుద్ధాలు జరగలేదు.
 ౪.మొత్తం మీద ప్రజల జీవన ప్రమాణం పెరిగింది. 
 ౫.ఆధునిక సౌకర్యాలు దాదాపు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు లోకి వచ్చాయి. 
 ౬.సగటు ఆయుప్రమాణం ౭౦ కి పెరిగింది.మాతా శిశు మరణాలు తగ్గాయి. 
 ౭.అక్షరాస్యత ,సగటువిద్యా వృద్ధి చెందాయి.
 ౮.కొన్నిదేశాలలో తప్ప స్త్రీలకి సమానహక్కులు, స్వేచ్చ లభించాయి.
 ౯.శాస్త్ర విజ్ఞానం ,టెక్నాలజీ అద్భుతంగా పురోగమించాయి.
   దీనికి వ్యతిరేకంగా పెర్యావరణం దెబ్బ తినడం .జనాభా ఎక్కువగా పెరగడం ,ఉగ్రవాదం, అణుntiయుద్ధ భయం ,మానవ సంబంధాల విచ్చిత్తి  వంటివి ఉన్నాయని అంగీకరిస్తూనే మానవజాతి వాటిని అధిగమించగలదని అంటున్నారు.ఇంకా మంచి భవిష్యత్ కి పురోగామించాగాలమని ఆశా వాదం వెలి బుచ్చు తున్నారు 

26, అక్టోబర్ 2011, బుధవారం

papa




 నా పాపను నేను మళ్ళీ పెంచుతే.
-----------------------            
  నా పాపను నేను మళ్ళీ పెంచుతే
  వేళ్ళకు రంగు పూస్తాను కాని ,నా తర్జని తో బెదరించను
  సవరించడానికన్నా సమాధానానికి ప్రయత్నిస్తాను
  గడియారాన్ని చూసే కన్నా  కళ్ళతో పాపను కనిపెట్టుతాను

   పాప గురించి ఎక్కువ తెలుసుకొనే కన్నా ,దాని క్షేమాన్ని బాగా తెలుసుకొంటాను
   పాపతో బాగా విహరిస్తాను  గాలిపటాలను ఎక్కువ ఎగరేస్తాను
   జాగ్రతలు కఠినంగా తీసుకొనే కన్నా ,జాగ్రతగా పాపతో ఆడుకొంటాను
   చక్కని తోటల్లో తిరుగుతాము  ,చుక్కల్ని చూసి  ఆనందిస్తాము

    ఎక్కువ చేరదీసి కౌగలిస్తాను ,తక్కువ వెనక్కి లాగుతాను
    స్వల్పంగా కఠినత్వం వహిస్తాను, అధికంగా ఆమోదిస్తాను
    మొదట ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తాను, పిదప ఆత్మ గృహాన్ని నిర్మిస్తాను
    అధికారంపై మమకారాన్ని తక్కువ చేస్తాను
     మమకారపు శక్తి గూర్చి అధికంగా బోధిస్తాను.    free translation of Diane Loomans 'Full esteem ahead              

papa




 నా పాపను నేను మళ్ళీ పెంచుతే.
-----------------------            
  నా పాపను నేను మళ్ళీ పెంచుతే
  వేళ్ళకు రంగు పూస్తాను కాని ,నా తర్జని తో బెదరించను
  సవరించడానికన్నా సమాధానానికి ప్రయత్నిస్తాను
  గడియారాన్ని చూసే కన్నా  కళ్ళతో పాపను కనిపెట్టుతాను
 
   పాప గురించి ఎక్కువ తెలుసుకొనే కన్నా ,దాని క్షేమాన్ని బాగా తెలుసుకొంటాను
   పాపతో బాగా విహరిస్తాను  గాలిపటాలను ఎక్కువ ఎగరేస్తాను
   జాగ్రతలు కఠినంగా తీసుకొనే కన్నా ,జాగ్రతగా పాపతో ఆడుకొంటాను
   చక్కని తోటల్లో తిరుగుతాము  ,చుక్కల్ని చూసి  ఆనందిస్తాము

    ఎక్కువ చేరదీసి కౌగలిస్తాను ,తక్కువ వెనక్కి లాగుతాను
    స్వల్పంగా కఠినత్వం వహిస్తాను, అధికంగా ఆమోదిస్తాను
    మొదట ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తాను, పిదప ఆత్మ గృహాన్ని నిర్మిస్తాను
    అధికారంపై మమకారాన్ని తక్కువ చేస్తాను
     మమకారపు శక్తి గూర్చి అధికంగా బోధిస్తాను.                 

కమనీయం: dattapadi

కమనీయం: dattapadi

21, అక్టోబర్ 2011, శుక్రవారం

dattapadi


 క్రాంతి పథంమున జనుడీ
 భ్రాంతిని  త్యజియించి  విప్లవానల  సి  ఖలన్
 కాంతిని జిమ్ముచు  సతతము 
 శ్రాన్తిని బొందక  శ్రమించు  సాహసులారా .

13, అక్టోబర్ 2011, గురువారం

silalu


  రాయి రాయి  రాపాడ  రవ్వలే  పైకెగయు 
  రాయి రాయి  అతికిన  రాజ భవనంమౌను
  ఉలికి ఒదిగి ఒదిగి  ఉప్పొంగు నా శిలలు 
  శిల్ప సుందరి  జూచి  ప్రేమించే  పిగ్మాలియన్ 
  పాషాణ హృదయమని  పరుషమ్ము లాడే దవు
  పాషా ణ మున  దాగి  ప్రవహించు  జలధార 
  కష్టించి  చెమటోడ్చి  కట్టిరి  శిలలతో 
  మానవు లేన్నెన్నో మహనీయ హర్మ్యాలు
  కక్ష తో నవి ఎన్నో కాల్చి కూల్చిరి వారే 
  అతి విచిత్రపు జీవు లవని నీ మనుజులే  
                     --------------




12, అక్టోబర్ 2011, బుధవారం

కమనీయం: samasya pooranam

కమనీయం: samasya pooranam

samasya pooranam

కార్యము లెల్ల సక్రమము గా సరి జేసి కొనంగ నాపయిన్ 
'శౌర్య'యనెండి చిత్రమును  చక్కగ జూడగ  జాల వేడుకన్ 
భార్యను గూడి యిల్వేడల  పశ్చిమ దిక్కున నస్తమిన్చగా
సూర్యుడు ; చంద్రుడున్ బొడమే చుక్కలు పెక్కులు నిక్కు చుండగన్ .


11, అక్టోబర్ 2011, మంగళవారం

10, అక్టోబర్ 2011, సోమవారం

కమనీయం: new poem

కమనీయం: new poem

new poem


  నరునకు పరమాత్ముడు దయ 
 సిరులెల్ల యొసంగి పంపే ,ధరణికి; ఐనన్ 
 అరిషడ్ వర్గమ్ములచే 
 నరకమ్ము గ జేసి కొనియె  నా స్వర్గమ్మున్  
  

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

heritage buildings

ఈమధ్య ఒక వారపత్రికలో వరుసగా తెలంగాణలో ఘధీల గురించి వ్యాసాలూ వస్తున్నాయి.ఇవి కోటలంత పెద్దవీ,గట్టివీ కాదు .మామూలు ఇళ్ళ వంటివీ కాదు.చిన్న జాగీర్దార్లు ,దొరలూ కట్టించుకోన్నవి.వీటిని కోస్తా జిల్లాలలో దేవిడీలని అంటారు.ఇవి కొన్ని మాత్రం బాగున్నవి.చాలా శిధిలం ఔతున్నవి.౧౦౦ సం;దాటిన కట్టడాలు హీరిటాజ్బిల్డింగుల కింద వస్తాయి.వాటిని యజమానులు బాగుచేసి కాపాడాలి.ప్రభుత్వం ,ప్రాజలు కూడా పూనుకోవాలి ఈ వ్యాస కర్తలకు నేను ఒక సూచనా చేశాను ఈ భావనలు మంచి ఫోటోలు తీసి ఎన్లార్జ్ చేసి హైదరాబాద్ ఆర్ట్ గాలరీ లో ప్రదర్శిస్తే మంచిది అందరికి తెలుస్తుంది ఇంటాక్ సంస్థ వారి సహాయం కూడా తీసుకో వచ్చును 

కమనీయం: my motto

కమనీయం: my motto
koodali.org

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

my motto


 


 ' నా తెలంగాణ కోటి రత్నాల వీణ '
   రత్న ఖచిత కిరీటమ్ము రాయసీమ
   దివ్య కాంచన రథము మా తీర భూమి
   వెలుగు ముప్పేట హారమ్ము తెలుగునాడు.
  పై పద్యంలో మొదటి పాదం అందరికీ తెలిసిన దాశరథి పద్యంలోనిది.మిగిలిన మూడు పాదాలూ నేను వ్రాసినవి.పై పద్యమే నా
 నిశ్చిత అభిప్రాయం.నేను అంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలనూ,అన్ని జిల్లాలనూ ప్రేమిస్తాను.ఆంధ్రులు అంటే అన్ని  జిల్లాలవారూ. అజ్ఞానం వలననో దురుద్దేశం తోనో ఈ విషయం సామాన్యులకు కవులు, రచయితలు,పత్రికల వారూ,టీ.వీ,ల వారూ ఎందుకు చెప్పడం లేదో తెలియదు.ఇప్పటి ఉద్రిక్త వాతావరణంలో ఇంతకన్న వ్రాయ దలచుకో లేదు.  

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

కమనీయం: okageyam-niraasa

కమనీయం: okageyam-niraasa

okageyam-niraasa


 

  భిక్షకుడొకడిని-బీద అరుపులవాణ్ణి
  వీధుల కూడలిలో -వెళ్తూ చూశాను
  భయపడకు బీదల-ప్రభుత్వం వస్తుంది
  బాగుపడుతుంది నీజీవితం -భరోసా ఇచ్చాడొక సోషలిస్ట్
  మురిగిపోయిన వ్యవస్థే - మూలకారణం
  తిరగబడమన్నాడు- తీవ్రవాది ఒకడు
  గతజన్మలో పాపాలే-కారణం నీ స్థితికి
  ప్రాయశ్చిత్తం చేసుకో -పదమన్నాడు మతగురువు
  బలంగావున్నావు కదా- పనిచేసుకోలేవా
  కష్టపడుపొమ్మని- కసిరాడు కేపిటలిస్ట్
  అమ్మాయిల అందం - ఆరాధించే అబ్బాయి
  ఏమిటి యీ న్యూసెన్స్- ఇక్కడనుండి పొమ్మన్నాడు
  పదిరూపాయలు చేరితే- పట్టెడన్నం తినాలన్న
  బిచ్చగానికి నిరాశే- మిగిలింది చివరకి .              

కమనీయం: oka padyam,kalingaseema

కమనీయం: oka padyam,kalingaseema

oka padyam,kalingaseema


 

 వంశధారాతీర వసుమతి యంతయు
       ప్రాక్తన నిర్మాణ భరిత భూమి
 బౌద్ధచైత్యవిహార భవ్యవిద్యాలయ
       సకలదేశాగమ చ్చాత్రవితతి
 శత్రుభీకర మహాసామ్రాజ్య విస్తృత
       సేనానికరముల చెలగునేల
 సాగరాంతర వణిక్ సంపద్విభవార్జ
       నమున లక్ష్మీ సదనమ్ము గాగ
     నగరికటకశ్రీకాళింగ నగరప్రముఖ
     శ్రీముఖక్షేత్ర దంతపురీమహేంద్ర
     శైలశాలిహుండాది ప్రశస్త దివ్య
     క్షేత్రముల నలరారె నీ సీమ మున్ను. 

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

nidra


  
 తల్లి  యొడి లోన వెచ్చగ తనువు మరచి
 శాంత్యమాయక భావాల స్వాదురసము
 నీలి కన్నుల రెప్పల నిదుర గ్రమ్మ
 చింత లెరుగని పొన్నారి చిట్టిపాప
            ---------
 ప్రేమికుని కౌగిలిని చేరి ప రియవధూటి
 సేద దీరంగ స్వప్నాల చిత్రరచన
 వాలుగన్నుల నర్తింప లీల నగవు
 మోము నలరింప నిద్రించు ముగ్ధ హృదయ
             -----------
 వెతల ,రుగ్మత  భారాన వేసరిల్లి
 నిద్ర రానట్టి సుదీర్ఘ నిశల యందు
 ఘడియలను లెక్కపెట్టుచు గడుపుచుండు
 కొంత దనుకను ముదిమిని కునుకు పట్టు .
              -----------
  

8, సెప్టెంబర్ 2011, గురువారం

arudra-contd

 
 ఈ ధరణి అంతా పుణ్యభూమే అంటూ
    ''దేవుడిచటే వెలసెనంచు =తెలివిహీనులు భ్రాంతిపడుచు
       చావుకోసము వలసపోయి =సతమతంబవనేల భాయి
       ఈ వసుంధర మేనుపైన =ఏవొక్క అంగుళంబైన
       పావనమ్మే ,పుణ్యవహము =వారణాసే స్వంతగృహము
   జనులు పాడుకొనే పాటే పండిత కావ్యాలకన్నా ముందు పుట్టిందని ఆరుద్రగారి అభిప్రాయం
      ''గేయమే ముందు పుట్టింది = హాయిగా జాతి నవ్వింది
        వేయిపేరుల లక్షణమ్ము =వెనుక వచ్చిన దుప్పికొమ్ము
        తీయతీయని నాటు  పాట =దేశీయ సంపదల మూట
        హేయమైనది పండితులకు =ఇల సంస్కృతపు హెచ్చు కొరకు ''
   పండితుల శుష్కవాదాల గురించి చమత్కారం
        ''వీపులో అరసున్నవుందా= వెర్రి శకటములెక్కుతుందా ?
          ఆపదం వ్యుత్పత్తి ఎల్లా =అన్యదేశ్యం మనకు డిల్లా
          ఈ పగిది చర్చించువాళ్ళు = ఇతరులకు పదపిచ్చివాళ్ళు
          వ్యాపకం వ్యాకరణవృత్తి =జ్ఞాపకాలకు కొంతనత్తి ''
     ఇంకా అక్కడక్కడ మంచి చమక్కులు కనిపిస్తాయి,
     ''ఆలయము నేడు ఆఫీసు=అర్చనకు కట్టాలి ఫీజు ''
   బలహీనులైనా తిరగబడితే పాలకులు లొంగిపోవలసిందే నని హెచ్చరిక
      ''నలుసు చాల అలుసుగాని=నయనాల పడినచో హానీ'
      ఐతే అందరు కవులలాగే ఆరుద్ర కూడా'' ఏకాలమందు మగవాడు ఇంతి హృదయము నరయలేడు '' అంటారు.కాని నిజం చెప్పాలంటే ఆడ ఐనా మగ ఐనా ఇతరుల హృదయం అర్థం చేసుకోడం కష్టమే .
   ఈ చిన్న కావ్యం (శుద్ధ మధ్యాక్కరలు) విశిష్టత
      1.పద్యాలని పాటగా మలచటం 2.సరళమైన  శిష్ట వ్యావహారికంలో వ్రాయడం.3.ఉర్దూ ,ఇంగ్లిష్ పదాలను విరివిగా వాడడం4. వివిధ విషయాలపై తన చమత్కారశైలిలో విమర్శించడం.5.తన ముద్ర ఐన అంత్యప్రాసలను కొనసాగించడం .6.మధ్యాక్కరల గణవిభజననీ ,ఆదిప్రాసనీ ,యతిస్థానాన్ని తప్పక పాటించడం .
                   (సమాప్తం)        

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

arudra-contd.

   ఆంధ్రలో రోడ్లన్న భయము=ఆఫ్రికా అడవులే నయము
 చాంద్రాయణము చేయు జనులు=జపము విడిచిన మేటి మునులు
 గంద్రగోళపు ఆటవిడుపు =సంద్రపు ఘోష దిగదుడుపు
 ఇంద్రుడైనా గుడ్డివాడు =ఇచ్చోట నడువలేడు.
   ఇంద్రుడికి వెయ్యికళ్ళు అని ప్రతీతి కదా .మన రోడ్ల పరిస్థితి ఇప్పట్కీ అంత మారలెదు కదా.
   జూదం గురించి రాసినది.
  న్యూయార్కు ప్రత్తి మార్కెట్టు = నూత్నద్యూతపుటాటపట్టు
  హాలుద్వారాలు క్లోజింగు =ఆపదలకు ఓపెనింగు
  వేయకోయి నువ్వు బ్రాకెట్టు = విలువైనవన్ని తాకట్టు
  మాయజూదాలు కనిపెట్టు = మానవుడు సైతాను జట్టు
  ఎవరివెర్రి వారికి ఆనందమంటూ ఇలాగంటారు.
   తనకాంతుడె తనకు శౌరి = తనభార్యయె తనకురంభ
   తనవారు దేవతల బృందం = తన పిచ్చి తనకు ఆనందం
        శౌరి అంటె కృష్ణుడు.
   మంకుపట్టు వీడలేక = మావోసిటుంగూదు బాక
   డొంకతిరుగు మాటలాడి =వంకపెట్టును సిగ్గువీడి
   బొంకులను వేమారు ప్రేల = పూర్ణసత్యము మారు నేల
    పంకజాప్తుడి దివ్యశోభ = పరికించునా గుడ్లగూబ .
      పైపద్యం రాసేటప్పటికి మనదేశం పై చైనా దండయాత్రవలన (1962) కమ్మ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చింది.ఆరుద్ర చైనాను వ్యతిరేకించాడు.శ్రీశ్రీకి ,ఆరుద్రకి కూడా మనస్పర్ధలు వచ్చాయి.
        మరొకసారి మరికొన్ని ఆరుద్ర మధ్యాక్కరలు.    

pictures for all to see













దామెర్ల రామారావు ఆధునిక ఆంధ్ర చిత్ర కళాకారులలో సుప్రసిద్ధుడు.దురదృష్ట వశాత్తు యవ్వనంలోనే మరణించాడు. ఆయన చిత్రాలు రాజమండ్రిలో ప్రదర్సన శాలలో ఉన్నాయి. నా దగ్గర వున్నవి ఇస్తున్నాను.అలాగే బాపు గారి చిత్రాలు కొన్ని ,శ్రీకాకుళం జిల్లాలో కొన్నిదర్సనీయమైనవి కూడా ఇస్తున్నాను

3, సెప్టెంబర్ 2011, శనివారం

arudra contd.


ఆరుద్ర సరళమైన శిష్టవ్యావహారికం లోనే ఈ శుద్ధమధ్యాక్కరలను వ్రాసారు.సులభంగా అర్థమౌతుంది కనక అట్టే వివరణ అక్కరలేదు.
  తనలక్ష్యాన్ని చెపుతూ రాసింది.ప్రతీ పాదానికీ 13మాత్రలు ఉంటాయి.
    ''కూనలమ్మపదాల రీతి =కూర్చాక దీనిలో నీతి
      వీనులకు విందొనరించి =ప్రేముడిని జగతిలో పెంచి
      దానవత్వము వేగద్రుంచి =ధర్మపథమే అనుసరించి
      మానవుల మంచినే ఎంచి = మదిమీటు కవితావిపంచి  
     అని తన కవితా లక్ష్యాన్ని చాటిస్తారు.
     ఆరుద్ర నాస్తికుడు.మూఢనమ్మకాలను నిరసిస్తూ రాసినది.
      '' జంతువులతలలున్న సురలు =చలనమ్ములేనట్టి తరులు
         వింతగా కనిపించు రాళ్ళు =వెర్రిమానవుల దేవుళ్ళు
         పంతుళ్ళు పొత్తర్లు పట్ట=భరమగున పితరాళ్ళపొట్ట
        అంతరాత్మను తలచుకొమ్ము = అనవసరమీ తద్దినమ్ము.
      కాని పూర్వికుల సంస్మరణ ఏదో ఒకరూపంలో అన్ని నాగరకతలలోనూ ఉందికదా!
      కట్నాలని నిరసిస్తూనే తనదాకా వస్తేమాత్రం కట్నాన్ని ఆశించే కపటులమీద ఆరుద్రవిసుర్లు.

      ''కన్యకల పరిణయసమస్య=కారునల్లని అమావాస్య
        మా న్యాలపై అప్పుదెచ్చి=మ్యారేజి చేయడం పిచ్చి
        అన్యాయమీ శుల్కం =అడగడం పాపమనుచు
        అన్యులకు తానుబోధించి =ఆశించు కట్నాలసంచి
       మనేన్నికలమీద ,అవినీతిమీద విమర్శ
     '' కులతత్వ కూటాలవోట్లు =బలమున్నపదవులకు మెట్లు
        పలుకుబడిబడిలోన సీట్లు=పండించులే పచ్చనోట్లు
        కలవాళ్ళ అవగుణపు చెట్లు= ఫలియించె కోటానుకోట్లు
       తలబిరుసుతనపు పర్మిట్లు=దాపురించెను మనకు పాట్లూ'
       ఇంకా కొన్ని మరో సారి.
              ----------

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

arudra


ఆరుద్ర= శుద్ధమధ్యాక్కరలు=మధ్యాక్కరలు దేశి చందస్సు .ఆటవెలది,ద్విపద వంటిది.నన్నయ నుంచి నేటి వరకు కవులు ఈ చందస్సులో పద్యాలు రాసారు.విశ్వనాథవారు రచించిన మధ్యాక్కరలకి సాహిత్య అకాడమీ అవార్డు(1965)ఇచ్చింది.
    ఐతే ఆరుద్ర అభ్య ంతర మేమంటే దెశిచందస్సు ఐన దీనిన్ని ,పాటగా పాడుకోవలసిన దానిని పద్యాల్లో కఠిన పదబంధాల్లో బిగించి అ ందాన్ని హరించారని అన్నారు.అందువలనా తానే ఆ చందస్సు లోనే పాటవలె మలచి 67రాసి వాటికి శుద్ధమధ్యాక్కరలు అని పేరు పెట్టారు.సమకాలిక సంఘటనలు,సమాజపరిస్థితులను వస్తువుగా తీసుకొని తనదైన శైలిలో హాస్యం ,వ్యంగ్యం జోడించి రచించారు.
   అక్కరలు1,మహాక్కర 2.మధురాక్కర 3.మధ్యాక్కర 4.అంతరాక్కర 5.అల్పాక్కర అని కొన్ని భేదాలతో ఉన్నాయి.
    మధ్యాక్కర లక్షణాలు. == నాలుగుపాదాలు ఉంటాయి. పాదానికి రెండు  ఇంద్రగణాలు,ఒక సూర్యగణము మళ్ళీ రెండు ఇంద్రగణాలు ,ఒక సూర్యగణము ఉంటాయి.నాల్గవ గణము మొదటి అక్షరం యతిస్థానం.
  ఆరుద్ర పై చందస్సునే తేసుకొని  ఒకపాదాన్ని రెండుగా విడగొట్టి మొత్తం ఎనిమిది పాదాలు చేసారు.దానికి తోడుగా తన ముద్ర ఐన అంత్యప్రాసని జోడించారు.ప్రతిపాదానికి సంప్రదాయంగా ప్రథమంలో ప్రాసనియమం ఎలాగూ ఉన్నది.
   ఆరుద్రగారి మద్యాక్కరలు కొన్ని మాత్రం ఉదహరిస్తూ మళ్ళీ రాస్తాను.ఆయన మొత్తం 67 అక్కరలు జానుతెనుగులో రచించారు.
 

1, సెప్టెంబర్ 2011, గురువారం

stroke

STROKE.==Is a cerebrovascular accident--It develops rapidly causing loss of function of brain. due to obstruction of blood supply.TIA or transient ischemic attack resolves within 24hours and is a warning sign.
   CAUSES==1.Local blood clot or thrombosis.2.blood clot from other regions or embolism3.shock with general decrease in blood supply4.veinous thrombosis
    In some cases bloodvessels rupture of blood vessels may occur an bleeding occurs into the brain.(hemorrhagic shock.)
   SIGNSand SYMPTOMS==depend on the area in the brain affected.Look for the for the following.-
   1.weakness and loss of function of limb or limbs on one side.2.facial changes ,muscle weakness of face.3.numbness on one side of body.4.loss of memory 5.defect in speech
   INVESTIGATIONS;=1,record blood pressure2.examine  blood  and urine esp.f or sugar3.lipid profile4.arteriography5.MR SCAN 6.Doppler ultrasound
    TREATMENT;=1.Anti coagulation drugs 2control of hypertension and diabetes if needed 3.Surgery in select cases to be decided by experts.
     Physiotherapy and rehabilitation  by specially trained personnel are essential for recovery.

photos of srikaakulam

  


30, ఆగస్టు 2011, మంగళవారం

upasanti


   బాధాతప్తహృదయానికి -మృదువచనామృతసేచనం
   క్రొధారుణనేత్రానికి-కృపాపాంగ వీక్షణం
   వేదనక్షుభిత జీవికకు -వీడని తోడగు నెచ్చెలి
   క్షుదాక్రోశ జఠరానికి -కూరిమి తో నిడు అన్నము
   శొధన మగ్నుడగు శాస్త్రజ్ఞునికి - సులువగు పరిష్కారము
   మేథో మథన విశంకితునకు -మేలగు పథ నిర్దేశము
   వ్యాధి గ్రస్త శరీరానికి -వరిష్ఠ మగు ఔషధము    
                   ---------------------

28, ఆగస్టు 2011, ఆదివారం

samasya

    amendment- ఆఖరి చరణం -పరుని పైన సాద్వి మరులు గొనెను -అని ఉండాలి కదా  

my new blog

౧.అన్నాహజారే  దీక్షని ,ఆయన సాధించిన విజయాన్ని అందరం అభినందిద్దాం .దానితో బాటు మరొక్క విషయం గుర్తు చేసుకోవాలి. మన రాజ్యాంగం ,ప్రజాస్వామ్యం కూడా అభినందనీయమే. భారత్ వంటి దేశాల్లోనే  ఇలాంటి సత్యాగ్రహం,అహింసా ఉద్యమం సాధ్యమౌతుంది. నక్సలైట్ ఉద్యమం వంటి హింసాయుత ,దౌర్జన్యా,ఉద్యమాలు మన ప్రజలకు నచ్చవు.అవి విజయం సాధించలేవు.
 ౨.చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తుంటారు. కాని ఇందుకు నేను విభేదిస్తున్నాను.యువతీ యువకులు ముందు వారివారి రంగాల్లో ,వ్రత్తుల్లో రాణించాలి.ధనార్జన చెయ్యాలి.భోగభాగ్యాలతో సుఖించాలి.సమాజాన్ని ,ప్రపంచాన్ని బాగా అధ్యయనం చెయ్యాలి.౪౫,౫౦ సం;;వయస్సు లో రాజకీయాల్లో ఆసక్తి   ఉంటె చేరవచ్చ్ను.క్రమంగా ఉన్నత స్థానాలకి ప్రయత్నించవచ్చును.౭౫-౮౦సమ్;తర్వాత రా  జకీయాల్లోనుంచి విశ్రాంతి తీసుకోవాలి.ఇది నా అభిప్రాయం.

25, ఆగస్టు 2011, గురువారం

samasya

  గ్రహణ కాలమ్ము నందున ఖరకిరణుని
 కాంచు వేడ్కతో మసిబూసి కరమునందు
 ముకురమునజూడ వింతగా ముదము మీర
 హస్తగతుదయ్యే సూర్యుడత్యద్భుతముగా

24, ఆగస్టు 2011, బుధవారం

new poem

 చైత్ర వీణా తంత్రి ఝనం ఝణ నిక్వాణం
గ్రీష్మ మృదంగ లయ భీషణ తాళ ధ్వానం 
శ్రావణ నీల పయోధర జలతరంగిణి రావం   
కార్తిక మధు మురళీ కమనీయ రాగం 
పౌష్య నర్తకీ మణి పద కింకిణి ధ్వనులు 
శిశిర సారంగీ విశీర్ణ శోకమూర్చనలు 
      ఋతు గాన సభ లోన 
      ప్రతి ఏట  సంగీతం 
    ----------------------------

కమనీయం: smasyapooraNam

కమనీయం: smasyapooraNam koodali.org

smasyapooraNam

       విద్య నిచ్చి బ్రోచు విమలాంగి  శారద 
       కమలజునకు  భార్య ; కమలయే గద
       ఆమె  అత్తగారు ; ఐనను నది ఏమొ
       ఉండరొక్క చోట  ఒద్దికగను  
           ------------------

22, ఆగస్టు 2011, సోమవారం

viral fevers

ఈ మధ్య వైరల్ జ్వరాలగురించి వింటున్నాము.మెడికల్ గ్రందాలనుంచి ,అంతర్జాలంలోనూ,వీటిగురించి తెలుసుకోవచ్చును.కాని అందరికీ అంత ఓపిక ఉండదు.అందుచేత  డాక్టర్గా క్లుప్తంగా తెలియ జేస్తున్నాను.
 ఈవైరస్లకు కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి ౧.అవి ఇతర జీవకనాలలోనే వ్రిద్ధి చెందగలవు.౨.గాలి ద్వారా ,రోగి తుమ్మినా,దగ్గినా తుమ్పురులద్వార ,ఆడిస్ దోమకాటుద్వారా వ్యాపిస్తాయి.౩.కొన్నికలుషిత రక్తంద్వారా ,కొన్నిలైంగిక సంపర్కం ద్వారా సంక్రమించవచ్చును.౪.రోగిశరీరంలోకి  ప్రవేసిన్చాక రెండు ,మూడు రోజులు స్తబ్దంగా వుంటాయి. 
  ౫రోగలక్షణాలు =జ్వరము,తలనొప్పి.ఒడలంతా నొప్పులు,గొంతునొప్పి ,దగ్గు సాధారణంగా ఉంటాయి.౬.మామూలుగా వారంరోజులలో తగ్గిపోతుంది.౭.ఐతే కొన్నికేసులలో న్యుమోనియా వంటి విషమ పరిణామాలు కలగవచ్చును.౮.వైరసులకు విరుగుడు మందు (స్పెసిఫ్జ్క్ )లేదు.వాక్సీనులు ప్రయోగం చేస్తున్నారు. 
 వైరసులలో రకాలు ==౧ఇన్ఫ్లుఎంజా -ఒకోసారి సర్వత్ర వ్యాపిస్తుంది (ఎపిదమిక్) జలుబు ,దగ్గు,గొంతునొప్పితలనొప్పిసాధారణం.౨దేన్గ్వే జ్వరం.కొన్నికేసులు సులువుగా తగ్గినా .కొన్నిటిలో రక్తస్రావం ,షాకు,ఊపిరితిత్తులలో కఫం వంటి అనేక విషమపరినామాలు కలిగి ప్రాణాంతకం కావచ్చును.ఇటువంటి కేసుల్లోతలనొప్పి ఉన్నా ఆస్ప్రిన్ వంటి మందులు ఇవ్వరాదు.ఆడిస్నే దోమ కాటు వలన సంక్రమిస్తుంది.రక్తంలో ఫలకికలు (#ప్లేట్లెట్స్తగ్గిపోవుట వలనవాటిని రక్తదానం ద్వారా ఎక్కించాలి.౮స్వైన్ఫ్లూ =ఇన్ఫ్లుఎన్జా  వంటిది.పందులవంటిజంతువులనుండి సంక్రమిస్తుందిna
  చికిత్స ==రోగలక్షణాల బట్టి ఉంటుంది.పరసేటమాల్ వంటివి సరిపోతాయి. కానిఅన్ని కేసుల్లోను కాదు.ఏదుర్లక్షనాలు కనిపించినా మంచి ఆస్పత్రికి తీసుకొనివేల్లాలి.డెంగ్వె జ్వరంలో ,జ్వరంతగ్గినా కీళ్ళనొప్పులు చాల  
రోజులు ఉండిపోవచ్చును. పరిశుభ్రత దోమల నిర్మూలన వంటి జాగ్రతలు ముఖ్యం. ==

17, ఆగస్టు 2011, బుధవారం

phalitam

            పూలు రాలినగాని-పుట్టవు ఫలములు
   ఫలము రాలినగాని-కలుగవు విత్తనాల్
   ఆకు రాలినగాని-ఆమని విరియదు
   వడగాడ్పు పిదపనే-వర్షాగమనమౌను
   పురిటినొప్పులతోనె-పుత్రోదయమ్మౌను
   చీకటి ముసుగును- చీల్చి ఉదయమ్మౌను
   చెమటోడ్చిననుగాని - సిరిసంపదలు రావు
   బాష్పధారలతోనె - బాధానివృత్తి యౌను
              ---------------------
             

15, ఆగస్టు 2011, సోమవారం

.K.L.Saigal

          ఒక బాధామయతప్త జీవన విషాదోద్విగ్నతాతీవ్రతల్
   వికలాత్మావ్యధితార్త విఫలప్రేమార్ద్ర గీతమ్ములన్
   ప్రకటింపన్ మధుమత్తకంఠ విరళప్రాశస్త్య భావమ్ముతో
   చకితుల్జేయును చిత్రగీతప్రియులన్ సైగల్ సుధాగానమున్  
              ------------------------ 

కమనీయం: Rajanikantarao

కమనీయం: Rajanikantarao

12, ఆగస్టు 2011, శుక్రవారం

Rajanikantarao


బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి శ్రీవేణుగోపాల్గారు ఏదొ కోడ్ లో రాయడంవల్ల చదవలేకపోయాను.నాకు తెలిసిన నాలుగు ముక్కలు రాస్తున్నాను.రజని అని పిలవబడే ఆయన మా చిన్నప్పటికే ప్రసిద్ధుడు .ఇప్పుడాయన  కి  90 పైనే ఉంటాయి.రేడియొ లో ఆఫీసర్గా  పనిచేస్తూ ,ఎన్నో లలితసంగీత గేయాలకి ,నాటకాలకి సంగీతం సమకూర్చేవారు.ప్రయోక్తగా ఉండేవారు. నాకు బాగా
 జ్ఞాపకమున్నవి.    .- రాజేస్వరరావు పాడిన "ఓహో విభావరీ" ,సూర్యకుమారి పాడిన "శతపత్రసుందరి" రజని గేయాలే.స్వర్గసీమ సినిమాలో దేశమంతా మారుమోగిన  భానుమతి పాడిన "ఓహోపావురమా" పాటకి స్వరకల్పన ఆయన చేసిందే.కవిగా గాయకుడిగా  సంగీతకర్తగా  మహోన్నత వ్యక్తి  రజని .ఈ తరం వారికి తెలియడానికి  ఈ కొన్ని మాటలు రాసాను.

7, ఆగస్టు 2011, ఆదివారం

V.I.P.Syndrome


V.I.P.Syndrome;(వీ.ఐ.పి.సిండ్రోం)-శ్రీమతి సోనియా గాంధి వ్యాధి గురించి కొంతవరకు మాత్రమే తెలుస్తున్నది.దీనిపై  కొన్ని అనుమానాలు సహజంగా కలుగుతున్నవి.ఈబ్లాగు గైనకాలజిస్టులను ,సంప్రదించినతర్వాతే రాస్తున్నాను.
 మేడం సోనియాకి గర్భాశయ ద్వార కేన్సర్ అంటున్నారు.8 నెలల నుండి చికిత్స చేసినాతగ్గకపోతే అమెరికాలో ప్రసిద్ధ హాస్పటల్లో సర్జరీ చేసారట .ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి  1.సెర్వైకల్కేన్సర్ లో 4దశలు ఉంటాయి.మొదటి ప్రారంభదశ లోనే కొన్ని పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చును.కనీసం 2వ దశలోనైనా తెలుసుకోవచ్చును.వెంటనే ఆవిడ వయస్సు బట్టి గర్భాశయాన్ని సర్జరీతో తీసివెయ్యాలి.అవ్సరమైతే అండాశయాలని,గ్రంధులను కూడా తీసివెయ్యాలి  .తర్వాత  కీమోథెరపీ  ,రేడియేషన్ చెయ్యవచ్చును.ఈ చికిత్సలు,సర్జరీలు చేసే సమర్థులైన డాక్టర్లు,అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పటల్సు ధిల్లీలోనేగాక ఇంకా చాలానగల్లో మన దేశంలోనే ఉన్నాయి.1.సోనియా జబ్బు తీవ్రమైనాక వైద్యసలహాకి  వెళ్ళారా?2.వ్యాధి కనిపెట్టడంలో ఆలస్యం జరిగిందా ?3.ఇండియాలోనే ముందే  అపరేషన్ ఎందుకు జరగలేదు?సో నియా గాంధి పూర్తి మెడికల్ రికార్డు చదివితేగాని చెప్పలేము.
   అతిముఖ్యులకు v.v.i.p.s) సరీఇన చికిత్స జరగడం కష్టం.సామాన్యులకే బాగ జరుగుతుంది.అమితాభ్ బచ్చన్ కీ ఇలానే జరిగింది.కారణాలు.1.వీ.ఐ.పీలకు సర్జరీలు చెయ్యడానికి డాక్టర్లు జంకుతారు.2డాక్టర్లసలహాలని వాళ్ళూంటాయి, సరిగా పాటించరు.3.సలహాదార్లు ఎక్కువై ఒకోసారి పరస్పర విరుద్ధ్మైనవిగా ఉంటాయి.4.వాళ్ళకి విశ్రాంతి ఉండదు.అందువల్ల అశ్రద్ధ కావచ్చ్ను.5.సామాన్యులకంటే వీరికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ గా వుంటుంది. దీనినే డాక్టర్లు అV.I.P.SYNDROMEఅని అంటుంటారు.
 ఏమైనా మేడం సోనియా అమెరికా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో తిరగి వస్తారని ఆశిద్దాము.

5, ఆగస్టు 2011, శుక్రవారం

jeevadhara


వంశధార,నాగావళి,వడివడిగా వస్తున్నవి
పరుగులిడుచు వస్తున్నవి.
 తరుగుల్మలతాదుల తడిమి తడిపి వస్తున్నవి
దరుల దరసి ఒరసుకొని పరవళ్ళు త్రొక్కుచును
 గిరుల కాంతారముల దాటి క్రింది క్రిందికి దుమికి
 రమ్యభూముల రాజనాల పంటచేలను ప్రోదిచేయుచు
 వడివడిగా వస్తున్నవి  వయ్యారంగా వస్తున్నవి

కళింగసీమకు కటిసూత్రములై -కనకరుచిదీప్తులెగయ
బౌద్ధవిద్యా నిలయములకు -భవ్య పుణ్యక్షేత్రములకు
పేరు గాంచిన సీమను  పెన్నిధిగా బ్రోచు తల్లులు
      నదీమతల్లులు
వంశధార ,నాగావళి, వడివడిగా వస్తున్నవి

1, ఆగస్టు 2011, సోమవారం

another poem-svecha


స్వేచ్చ==మధుమక్షికమును నేనైన --మనుజులకు దూరముగ
          నడవిలో నాపట్టు నమరించుకొందు
          పావురమ్మునునేనైన--బహుదూరమగుచోట
          గూడు చేసుకొనినే --గోప్యముగ నుండెదను ;
          నెమలినినేనైన-- నెవ్వారు చొరరాని
          ఏతోపులోనో ఏకోనలోనో --స్వేచ్చమై విహరింతు
                        నటనమాడుచును
          మదకరినినేనైన-- మావటీలకు లొంగి
          దాస్యమ్ము చేయక -- దవ్వులకేగి
          సరసులో తానాలు --సలుపుచునుందు ;
          ధనలోభి, క్రూరాత్ముడతి దురాశాపరుడు
          మానవునికి దూరముగ -మసలుటే మాకు
          స్వేచ్చా ప్రదమ్ము - సుఖ శాంతికారకము .


29, జులై 2011, శుక్రవారం

javali, padam

జావళి,పదం:
పూర్వం సినిమాల్లో జావళీలు, పదాలు ఉండేవి.
1.జావళి నృత్యానికి అనువైనదని,సాహిత్యం (చరణాలు)తక్కువగా ఉంటుందని,పరకీయనాయికసంబంధి2.పదంలొ సాహిత్యం(చరణాలు)ఎక్కువగా ఉంటుంది,స్వకీయనాయికసంబంధి  అని ప్రసిద్ధసంగీతవేత్త సంగీతరావుగారు నాకు చెప్పారు.
వీటిలో  శృంగారం ,మధురభక్తి,సమ్మిళితమైవుంటాయి.రసజ్ఞులు,అభిజ్ఞులు వీటి అందాన్ని,మాధుర్యాన్ని ఆస్వాదించగలరు.పాత సినిమాలలో సంగీతదర్శకులు వీటిని కంపోజ్ చేసేవారు.ఇందులో కొన్ని సంప్రదాయంగా వస్తున్నవి,మరికొన్ని సినిమాకోసం రచించినవి.
నాకు గుర్తున్నవి,ఇష్టమైనవి కొన్ని ఉదహరిస్తాను.ఈరకంపాటలని భానుమతిగారు ఎక్కువగా పాడినట్లున్నది.ఎందుకంటే ఆమె వేశ్య,దేవదాసి పాత్రలు
వేసి మెప్పించారు.ఐనా ఆమె హీరొయిన్ ఇమేజ్ చెక్కుచెదరలేదు.భానుమతి జావళీలు.
   1."మంచిదినము నేడే" స్వర్గసీమ చిత్రం
   2. "మల్లీశ్వరి"లో  "పిలచిన బిగువటరా"
   3."రారా నా సామి రారా" విప్రనారాయణ చిత్రం
   4."మేలాయె నీవేళ" చింతామణి లోది.
   పై పాత లన్నిటినీ పాడటమేగాక భానుమతి నృత్యం కూడా చేయడం విశేషం.
   5.భక్త పోతనలో "ఇది మంచి సమయము రారా",మరొక చిత్రంలో
  6. (పేరు గుర్తు లేదు) చెలియా మనకేలనే"-అనే బెజవాడ రాజరత్నం ప్లే బాక్ ,పాటలు.
  7. జయసిమ్హ చిత్రంలో "నడిరేయి గడిచెనే చెలియా"అని వహీదా నృత్యానికి సుశీల పాదిన పాటలు కూడా చాలా బాగా ఉంటాయి.
    తుకారాంలో కాంచన నృత్యానికి,ముత్యాలముగ్గులో హలం నృత్యానికి ప్లేబాక్ పాటలు కూడా ఈ కోవకే చెందుతాయికాని అవి కొంచెం మోడరంగా ఉంటాయి.
'క్షేత్రయ్య' సినిమాలో ఆయన పదాలని రామకృష్ణ పాడితే నాగేశ్వరరావు చక్కగా అభినయించేరు.

28, జులై 2011, గురువారం

chaalu

చాలు 
-----   సందెవేళలలోన చల్లనిచిరుగాలి చాలు -శీతలీకృత హర్మ్యశ్రేణులేల 
        స్వఛ్ఛమగు జలధార యొక్కటి చాలు-మత్త మణిమయ మధు పాత్రమేల    
        తాపముదీర్చ చిక్కటి తరుఛాయయే చాలు -సౌమ్య తూలికా తల్ప శయనమేల 
        ఆకలి తీరంగ తీయని ఫలములున్నను చాలు -పంచభక్ష్యములతో పరమాన్నమేల 
        మదిసేదదీర్చు మంచిమాటలు చాలు -కపటవాగ్ధాటి ప్రవాహమేల 
        నెత్తావి విరజిమ్ము విరజాజి  మాలలు చాలు - చిత్రరత్న విభూషజాలమేల 
        శారదశర్వరీ చంద్రకాంతియె చాలు -కోటివిద్యుత్ప్రభా పుంజమేల 
        అలలపై కదలాడు మురళీరవము చాలు - శతవాద్య సంకుల మహా ఘోష యేల 
                            

javali,padam.

పూర్వం సినిమాల్లో జావళీలు, పదాలు ఉండేవి.

javali,padam.

పూర్వం సినిమాల్లో జావళీలు, పదాలు ఉండేవి.

javali,padam.


26, జులై 2011, మంగళవారం

AmericanVidwan

హిగ్గిన్స్ భాగవతార్ --ఆయన ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాడా?అమెరికన్ తెల్లజాతీయుడు.మన  దేశంలో కర్నాటక సంగీతం బాగా అభ్యసించాడు.దురదృష్ట వశాత్తు అమెరికాలో కారుప్రమాదంలో మరణించాడు. ఆయన పాడిన "ఎందరో మహానుభావులు",కృష్ణా నీ బేగనె బారో",మన విద్వాంసులు పాడిన కన్నా బాగుంటాయి.సాహిత్యం ఉచ్చారణ కూడా నిర్దుష్టంగా ఉంటుంది.కంఠ స్వరం కూడా "రిచ్"గా బాగుండేది.  

25, జులై 2011, సోమవారం

gayatri kaundinya


గాయత్రికౌండిన్య  ;      మా మిత్రులు శ్రీ గంటివెంకటరావుగారి మనమరాలు.మంచి గాయని.అమెరికాలో ఉంటుంది.అక్కడే హిందుస్తాని సంగీతం అభ్యసించింది.14సం:కే నిష్ణాతురాలై సంగీత గాత్ర కచేరి చేసింది.మధురమైన కంఠ స్వరంతో బాటు విద్వత్ కూడా ఉండి బంగారానికి తావి అబ్బినట్లు ఉంటుంది. పంచమస్వరంలో పర్వీన్ సుల్తానా, సుశీల,కంఠస్వరాలకు కొంచెం దగ్గరలో ఉంటుంది.ఈ అమ్మాయి 2008లో అమెరికాలో చేసిన గాత్రకచేరి సీ.డీ.నా దగ్గర ఉంది.జయజయవంతి,ఖమాచ్ రా గాల్లో పాడింది.రాగప్రస్తారం,గమకాలు ,అద్భుతంగా ఉన్నాయి.ఇక్కడ తెలియకపోవచ్చుగాని ,అమెరికాలో కొంతమందైనా వినివుంటారు.
  చి.గాయత్రికి ఉజ్వల భవిష్యత్తు ఉందని,ఇంకా ఉన్నత శిఖరాలని సంగీతప్రపంచంలో అధిరోహించగలదని ఆశిద్దాము.

24, జులై 2011, ఆదివారం

My poems


  నిలిచె హిమాంబువుల్ కుసుమ నేత్రములందు సరోజమాలికా
  కలితజలాశయంబులును కళ్ళములందున ధాన్యరాశులున్
  దళితవిశీర్ణపత్రముల దాకుచు వీచెడి శీతవాతమున్
  చలిచలి యంచు నిల్వెడల నోపని మానవాళియున్
             ----------------
  ప్రాభాతోజ్జ్వల రేఖలున్ సమయగా ప్రాలేయ చేలావృతిన్
  లోభావించి హిమాంశుడయ్యె నినుడున్ రొచిష్మతిన్ గోల్పడన్
   శోభావంతపు స్వర్ణకాంతి వరలెన్ సుక్షేత్రముల్ నల్గడన్
  సౌభాగ్యాతిశయమ్ము  దక్కికృశతన్ సాగెన్ నదీ,కుల్యలున్
              ----------------
  అలరుల క్రొమ్ముడిన్ దురిమి యంగణమందున రంగవల్లులన్
  లలితముగా నలంకరణలన్ బచరించు విలాసినీమణుల్
  కలుషవిదూరవాహినులు ,కల్యలు శుభ్రవిరాజచంద్రికల్
  ఫలభర నమ్ర భూజములు ,పంచెడినింపుగ తేనెవాకలన్. ( నా హేమంతము కవిత నుండి )

23, జులై 2011, శనివారం

Angina-contd.


ఏంజైనా;=పరీక్షలు --1.ప్రాధమికపరీక్షలు-ఆ.రక్తపోటు కొలుచుట  భ్.మధుమేహం ,రక్తహీనతకు రక్తపరీక్ష.ఛ్.మూత్రపరీక్ష డ్. కొలెస్తెరాల్ మొ;కొవ్వుపదార్ధాల గణనకు రక్తపరీక్ష (lipid profile)
  ఇ.సి.జి.(E.C.G.)=గుందె నుండి వెలువడే విద్యుత్ తరంగాల పటమును పరిశీలించుట
  దీనిని విశ్రాంతిగా ఉన్నప్పుడు,ట్రెడ్మిల్ మీద పరిగెత్తినప్పుడు వేరు వేరుగా పరిశీలిస్తారు.
  ఎఖో కార్డియో గ్రాం -అధిశబ్ద తరంగాలకు (ultrasoundwaves)గుండె ప్రతిధ్వనులను రికార్డు చేసి పరిశీలించుట.
  ఏంజిఒగ్రఫి (angiography) -తొడ,లేక చేయి ధమని ద్వారా సన్నని గొట్టమును గుండెలోకి ఎక్కించి ఒక రంగు పదార్థం తో కొరోనరీ ధమనుల పరిస్థితి పరిశీలించుట .
  జాగ్రతలు, చికిత్స '=1.తగిన వ్యాయామము.2.తగిన ఆహార నియమాలు. 3.తగిన జీవన
  సరళి.వ్యసనములను విడిచిపెట్టుట ( change of life style) క్రొవ్వు పదార్థములు తగ్గించి ,పీచుపదార్థములు కల పండ్లు,కూరలు అధికముగా తీసుకొనుట
  చికిత్స;= 1.మందులు .చిరకాలము నిపుణుల సలహాతో తీసుకోవలెను.
  శస్త్రచికిత్స ;=ఏంజియొప్లాస్టీ-ఇందులో మూసుకుపోయిన కొరొనరీ నాళములను చిన్న బెలూన్లచే తెరపించి అవసరమైతే స్టెంటుని పెట్టి రక్తప్రవాహాన్ని సుగమం చేస్తారు.
  కొరొనరీ బైపాస్ సర్జెరీ;స్= (coronary bypass graft.CABG) ఇందులో చాతీని కోసి మూసుకుపోయిన రక్తనాళములచోట వేరే చోట నుంచి తీసిన ధమని భాగాలను అతికిస్తారు.మూడు,లేక ఎక్కువచోట్ల  మూసుకొన్నప్పుడే ఈ సర్జెరీ చేస్తారు.
   అన్ని కేసులకీ చికిత్స ఒకే విధంగా ఉండదు.వయస్సు,శరీరపరిస్థితి, రోగలక్షణాలు ,ఇతరజబ్బులు,చేసిన పరీక్షల ఫలితాలు, వంటి అనేక అంశాలను గుర్తించి నిపుణులు వైద్యవిధానాన్ని నిర్ణయిస్తారు.ప్రారంభ దశలోనే సరి అయిన జాగ్రతలు ,చికిత్స పాటిస్తే ఈ రోజుల్లో చిరకాలం బ్రతికి ఉండటమే కాక ప్రయొజన కరమైన జీవితం గడపుటకు బాగా అవకాశం ఉన్నది.  

22, జులై 2011, శుక్రవారం

Angina


ఏంజైనా పెచ్టొరిస్ ;=అనగా చాతీలొ నొప్పి అని అర్థం.గుండెకి తగినంత రక్త ప్రవాహం అందనప్పుడు కలిగే నొప్పి.శరీరానికంతకు రక్తాన్ని సరఫరా చేసే గుండె సరిగా పనిచేయాలంటే దానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేసేవి కొరోనరీ ధమనులు.ఈ ధమనులు ,వాటి శాఖలు ఇరుకైనా ,అడ్డు ఏర్పడినా ,తాత్కాలికంగా ప్రాణ వాయువు అందక కలిగే నొప్పి ఏంజైనా .ఇది అథెరొ- స్క్లెరొసిస్ అనే మార్పు వలన కలుగును.
   ఇది రెండు రకములు ;=1.నిలకడ ఏంజైనా - ప్రయాస,మానసికమైన ఒత్తిడి, పరిగెత్తుటవంటి వాటి వలన వస్తుంది.ముందు ఊహించవచ్చును.విశ్రాంతితో త్వరగా తగ్గుతుంది. 2.నిలకడలేని ( unstable angina) అనుకొకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు వస్తుంది. ఎక్కువసేపు ఉంటుంది.
 కారణాలు;= 1.పొగతాగుట 2.అధిక రక్త పోటు 3.మధుమేహం 4.ఊబకాయం 5.అధిక మద్యపానం 6.వ్యాయామం  లేక పోవడం 7.వంశ పారంపర్యం 8.మానసిక ఒత్తిడి 9.వృద్ధాప్యంలో కలిగే మార్పులు .
  లక్షణలు ;=1చాతీనొప్పి 2.చెమటలుపట్టుట 3.కడుపులోబాధ4.కళ్ళు తిరుగుట  5.ఊపిరిబిగియుట 6.వాంతి  అగునట్లు వికారము
   ఏంజైనా ,గుందెపోటు (heart attack) ఒకటేనా? --కాదు.గుందె పోటులో దానికండరంలో  కొంత భాగం శాశ్వతంగా  చచ్చిపోతుంది. ఏంజైనాలో తాత్కాలిక బాధ ,ఇబ్బంది కలుగును.కాని,అశ్రద్ధ చేస్తే గుండెపోటుకి దారితీస్తుంది.

21, జులై 2011, గురువారం

naatyakala


ప్రస్తుతం నేను కీ.శే. నటరాజరామకృష్ణగారు రచించిన 'దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర"చదువుతున్నను.ఇది పాత పుస్తకమే.1987లో విశాలాంధ్రవారు ప్రచ్రించారు.సాధికారమైన,ప్రామాణికమైన,గొప్ప నాట్యాచార్యుని రచన .
 వెల : రూ .60. ఇప్పుడు మార్కెట్లో దొరకకపోవచ్చును.అనేక చిత్రాలతో ( illustrations) 350 పేజీల గ్రంథం.

Aneamia

anemia   =అనేమియా లేక రక్తహీనత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.పత్రికల్లో ఆరోగ్య శీర్షికలలో రాస్తుంటారు .
అయినా ఎందుకు రాస్తున్నానంటే --మా అమ్మాయి దగ్గరకు వచ్చే కేసుల్లో కొంతమంది స్త్రీలకూ unTunnaadi. అందుకు 
కారణం కేవలం పేదరికం కాదు.ఇతర కారణాలు ఉండవచ్చును.
   మనదేశంలో రక్తహీనత పిల్లలలో  డెబ్బై శాతం ,గర్భిణీ స్త్రీలలో అరవై శాతం ఉన్నది.దీనివల్ల ప్రసవ సమయంలో తల్లికి ,శిశువుకి ప్రమాదం కలగవచ్చును. 
   ఆరోగ్యవంతులైన స్త్రీలకు హీమోగ్లోబిన్ రక్తంలో ౧౨-౧౪ గ్రాములు \౧౦౦ఎమ్ .ఎల్ ఉండాలి.రక్తంలో  ఎర్రకనాలు కనీసం నలబై లక్షలు (క్యూ. మీ మీ.కి )ఉండాలి.కొందరు ఇంతకన్నా బాగా తక్కువ కలిగి ఉంటారు.
   కారణాలు.--౧.పోషకఆహారలోపం ,ముఖ్యంగా ఇనుము ధాతువులోపం వల్ల.౨.బహిష్టు సమయంలో  ఎక్కువ రక్త స్రావం వలన.    లక్షణాలు =అలసట, నీరసము,పాలిపోవుట ,కళ్ళు తిరుగుట.
జాగ్రతలు, చికిత్స ==పోషకాహారం తీసుకొనుట (ఆకుకూరలు ,గ్రుడ్లు, చిక్కుళ్ళు ,చేపలు మో- )    
          నెల నెల ,రక్తపరీక్ష,    థైరాయిడ్ పరీక్ష    
     ఐరన్ ,ఫోలిక్ యాసిడ్ ,బీ ౧౨ మాత్రలు.
  కొన్ని కేసుల్లో సరిఐన గ్రూపు రక్తం ఎక్కించుట. 

19, జులై 2011, మంగళవారం

Temple treasure

అనంతపద్మనాభస్వామి దేవాలయంలోబయలుపడిన అపార,అమూల్య  సంపద గురించి అంతర్జాలంలోను, టీ.వీ.లోను చర్చలు జరుగుతున్నవి.అత్యధికుల అభిప్రాయం (నా అభిప్రాయం కూడా)ఇలా వుంది.  1.ఆ  సంపద ఆలయంలోనే తరతరాలుగా దానిని దాచి కాపాడిన రాజవంశం అధీనం లోనే ధర్మకర్తలుగా ఉండాలి.2.ప్రభుత్వం గట్టి భద్రత కల్పించాలి. (electronic surveilance) తో సహా .3.సంపదలో కొంతభాగం భక్తుల సౌకర్యాలకి ,ఆలయ అభివృద్ధికి ,అన్నదానం ఇత్యాదులకి ఉపయోగించవచ్చును. 4.అపురూపమైన కొన్ని  వస్తువులను తగిన రక్షణతో ఆలయ ఆవరణలోనే ప్రజలు దర్శించుకొనే యేర్పాటు చేయవచ్చును.కేరళ ముఖ్యమంత్రి ఇందుకు అంగీకరించడంచాలా ముదావహం.సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి కదా !ఏమైనా కేరళ Gods own country  అని రుజువు చేసుకున్నది.

16, జులై 2011, శనివారం

jogarao kathalu -contd.

12.పట్టు పరికిణీ ;=ఇతరులకు బట్టలు కుట్టి జీవిస్తూ తన కూతురు పట్టుపరికిణీ కావాలనే కొరిక తీర్చలేని పేదరాలి కథ.మనసుని కలచివేస్తుంది.
13.ఇంటింటిబూరి ;=అసహాయురాలైన స్త్రీకి సహాయం చెయ్యగలిగినా సకాలంలో అందించకస్వార్ధపరుడై ,ఆమె పాప జబ్బుతో చనిపోడానికి కారకుడైన ఒక గుమస్తా కథ.హృదయ విదారకమైన కథ. మధ్యతరగతి స్వార్థ పరత్వాన్ని ,అవినీతిని ఎండగట్టుతుంది.
     జొగారావు గారి కథల్లో "గుండెతడి" ఉంటుంది.మధ్యతరగతి మనస్తత్వాన్ని వారి కష్టాలని ,సుగుణాలని, అవగుణాలని కూడా ప్రతిఫలిస్తాయి.ఎక్కువ కథలు విషాదాంతాలే. కొన్ని మాత్రం సరదాగా, చిన్న కొసమెరుపులతో అలరిస్తాయి.ప్రసిద్ధ కథారచయిత పంతుల జోగారావు రచించిన ఈ గుండెతడి కథాసంపుటి పాఠకుల అభిమానాన్ని చూరగొంటుందని విశ్వసిస్తున్నాను.

jogarao kathalu -contd.

7.గురుదక్షిణ;=తన గురువుగారి కుమార్తె పెళ్ళి జరిపించడానికి అబద్ధంతో వరుణ్ణి ఒప్పించిన ఒక శిష్యుడి కథ.మంచికోసం "వైవాహికములందు బొంకవచ్చును"కదా!
8.వేడుక;=చిన్నతనంలో ఆడిన గుర్రంబండి ఆట మనమలకి నేర్పించి ఆడాలని ఆ ప్రయత్నంలో మరణించిన ఒక వృద్ధుడి కథ.కొంచెం విపరీతమనిపించింది.ఈ కథాంశమే ముఖచిత్రంగా వుంది.
9.ధిక్కారస్వరం ;= పిరికి వాడు,అల్పజీవి,ఐన తండ్రికి తన ధైర్యమైన ప్రవర్తనతో
దారిచూపిన కూతురు కథ."మౌనపోరాటం" సినిమా ప్రభావం కనిపిస్తుంది.
10 .షరతులు వర్తిస్తాయి.;= కట్నం తీసుకోకపోయినా ,పెళ్ళి ఘనంగా జరిపించాలనే షరతులతో మగపెళ్ళి వారు వియ్యంకుణ్ణి అప్పులపాలు చేస్తారు.ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అత్తవారికి ఇవ్వకుండా తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉపయోగించుకొంటుంది.
11. నిలబడు ;=;=బస్సులో ప్రయాణికులందరి తరఫున న్యాయానికి నిలబడ్డ యువకుడి కథ.
12.కలహించుకొన్న దంపతులకు వారి మిత్రుడు జీవితంలో నిజంగా ఏది అపురూపమో అనే గుణపాఠం నేర్పుతాడు.(తాతగారి పెళ్ళిగొడుగే  ఆ అపురూపమైనది.)  
             

15, జులై 2011, శుక్రవారం

గుండె తడి ... పంతుల జోగారావు కథలు



గుండెతడి.
    పంతులజొగారావు ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ కథారచయిత.  మంచి కథారచయిత.ఎక్కువగా కింది మధ్య తరగతి వారి జీవితాలు,వారి సమస్యలు ,కష్టాలు,సరదాల గురించి రాస్తారు.ఇంతకు ముందు అపురూపం అనే పేరుతో కథల సంపుటి ప్రచురించారు.అందులో 12 కథలు ఇందులో చోటు చేసుకొన్నాయి.అందు వల్ల మిగిలిన 12 కథల గురించి క్లుప్తంగా రాస్తాను.
  ఆయన కథా రచన,శైలి ,భాష,ఆడంబరం లేకుండా simple గా సరళంగా ఉంటుంది.విజయ నగరం జిల్లా మాండలీకం లో సహజం గా సాగిపోతుంది. దీర్ఘ సంభాషణలు, వర్ణనలు ఉండవు. కొన్ని కథల్లో చిన్న twist (మలుపు)  ఉంటుంది. సామాన్యుల కష్టాలు,ఆర్థిక ఇబ్బందులు,తరాల అంతరాలు బాగా వర్ణిస్తారు.ఇతని కథల్లో విషాదం,నిర్వేదం ,ఆర్ధ్రత గూడు కట్టుకొని ఉంటాయి. 30.40,యేళ్ళ క్రితం సామాజిక జీవనం,ప్రధానంగా ఉత్తరాంధ్ర లో lowermiddleclass( కిందిమధ్య తరగతి) ,పేదవారి జీవన సరళిని ప్రతిఫలిస్తుంటాయి. అందుకే ఈయనను ఉత్తరాంధ్ర కొ.కు.(కొడవటిగంటికుటుంబరావు) అంటారు.
      1.అల్లుడోడు-   ఒరిస్సా నుండి రైల్లో దొంగ సారా రవాణా గురించిన కథ.
      2,ఉదయం నుంచీ వాన - సంపన్నుల ఇంట్ళో బేబీ పుట్టిన రోజు పండగకి ,అదే రోజు ఆ ఇంటి పనిమనిషి కూతురు పుట్టినరోజుకి తేడాను చిత్రించిన ,మనసుకి హత్తుకు పోయే కథ..
      3,శరణు ,శరణు -  తండ్రి అపు రూపంగా దాచుకొన్న పుస్తకాలని వృధా అని తమతో తీసుకు పోడానికి వద్దన్నా,ఉపాయంగా మనమరాలు వాటిని తాతగారికి అప్పజెప్పడం కథాంశం.
      4.ఊరికి నిప్పంటుకొంది - చలివేంద్రంలో తగాదాతో ఒక పల్లెలో ముఠా కక్షలు పెరగడం  ఇతివృత్తం.
      5.ఎర్రజీరల కళ్ళు -  మనిషి  బాహ్య స్వరూపం,మాటల కరుకుదనంవల్ల ,తప్పు అంచనా వెయ్యకూడదని గుణపాఠం నేర్పుతుంది,
      6.అభ్యంతరం లేదు  -  పెళ్ళికూతురు శారీరక లోపం ఉన్న వరుడిని  పెళ్ళి చేసుకుందుకు అంగీకరిస్తుంది.తన చెల్లెలకి కూడా అంగవైకల్యం ఉన్న సంగతి తల్లి దండ్రులకు గుర్తు చేస్తుంది.

8, జులై 2011, శుక్రవారం

tourist places in srikakulam district

శ్రీకాకుళం జిల్లా కళింగ సామ్రాజ్యంలో ఉండేది.శ్రీముఖలింగం రాజధానిగా చాలా కాలం ఉండేది. తరవాత రాజధాని భువనేశ్వర్కి మార్చబడిందని చరిత్ర చెపుతోంది.చాలాకాలం ఇక్కడ బౌద్ధమతం ప్రవర్తిల్లింది.అందువల్ల వైదిక, బౌద్ధ మత అవశేషాలు ఉన్నాయి .ఈ జిల్లాలొ దర్శనీయ స్థలాలలో కొన్ని ముఖ్యమైనవి.;-
 1.అరసవల్లి- దేశంలో సూర్య దేవాలయాలు ఇంకా ఉన్నా పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇదొక్కటే. వెయ్యేళ్ళ చరిత్ర కలది.2.శ్రీకూర్మం - శ్రీ మహా విష్ణు కూర్మావతారానికి మన దేశంలో ఇది ఒక్కటే ఆలయం.శిల్ప సంపదకు, కుడ్య చిత్రకళకు ప్రసిద్ధి.రెండు ధ్వజ స్తంభాలూండడం  ఒక విశేషం .ఇది కూడా వెయ్యేళ్ళ చరిత్ర కలది.3.శ్రీముఖలింగం -1200 యేళ్ళ చరిత్ర కలది.కళింగ శైలిలోగొప్ప  శిల్ప సంపద తో విలసిల్లే పెద్ద శివాలయం.4.మిలియాపుట్టిలో ఒడిస్సా  రీతిలో కట్టబడిన అందమైన జగన్నాధ ఆలయం.5.శాలిహుండంలోను, దంతవరపుకోటలోను, బౌద్ధ స్తూప అవశేషాలు ఉన్నాయి.6.మహేంద్రగిరి తూర్పుకనుమల్లో ఎత్తయిన శిఖరం. ఇవి  కొన్ని మాత్రమే. ఇంకా.వున్నాయి.

7, జులై 2011, గురువారం

visakha


విశాఖ
--------;పసిప్రాయంలో నీ వడిలో పరుండితి
         నీలతరంగ హస్తాల నిమిరావు నన్ను
         ఎలజవ్వనములోన వలచాను నిన్ను
         తరులతా కుంతలముల మురిపించినావు
             సుందర విశాఖా ! విలాసరేఖా !
         శైలకందరాలలో సానుప్రదేశాలలో
         సైకత చుంబి ఫేన రాశులలో ంధ్యా
         సంధ్యా మారుత సౌరభాలలో
         చంద్రోదయ సువర్ణ రోచులలో
         అలలపై జలతారుదారుల్లో
         ఉదయారుణజలద పంక్తులలో
         ఆడియాడి అలసి నిదురించాను
             సుందర విశాఖా!విలాసరేఖా!  
         సుదూరాన నౌకోపరి తలముపై
         నీహార దుకూలావృత మైన
         నీ తీర సౌభాగ్యమును
         నే తిలకించినాను ,పరవశించాను
              సుందర విశాఖా! విలాసరేఖా !

4, జులై 2011, సోమవారం

old age homes

వృద్ధాశ్రమం : శ్రీకాకుళం వృద్ధాశ్రమానికి ముఖ్య అతిధిగావెళ్లాను.సంస్థ 1996 నుండి పని చేస్తున్నాది. బి.కృష్ణ మూర్తి గారనే రిటైర్డు ఇంకం టాక్స్ కమిషనర్ కృషి ,దీక్ష వలన స్థాపించబడినది.కొందరు దాతల విరాళాలతో ,కొంత ప్రభుత్వ సాయంతో నడుస్తున్నది. 70mandi ఇందులో   ఉచితంగావసతి ,భోజన సౌకర్యం పొందుతున్నారు.నెలకు లక్ష రూఖర్చు ; ఆవుతున్నది.నాకు వీలయిన ఉడతా సాయం చేస్తున్నాను.
  వయోదికుల ఆశ్రమాల ఆవశ్యకత.;-౧.సగటు ఆయుప్రమానం పెరిగి వృద్ధుల సంక్య పెరుగుతున్నది.౨.వారిలో పేదవారు ఎక్కువ.౩.ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమై వృద్ధులు ఒంటరిగా జీవించ వలసి వస్తున్నది.౪.వారికి ఆలనా ,పాలనా చూసేవారు ఉండరు
 పెద్దనగరాలలో డబ్బు తీసికొని అన్ని సౌకర్యాలతో ఆశ్రయ మిచ్చే రిటైర్మెంట్ హోమ్స్ ఉన్నాయికాని అవి పేదవారికి ఉపయోగ పడవు.ఇటువంటి .ఉచిత ఆశ్రమాలు కొన్ని మాత్రమె కొన్ని చోట్లలో మాత్రమె ఉన్నాయి..
ప్రజలు.,ప్రభుత్వమూ,ఇంకా ఎక్కువ ఆస్రమాలని స్థాపించవలసిన అవసరం ఎంతయినా ఉన్నది.పెదవారయిన వృద్ధులకు ఇప్పుడిస్తున్న 200roo .పెన్షన్ రూ.౫౦౦కయినా పెంచాలి.        

3, జులై 2011, ఆదివారం

ghantasala early days

ఘంటసాల గురించి  కొత్తగా చెప్పేదేముందని అనుకోవచ్చును .నిజమేకాని రెండు మాటలు చెప్తాను.తొలిసారిగా ఆయన 'స్వర్గసీమ"లో ఒక కోరస్లో పాడినట్లు అందరు రాస్తారు (౧౯౪౫)తర్వాత గ్రిహప్రవేసం సినిమాలో (ప్రఖ్యాత దర్శకుడు యల్. వి .ప్రసాద్ హీరో )హాలాహలమేగయునో అనే పాట పాడారు.ఆయన యిచ్చిన ప్రైవేటు రికార్డులు "కరుణశ్రీ పద్యాలు,బహుదూరపు బాటసారి ,"వంటి తోలిరోజులవి తెలిసినవే .కాని "గాలిలో నా బతుకు "ప్రైవేటు రికార్డుతెలియక   పోవచ్చును .నాకు జ్ఞాపక   మున్నంత వరకు ఆయన తొలిసినిమా పాటలు౧.కీలుగుర్రంలో "కాదుసుమా కలకాదు ",లైలా మజునూ "లో పయనమయే,ప్రియతమా " సాహుకారు  లో "పలుకరాదటేచిలుకా  ".తర్వాత ఘంటసాలవారు  సినీ సంగీత ఆకాసంలో ఎలా దూసుకు పోయారో తెలిసిన విషయమే. ౧౯౫౦కి ముందు ఎక్కువగా యం.యస్.రామారావు ప్లే బాక్ పాడుతుందే వారు. 

1, జులై 2011, శుక్రవారం

charcha

అమేయ విశ్వంలో అనంతకాలంలో --మనమొక త్రసరేనువులంఅ  
జగత్కదా మహా రేఖల్లో --మనమొక బిన్డుమాత్రులం 
క్షణ భంగుర మీ జీవితం --క్షీనించును అనవరతం 
ఇహసుఖమొక ఎండమావి --ఎందులకిక నీ ఆరాటం 
మర్మమ్మెరిగి సద్ధర్మ రీతిని --పరమపద ప్రాప్తికి పాటుపాడమని
తరతరాలుగా రుషివర్యులు తరచి తరచి  బోధించిరి 
             కాని 
సమాంతరముగాచార్వాకాదులు --పక్షి వలె నెగిరి పోవు 
ప్రాణ మున్నంత వరకు --సౌఖ్యంతో జీవించు 
ఉన్నదో లేదో తెలియని పరమునకై --ఉన్నది విలువగు జీవిత కాలము 
వ్యర్ధము చేయనేల --బాధల బొందనేల 
అని వాక్రుచ్చిరి --నాస్తిక వాదులు 
అంతము లేదీ వివాదమునకు              
      __-----___                             

30, జూన్ 2011, గురువారం

srikakulam district

శ్రీకాకుళం జిల్లాలో దర్సనీయస్తలాలు.౧,అరసవల్లి -సూర్యనారాయణ స్వామి దేవాలయం.వెయ్యేళ్ళ చరిత్ర కలది.౨కూర్మం -శ్రీ కూర్మనాధ స్వామి దేవాలయం.వెయ్యేళ్ళ చరిత్ర కలది.దేశంలో కూర్మావతారంకి ఇదొక్కటే ఆలయం .౩.ముఖలింగం -పూర్వం కళింగసామ్రాజ్యానికి రాజధాని.శ్రీ ముఖ లింగేశ్వరదేవాలయం చాలా ప్రాచీనమైనది.పన్నెండు వందల ఏళ్ల చరిత్ర కలది.౪శాలిహుండం -రెండువేల ఏళ్ల నాటి బౌద్ధ స్తూప శిధిలాలు ఒక కొండ పై ఉన్నవి ౫.ప్రక్రతి  .సౌందర్యానికి ఉద్దానం ప్రాంతం ,మహేంద్రగిరి ,కళింగ పట్నం  బీచ్ చూడదగినవి. ౬.కొవ్వాడ దగ్గర పెద్ద అణుశక్తి కర్మాగారము ,కళింగ పట్నం రేవునిర్మాణం జరగబోవుచున్నవి.ఇంకా చాలా ఉన్నవి .మరొకసారితెలియ  జేస్తాను. 

29, జూన్ 2011, బుధవారం

డా.భోగరాజు పట్టాబి సీతారామయ్య

డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆయన పూర్తీ పేరు.అందరూ పట్టాభి అనే వారు.టంగుటూరి ప్రకాశం వలె మాస్లీడర్ కాకపోయినా  ఆనాటి కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యుడు .ఇంటర్నెట్ లో ఆయన గురించి సమాచారం సరిగా Iలేదు.నాకుతెలిసిన సంగతులు క్లుప్తంగా వివరిస్తాను.

 1..ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ  జల ఉష  అనే నౌకను లాంచ్ చెయ్యడానికి విశాఖపట్నం వచ్చి నప్పుడు ఆంద్ర యూనివర్సిటీ లో సభ జరిగింది.అప్పుడు.నేను ఆయనను చూసాను.ఎర్రగా ,కొంచెం పొట్టిగా ఉండేవారు

.2  .ఆయన మెడికల్ డాక్టరు అయినా రాజకీయాల్లో మునిగి తేలే వారు

3.అఖిల భారత కాంగ్రెస్స్ వర్కింగ్ కమిటీలో సభ్యుడు

.4.ఒక సారి అ. భా.కాంగ్రెస్ అధ్యక్షుడు అయినారు

5.తెలుగు లోను ,ఇంగ్లీషు లోను గొప్ప వక్త .

6.1939కాంగ్రెస్ అధ్యక్షపదవికి నేతాజీ సుభాస్ చంద్ర బోసు తో పోటీ చేసి ఓడిపోయారు .గాంధీజీ పట్టాభి ఓటమి నా ఓటమి అన్నారు.తీవ్ర వాదిఅయిన బోసు కాంగ్రెస్ నుంచి వేరే విడిపోయి వేరేఫార్  వర్డ్ బ్లాక్  అనేపార్టీ స్థాపించారు.

7..అన్నిటి కన్నా  ముఖ్యం ,పట్టాభి గారు దేశీయ సంస్థలను ఎన్నిటినో స్థాపించారు. అందులో కొన్ని ముఖ్యమైనవి :ఆంధ్రాబ్యాంకు ,ఆంధ్రా ఉ.సైంటిఫిక్ కంపెనీ .ఆంధ్ర ఇంస్యూరెన్స్  కంపెనీ .కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీ మొదలైనవి.

8..స్వరాజ్య ఉద్యమాలు లో పాలుగొన్నారు

9.స్వతంత్రం వచ్చాక రాష్ట్ర గవర్నర్గా పని చేసారు.
                                                         
                                                                   
                                                                              డా.భోగారాజు





                                                                            జల ఉష



             ఇంకా వివరాలు తెలిసిన వారు రాస్తే సంతోషిస్తాను. 

28, జూన్ 2011, మంగళవారం

కోన సీమ


కోనసీమ ;  మధుర రసాల వన  మనోజ్నమ్ము-కదళీనారికేళ కేదారమ్ము
కుల్యతటినీ తటాకవికసిత   కుముద వనజ పుష్పనికాయము 
మగువ పొలుపు మరియు మగరాయు సౌరు 
చేరి సగము చేరి చెలువంపు శిల్పమ్ము
మోహినీ రూప సమ్మోహన మూర్తి 
దక్ష వాటికా హరనాధ దైవాలయం 

చాళుక్య సామ్రాజ్య చారిత్ర వైభవం -ఆదికావ్య రచనావిశేష యాగం 
కవిసార్వభౌమ కావ్య వందిత దేశం -కందుకూరి సంస్కరణాభి నివేశం
సంగీత సాహిత్య సంస్కృతీ సమాహారం 
ఆంద్ర మాత గళాలంకృత మణిహారం 
అతిమనోహరం ఈ సీమ కోనసీమ -గోదావరీ పావనోదకప్లావితం ఈ సీమ కోనసీమ .

My Medical dictionary

I  have written  English--Telugu medical comprehensive dictionary.It has been printed and published and ABADmarketed by;-  PARAS MEDICAL BOOKS Pvt.Ltd.; 5-1-473; Putlibowli; P.O.Box No.544.: HYDERABAD--500 095 A.P.(INDIA)  Tel.no.(040)24600869 , 66821071  

  నేను  రచించిన  ఇంగ్లీషు -తెలుగు  సమగ్ర వైద్య నిఘంటువు పూర్తి అయినది. దానిని పారాస్ మెడికల్ బుక్స్ వారు  హైదరాబాదు , ప్రచురించారు.మార్కెట్ లోవిడుదల చేసారు.వారి   చిరునామా ,ఫోను నంబరు పైన ఇచ్చాను.
     పుస్తకం  వెల ;రూ.100

27, జూన్ 2011, సోమవారం

నా పద్యం

పుడమి తల్లి  మహైశ్వర్య పూర్ణవమ్మ--సకలసంపదల  నొసంగి  సాకినావు 
స్వార్ధ సంకుచిత  ప్రయోజనములకయి--కొల్లగోట్టితి మేము నిన్  క్రూర వ్రిత్తి

26, జూన్ 2011, ఆదివారం

అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి - శ్రీకాకుళం


శ్రీ సూర్య నారాయణ స్వామి



     తెప్పోత్సవం


 వరచిరకిరణాభరణా--మసృణమణిదీపిత మకుటాభరణా
  చంద్రాతపకారణ-ఘనతిమిరహరణా--జీవదకాలాంకితమెఘావరణా  
  జలధివరుణధనశోషణ-అణువిస్ఫొటనశక్తిస్థల భీషణ
  సర్వగ్రహ వర్తుల  చారణ -సకలభువన శరణ కృతజనన మరణ 
  సకలజనచెతన పోషణ- సురనరమునివరవందిత చరణా 
  జయ సర్వాత్మక   జయారుణారుణ -జయప్రత్యక్షే  శ్రీనారాయణ!

24, జూన్ 2011, శుక్రవారం

కళా వాచస్పతి కొంగర జగ్గయ్య

శ్రీ కొంగర జగ్గయ్య గారు మంచి నటులే కాక  గొప్ప సాహిత్యవేత్త,రాజకీయవేత్త ,కవి ,మేధావి.పద్మ భూషణ్  బిరుదాంకితుడు. ఆ రోజుల్లో రవీంద్ర నాథ్ టాకూర్  కవిత్వ ప్రభావంతెలుగు కవులపై  విశేషంగాఉండేది.రాయప్రోలు   కృష్ణశాస్త్రి ,చలం ,బెజావాడ గోపాలరెడ్డి వంటి వారి మీద  బాగా ఉండింది.౧౯౧౩లొ రవీంద్రునికి నోబెల్ బహుమతి గీతాంజలి కావ్యానికి వచ్చింది.తరువాత చాలామంది దానిని తెలుగు లోకి అనువదిన్చేరు.కాని జగ్గయ్యగారు గీతాంజలి లోని కవితలే కాదు.విశ్వకవి ఇతర కావ్యాల నుండి కూడా కవితలు ఎన్నుకొని రవీంద్ర గీత అనే పేరుతొ త్తెలుగులో పద్య రూపంలో చక్కటి గ్రాంధిక భాషలో రచించారు.రవీంద్రుడు గీతాంజలి కాక  ఎన్నో ఇతర రచనలు చేసాడు వాటిలో కొన్ని సంధ్యా సంగీత ,ప్రభాత్ సంగీత ,చిత్ర, కాడి ఓ కోమల్. కల్పనా,నైవేద్య  ,లిపిక,శ్యామలి ,శేష లేఖ ,మొదలైనవి.వాటి లో మంచి  గీతాలు కొన్ని ఎన్నుకొని జగ్గయ్య ఈ రవీంద్ర గీత రస భరితంగా ,భావ స్ఫోరకం గా రచించారు.వివరంగా  మరోసారి  చెప్పుకుందాము.ఒక్క ఉదా హరణ మాత్రం ఇస్తాను.:"మూడు ప్రొద్దుల చెమ్మట లోదిగిల్ల--పదము పాడుచు నేల దున్నేదము మేము, --మా కరంములు  లోహసలాక లయ్యు,==మా మనమ్ములు  మవ్వపు మండసములు ..'

శ్రీ కొంగర జగ్గయ్య తెలుగుసినిమా నటుడిగా ప్రసిద్ధుడు. అంతకు ముందు రేడియోలో తెలుగు వార్తల అనౌన్సర్ గా కొందరికి తెలిసిఉండ వచ్చును.కవిగా చాలా కొద్దిమందికేతెలిసిఉంటుంది. ఆయన రవీంద్రనాథఠాకూర్ కవితలని ,చక్కటి పద్యాలలో తెలుగులొకి అనువదించారు.వాటిని గురించి మళ్ళీ ప్రస్తావిస్తాను. జగ్గయ్య గారి  మాటల్లోనే "రవీంద్రులు ప్రకృతి ,సౌందర్య ,ఆరాధకులు .ఆయన కవితా జీవితంలో వివిధ దశలకు ప్రాతినిధ్యం వహించే రీతిలో 53 సంపుటాల నుండి 138 కవితలను అనువాదానికి ఎన్నుకొన్నాను." "సంవేదన ,సంగీతము ,ఊహా చిత్రణ ,వీటి  త్రివేణీ సంగమమే రవీంద్రుని .కవిత్వం.మాధుర్యం ,లయ, దానికి సహజమైన ఆభరణాలు."అని హుమాయూన్ కబీర్ పేర్కొన్నారు.ఈ అనువాద మంతటికీ  కవి తేటగీతి పద్యాన్నే ఎన్నుకొన్నారు.
 ఈ రవీంద్ర  గీతలోని అరడజను పద్యాల్లో కొన్ని చరణాలు మాత్రమె ఉదహరిస్తాను.వాటిని బట్టి పాఠకులు అనువాదకుని పాండిత్యం, భాషాపటిమ ,కవితా ప్రాశస్త్యం  చవి చూడవచ్చును  
1.కలల లోకం నుండి వాస్తవ జగత్తుకి రమ్మని ఉద్బోధ : "అపర సంధ్యల స్వప్నమ్ములల్లుకొనక --నెచ్చెలీ రమ్ముదిగి రమ్ము నేలపైకి --రమ్ము సామాన్య జనజీవితమ్ము గనుము "—(మరీచిక ,కాడి -ఓ కోమల్ -నుండి )
2.హేవాకము  -కావ్య గ్రంధావళి నుండి (హేవాకమంటే తెలివి ,,లేక,ప్రౌఢిమ అనిఅర్థం )"నన్ను ముంచెత్తు  ఈ స్వాదు నాద మేదియో -ఏనెరుంగుదు నా హృదయ  మెరుగు "ఈ బృహద్గీత మెట్టిదో ,ఎపుడు దీని -నాలపించేది ఎవ్వరోయా రహస్య -మేనేరుంగుదు నా హృదయ మెరుగు." (హృదయం లో మోగే ఆత్మసంగీతం గురించి.  )
౩.దేశకల్యాణం -నైవేద్య నుంచి --ఇది  బాగా ప్రసిద్ధి పొందిన  గేయం."ఎచట భయ శంకలను బుద్ధి ఎరుగకుండు -ఎచట తల ఎత్తి నిలబడు నేపు కలుగు - ఎచట జ్ఞానమ్మబాధమై ఎసగు చుండు --"అట్టి స్వేచ్చామయ స్వర్గమందు దండ్రి -నాదు దేశమ్ముమేల్కొనంగానిమ్ము.-(రవీంద్రుడు స్వతంత్ర భారతావని ఎలాఉండాలో ఊహించి రాసినది.)
4. దురభిమానం మతహింస గురించి 'మతము పేరుతొభ్రాంతితో  మసలువాడు-చంప  జావంగ వెరవాడే క్షణమునండు" 'వాడు నిజమయిన ద్రోహి 'అంటారు
5. ఒక కార్మిక కాంత గురించి ఇలా రాసారు."నిండు చామనపు మేను ,ముదురు చెంగావి వన్నియ ముతుక ఛీర గట్టిన పేదరాలు "అంటూ "ప్రియ జనశ్రేయమునకు నిర్దేస్యమైన-యామె   సేవలనిటు కూలి యాస చూపి -దోచుకోనుకుంటి " అని చింతిస్తారు. -పశ్చాత్తాపము -వీదికలో 
6.ఆఫ్రికా ఖండం ,పత్రపుట్ లో ఆ ఖండపు దురవస్థ గురించి ఇలా అంటారు.వ్యాఘ్ర దంష్ట్రల క్రౌర్యమ్ము.నిబిడ వన తమిస్రమ్ముమించు గర్వమ్ము పెనయ  జాటుమాటుగా జేరిన వేట గాండ్రు కొల్ల గొట్టిరి నీ బైసి కుళ్ళగించి." "తావక నిగూఢ పధప్రశాంతి.-రక్త బాష్పప్రవాహ సంసిక్త మయ్యే ." అని ఆఫ్రికా గురించి తన  ఆవేదన .వెళ్ళ బుచ్చారు.
7..౧౯౪౧లొ తన మరణం కి౩నెలలముందు కూడా ఆశావాదాన్ని  విడువకుండా రచించిన రవీంద్రుని చివరి గేయం. 
1941 లోప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. : "విస్మరిత జయాధ్వమున బునర్విక్రమించి --విగత మానవతాభూతి  వేగ -గెలిచినరు  డజేతవ్యుడై సదాపరిఢవిల్లు -పర్వ మేతించు ధర్మమ్ము పరిమళించు
   కవిచంద్రుడు, కళా వాచస్పతి ,జగ్గయ్య గారికి నా నివాళి నర్పిస్తున్నాను.