30, నవంబర్ 2011, బుధవారం

kandam.contd.


   విందగు జవ్వనమును కడు
   నందముగా గడుప వలయు  నా పిమ్మట నీ
   కుం దగు ,తామరపై జల
   బిందువు వలె జీవితమ్ము వెచ్చింప దగున్
                  --------------

    ఎందో,ఏమో అటు  జరి
    గిందని తబ్బిబ్బగు ప్రజ ,కేలకున ఘోరా
    క్రందన లం దీన జనులు
    క్రున్దుట జూచియును సరకు గొనరది ఏమో .
                ---------------

27, నవంబర్ 2011, ఆదివారం

rendu kandalu.


  పస లేని వంటకమ్మును
  రసహీన మయిన కవితయు ,రాగము తాళం
  బెసగని సంగీత పటిమ
  వెస కరుణ రహిత మతమును  విడువంగ దగున్ .
                 --------------------                            
   వృత్తులలో వ్యవసాయము ,
  పుత్తడి లోహముల యందు ,పువ్వుల పద్మం
   బత్తారు లందున జాస్మిన్
   అత్తరు ణుల యందు పత్ని అధికము సుమ్మీ.
                     ---------------                

21, నవంబర్ 2011, సోమవారం

ghantasala


   ఓ ఘంటసాలా , మధుర సంగీత లోలా , గంధర్వ లోక వాసీ  భూతలప్రవాసీ,
  జనరంజనము చేయ  చనుదెంచి  మరలావు, మా గుండెలో నిలిచి రాగమై మ్రోగావు,
  నీలాల గగనాన నిండిన వెన్నెలలో ,నీలిమేఘాలలో గాలికేరటాలలో
  కొండగాలి తిరిగితే  గుండె వూసులాడితే ,నీవు పాడిన పాట వినిపించు నేవేళ ,=ఓ ఘంటసాలా =
   మది శారదాదేవి మందిరమే నీకు  ,మధు మురళీగాన మాధుర్యమే నీవు,
  శివ శంకరీమంత్ర చింతనను చేసావు ,ఆలపించితివి గీతా సుధా బోధనలు నీవు ,=ఓ ఘంటసాలా =
   మోహనము పాడితే మోహనాస్త్రముగాదె ,కల్యాణి నీ నోట కళ్యాణ శుభకారి ,
   పాడుతా తీయగా అని పాడేవు అద్భుతముగా ,మరువ లేని మనీషీ ,మరలి రాని మహతీ .=ఓ ఘంటసాలా =

      డిసెంబర్ నాలుగో తేదీ ఘంటసాల జయంతి లో పాడుటకు నేను రచించిన పాట.
 
 .

17, నవంబర్ 2011, గురువారం

hevakamu


  పద్యమొ గద్యమో,గేయమొ,
  హృద్యము గా నుండ  వలయు ,హేవాకము రస సం
  వేద్యము గా నుండి మధుర
  వాద్యము మ్రోగించి నటుల  వర్ధిలవలయున్
   
              -------------
   నన్నయ ,తిక్కన ,పోతన
   చెన్నుగ నా భట్టుమూర్తి ,శ్రీ నాదా దుల్ ,
   ఎన్నాల్లయినను  రసికుల
   మన్ననలను  పొందు చుండు  మహనీయ గుణుల్ .
               --------------        
      

16, నవంబర్ 2011, బుధవారం

kandam


 కందము మాకందము,మా
 కంద తరుఫల సుమధుర మరందము ,విందౌ
 డెందము ,కందలితమ్మౌ
 నందపు కందమ్మే వ్రాయ నభిమతమౌ గా .
                  ------------      
 వాద్యముల వీణ శ్రేష్టము
 పద్యము లన్నింట కంద పద్యము మేలౌ
 మద్యమ్ములలో  వైనును
 విద్యలలో వైద్య విద్య  అద్యంబగుగా
               ------------

14, నవంబర్ 2011, సోమవారం

bombay


  గగన హర్మ్యముల గంధర్వ నగరం ==కోట్లకు పడగెత్తిన కుబేర పురం
  దరిద్ర దేవత అనుంగు బిడ్డల=కుచేల వాటిక
  తిమిరలోకపు వికృత  రూపం =చీకటి దారుల గజిబిజి లోకం
  విపర్యయాల వ్యత్యాసాల =విపరీతాల పద్మ వ్యూహం
  చిత్ర జగతి నేలె =విచిత్ర జీవుల కేళీ వినోదం
  చీమల బారుల శ్రామిక జీవుల =పుట్టలలో  పాముల ఆక్రమణ
  క్షణము విరామమెరుగక =పరిభ్రమించు జనయంత్రం
  సకల సంపదల సంసోభితం=స ర్వ జాతుల సమాహారంm ra
                      క్వీన్స్ నెక్లెస్
  మనిదీపాల సుందరహారం =శక్రచాపపు సప్త వర్ణములు
     మురిపించే మనోహర దృశ్యం
       ది సిటీ దట్ నెవెర్ స్లీప్స్
  వలసకు వచ్చే ప్రజలకు =బతుకు తెరువగు ఆశా దీపం
       అందరికీ అన్నీ అగుచును
  లక్షలాది ప్రజలకు =భిక్ష నొసంగుచు
  గర్భంలో దాచుకొనే =కామిత దాయని
         కరుణా హృదయిని
  కాదిట పొమ్మను =కఠిన చిత్త కూడా
            ------------------
 
         

11, నవంబర్ 2011, శుక్రవారం

yuganta


 

 ఇండియన్ మినర్వా గారు యుగాంత గురించి రాసిన విషయాల గురించి;=మన కళ్ళేదుటే జరుగుతున్న చరిత్ర గురించే భిన్నాభిప్రాయాలు ఉన్నవి.4,5,వేల క్రితం   జరిగిన విషయాల గురించి రకరకాల వ్యాఖ్యలు ఉండటంలో ఆశ్చర్యం లేదు.అలాటి వ్యాఖ్యల్లో యుగాంత ఒకటి మాత్రమే .దానితో మనం పూర్తిగా ఏకీభవించనక్కర లేదు.జయాఅనే చిన్న కావ్యమే విస్తరించి మహా భారతమైనది.జైమిని భారతం వ్యాస భారతం కన్న కొంత భిన్నంగా ఉంటుంది.ముందు మీరుకవి త్రయంవారి ఆంధ్ర మహాభారతం ( పద్యకావ్యం కాకపోయినా వచనంలో epic  అనే దృష్టి తో చదవండి.కొంతమంది హీరోలను deify చెయ్యడం ఇతరదేశల్లో కూడాఉంది.సముద్రంలో మునిగిన ద్వారక సిధిలాలు బయట పడడం తో మూలకథ నిజమని తెలిసింది.కాని interpretations మాత్రం మారుతాయి .భారతం పూర్తిగా చదివాక మీ అభిప్రాయాలు మీరే ఏర్పరచు కోవడం మంచిది.;=     కమనీయం.