29, నవంబర్ 2013, శుక్రవారం
  నేను వ్యవసాయంలోగాని,నీటిపారుదల (irrigation)లోగాని నిపుణుడనుగాను.కాని నిన్న వెలువడిన కృష్ణా నది  ' బచావత్ ట్రైబ్యునల్ ' అంతిమ తీర్పు గురించి నా అభిప్రాయం తెలియ జేసుకుంటున్నాను.నిపుణులు వివరించగలరు.దీనిని గురించి  మీడియా,రాజకీయ నాయకులు,బెదరగొడుతూ.ఆంధ్రప్రదేశంతా ఎడారిగా మారిపోతుందని  భయపెట్టుతున్నారేమో  ననిపిస్తుంది.ఎందుకంటే ,మనవాటా  800 T,M.C.లనుండి 1000 T.M.C.  లకిపెంచారు.మిగులుజలాలు ఇదమిత్థంగా నిర్ణయించడం కష్టం కాబట్టి.ఈ అదనపు 200 T.M.C.కిగోదావరినుంచి మళ్ళించే (టైల్ పాండ్ ,పోలవరం ప్రాజెక్టుల  నుంచి ) దాదాపు 200 T.M.C. ల నీటిని నల్గొండ,మహబూబ్ నగర్,రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులకు వినియోగిస్తే సరిపోతుంది కదా.ఇవి నికరజలాలు కాబట్టి లభ్యతకు అనుమానం ఉండదు.ఐతే అన్నిరాష్ట్రాలు నీటి పంపకాన్ని ఖచ్చితంగా పాటించేలాగ అమలుపరచే అధికారాలతో నదీజలాల కమిషన్ ని కేంద్ర పర్యవేక్షణలో నియమించాలి.        

19, నవంబర్ 2013, మంగళవారం

కమనీయం: national awards

కమనీయం: national awards

  గతసారి ప్రఖ్యాతసంగీతకళాకారుడు శ్రీ మంగళంపల్లి  బాలమురళీకృష్ణకి,ISRO CHAIRMAN 'మంగళ్యాన్ '(Mars expedition  ') నిర్దేశకులు శ్రీ రాధాకృష్ణన్ కి వచ్చే ఏడాదైనా భారతరత్న ' అవార్డు ఇవ్వాలని సూచించేను.ఆ సంగతి అలా ఉంచితే ఈసారి  సచిన్ కి  ఆ అవార్డు గురించి వివాదం,కోర్టు  వ్యాజ్యం బయలుదేరాయి.భారతరత్న ఎవరికివ్వాలనేది  కేంద్రప్రభుత్వానికే అంతిమనిర్ణయం ఇవ్వాలి.పద్మశ్రీ లాగ కాదుకదా ఒక సంవత్సరంలో ఈ అత్యున్నత పురస్కారం ఒకరికో ,ఇద్దరికో మాత్రం ఇవ్వాలి.ఇక కీర్తిశేషులకు ఇచ్చే విషయం; సాధ్యమైనంతవరకు వారిజీవితకాలంలోనే ఇవ్వాలి.ఐతే మరణం సంగతి ఎవరూ ముందుగా చెప్పలేరు కాబట్టి ఇవ్వడానికి తగినవారైతే వారి    మరణానంతరం  ఒక్క సంవత్సరంలోనే ఇవ్వాలి.అలా కాకపోతే చాలాకాలం కొంద చనిపోయిన గొప్పవాళ్ళందరికీ ఇవ్వాలనే  వివాదాలు రేకెత్తే అవకాశం ఉంది.ఇది చాలా ridiculous extent కి వెళ్ళే ప్రమాదముంది.టాగూరు,రాజా  రామ్మోహన్రాయి,అక్బరు,అశోకుడు ఇలాగన్నమాట.అందువలన జాతీయావార్డుల ప్రదానానికి కొన్ని మార్గదర్శక నిర్దేశకాలు కల్పించి ,అమలుచేయడం మంచిది.కాని నిర్ణయాన్ని  కేంద్రప్రభుత్వానికే అంతిమంగా వదిలివేయడం మంచిది,అని నా అభిప్రాయం.       
national awards

16, నవంబర్ 2013, శనివారం
 సచిన్ టెండుల్కర్ కి,డా;C.N.రావుకి భారతప్రభుత్వం  ' భారతరత్న 'ప్రదానం చెయ్యడం మనకందరికీ అమితానందదాయక మైన విషయం.సచిన్ గురించి అందరికీ తెలుసును.కాని శాస్త్రజ్ఞులు ఎంత గొప్పవారైనా  క్రీడాకారుల వలె,సినిమా వారివలె సామాన్యప్రజలకు తెలియదు.డా;రావుగారు రసాయనికశాస్త్రంలో నిష్ణాతుడు.అంగారకగ్రహయాన రాకెట్ విజయంలో కూడా ప్రముఖపాత్ర వహించారని తెలిసింది.వీరిద్దర్కీ హార్దికాభినందనలు  తెలుపుదాము.కాని ఒక్క విషయం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి భారతరత్న వస్తుందనీఅశించాను.సంగీతరంగంలో ఆయన అగ్రగామికదా.వచ్చేసంవత్సరంలోనైనా  ఆయనకు ఆ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను.ఇప్పటివరకు  పండిట్ రవిశంకర్ కి,పండిట్ భీంసేన్ జోషి కి ,ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ కి ఇచ్చారు.కర్ణాటకసంగీతంలో దక్షిణాది నుంచి ఒక్క సుబ్బులక్ష్మిగారికే ఈ గౌరవం దక్కింది.అందువలన వచ్చే ఏడాది బాలమురళీకృష్ణ గారికి 'భారతరత్న 'పురస్కారం తప్పక లభించాలని   కోరుకొందాము.అలాగే ISRO DIRECTOR రాధాకృష్ణన్ కికూడా(మంగళ్యాన్ ప్రాజెక్టుకు నిర్దేశకులు)  'భారతరత్న 'బహూకరిస్తారని ఆశిద్దాము. 

BHARATARATNA AWARDS 

9, నవంబర్ 2013, శనివారం

Saastreeyasangeetam-5.prabhaavam.

  Niraval=singing one or two lines repeatedly but with melodic improvisations to outline the raagaa and its theme.
 Taanam=cosists of expanding the raagaa with syllables like ' tha,na,nom.ra etc.
 Tani aavartanam = is the extended solo play by the percussionists .
   శుద్ధ శాస్త్రీయ  సంగీత కచేరిని విని అర్థంచేసుకొని జీర్ణించుకోవాలంటే చాలా మందికి సాధ్యం కాదు.కాని దానిని ఆధారంగా చేసుకొని రచించిన ,సంగీతం సమకూర్చిన పాటలను చాలా మంది విని ఆనందించగలరు.నాటకాల్లో పాటలు,పద్యాలు,లలితసంగీతం.భజనలు,సినిమాపాటలు,స్త్త్రీలపాటలవంటి అన్నిరకాలసంగీతం  పైన శాస్త్రీయసంగీతప్రభావంవుంది.ముఖ్యంగా 1940-1970 మధ్య వచ్చిన ఫిల్మ్ సంగీతం వినండి,( తెలుగు,హిందీ).తెలుగులో రాజేశ్వరరావు,పెండ్యాల,ఆదినారాయణరావు .టి.వి.రాజు ,మహదేవన్ వంటి ప్రసిద్ధసంగీతదర్శకులు ఎన్నో పాటలను శాస్త్రీయ రాగాలను అనుసరంచి వరుసలు సమకూర్చారు.రాజేశ్వరరావు గారికి మోహన,భీంపలాస్,రాగాలంటే ఇష్టమట.ఘంటసాలగారికి మోహన,కళ్యాణి రాగాలంటే ఇష్టమట.'మల్లీశ్వరి   'సినిమాలో ' పిలచిన బిగువటరా ' పాట కాపీ రాగంలోను,'ఎందుకే నీకింత తొందరా ' అనే పాట  కమాచ్ రాగంలో ఉంటాయి.ప్రసిద్ధిపొందిన ' నీలి మేఘాలలో '  పాట (బావామరదళ్ళు ')భీంపలాస్ రాగంలో ఉన్నది.ఘంటసాల,భానుమతి,  కొన్ని కృతులు ,యథాతథంగానే  సినిమాల్లో పాడేరు. (ఉదా; వాతాపిగణపతిం భజే,నగుమోము గనలేని ). కొన్ని పాటలను రెండురాగాలు కలిపి జనరంజకం గా కంపోజ్ చేసారు.(ఉదా; జయభేరి సినిమాలో  ప్రసిద్ధమైన పాట 'రసికరాజ తగువారముకామా ' చక్రవాకం,మలయమారుతం రాగాలు మేళవించి స్వరపరచినట్లు పాత్ర చేతనే పెండ్యాలవారు చెప్పించారు.)1980 తర్వాత క్రమంగా సినిమాలపై క్లాసికల్ మ్యూజిక్ ప్రభావం తగ్గిపోయి,పాశ్చాత్య,'పాప్' మ్యూజిక్ ప్రబావం హెచ్చయింది.పాత గాయనీగాయకుల్లో చాలామందికి శాస్త్రీయ సంగీతంలో పరిజ్ఞానం ఉండేది.ఘంటసాల,పి.బి.శ్రీనివాస్  ,భానుమతి,లీల,సుశీల ,నాగయ్య ,రఘురామయ్య సూర్యకుమారి,బాలసరస్వతి మొ;వారిని  చెప్పుకోవచ్చును.
  అలాగే హిందీ సినిమారంగంలో, సైగల్, అనిల్ బిస్వాస్, మన్నాడే,నౌషాద్,రామచంద్ర, శంకర్-జైకిషన్,లతా, ఆశా సిస్టర్స్,రఫీ,మదన్మోహన్ లవంటివారిని చెప్పుకోవచ్చును.
     శాస్త్రీయ సంగీతం ఆధునిక కాలంలో కూడా  తన వైభవాన్ని కోల్పోకుండా వర్ధిల్లాలని ఆశిద్దాము.
  అందుకోసమే  యువకళకారులు ,సీ.డీ లద్వారా,ఫ్యూజన్ మ్యూజిక్ ద్వారా ,లఘు కచేరీలద్వారా ప్రయత్నిస్తున్నారు.
                                     (సమాప్తం)      
                                     -------                                                                          

కమనీయం: Saastreeya sangeetam=4;kacheri

కమనీయం: Saastreeya sangeetam=4;kacheri

 శాస్త్రీయసంగీతం బాగా అభ్యసించిన తర్వాత కచేరీ (public concert) చేయనిదీ సాఫల్యం కలగదు.దీనికి సహజ ప్రతిభ,వ్యుత్పత్తి,శిక్షణ చాలా అవసరం.శ్రావ్యమైన కంఠస్వరం లేనిదే ఎంత విద్య వున్నా రాణించదు.అలాగే తగినంత శిక్షణ లేనిదే మంచి కంఠస్వరం వున్నా బాగుండదు.మనం ఎన్ని సీ.డీలు విన్నా ముఖతా(live) విన్న అనుభవం వేరు.
  సాధారణంగా కచెరీ ఈ విధంగా జరుగుతుంది.1.మొదట వినాయక స్తోత్రం తో ప్రారంభమౌతుంది. 2.నాటరాగంలోరచనతో ప్రారంభించడం ఒక సంప్రదాయం.3.తర్వాత కొన్ని వర్ణాలు,తర్వాత కృతులు ఒక్కొక్కటి 5 నుంచి 10 నిముషాలు సమయం తీసుకొని పాడతారు.3.ఆ తర్వాత ప్రధానమైన కృతి అరగంట నుంచి ఒక గంట వరకు కూడా సమయం తీసుకొని పాడతారు.( piece de resistance).ఇది ఈ విధంగా సంగీతంలోని అన్ని పార్శ్వాలను ప్రదర్ర్శిస్తూ  దాని పూర్ణ స్వరూపం తెలుసుకోడానికి పనికివస్తుంది. మొదట రాగాలాపన ,సాహిత్యం లేకుండా రాగంలోఉన్న విశిష్టతను మంద్ర,మధ్యమ,తారాస్థాయిలను స్పృశిస్తుంది. తర్వాత ' తానం ' (స్వరాలతోమాత్రం) పాడుతారు. ఆ పిమ్మట వరుసగా పల్లవి,అనుపల్లవి, చరణాలు  రిపీట్ చేస్తూ వివిధ గమకాలు,సంగతులతో(అంటే వివిధరీతుల్లో ) పాడతారు.మూడు కాలాల్లోను,మూడు స్థాయిల్లోను పాడవచ్చును.ముగించేముందు ప్రక్కవాయిద్యాలకి వయొలిన్,మృదంగం ,ఘటం లకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం,సమయం కల్పిస్తారు.4.తర్వాత మళ్ళీ కొన్ని కీర్తనలు వివరంగా పాదుతారు.5.చివరి దశలో జావళి,తిల్లాన వంటీనృత్యానికి అనువైన పాటలు పాడేక ,తేలికగా,అన్నమయ్య ,రామదాసు  వంటి  వారి కీర్తవలు,భజనలు పాడతారు.మొత్తం మీద కచేరీ దాదాపు 3 గంటలు సేపు కొనసాగవచ్చును.ఇటీవల వినేవారికి,పాడేవారికి ఓపిక తగ్గడంవలన కొంత  కుదిస్తున్నారు.5.కచేరీని ' మంగళం 'తోముగించడం సంప్రదాయం.
  పాడే వేగాన్ని బట్టి విలంబిత (slow) ,మధ్యమ (medium) ద్రుత (fast) అని మూడు రకాలు.
  పాడే స్థాయినిబట్టి (pitch) మంద్ర (low),మధ్య (medium),తార (high) స్తాయీ భేదం వుంటుంది. 
  మనకన్నా ఉత్తరాదిలో  ఫలాన రాగం ఫలానా వేళలో,లేక ఫలానా రుతువులో పాడాలనే నియమముంది.అవి అప్పటి mood కి సరిపోతాయని వారి నమ్మకం.కొన్ని ఉదాహరణలు 1.భూపాలరాగం=ఉదయకాలంలో 2.మేఘమల్ హార్= వర్షాకాలం .3.దీపక్ రాగం=రాత్రిపూట.4.చక్రవాకం,సావేరి= ఆర్తిని,ఆవేదనని కలిగిస్తాయి.4.మోహన,కళ్యాణి,కాపీ రాగాలు=శృంగార ,ఆనంద భావాలు కలిగిస్తాయి. 5.కదనకుతూహల,దర్బారీకానడ రాగాలు = ఉత్సాహాన్ని,ఉద్వేగాన్ని కలిగిస్తాయి .marching songs  కి ,జాతీయగీతాలకి పనికివస్తాయి. (ఇంకా వుంది)    

Saastreeya sangeetam=4;kacheri

8, నవంబర్ 2013, శుక్రవారం

Sastreeyasangeetam-3;performers
 20 వ శతాబ్దానికి ముందు గాయకులు గురించి,అంతగా తెలియదు.కాని తర్వాత ధ్వనిముద్రణ కనిపెట్టి  గ్రామొఫోన్ రికార్డు కంపెనీలు వచ్చాక గాయనీగాయకుల,వాయిద్యకారులperformance ని దాచుకొని వినడానికి వీలయింది.పత్రికలు,నాటక నృత్య,సంగీతసభలద్వారా ప్రభువుల ఆస్థానాలనుంచి సంగీతం ప్రజలవద్దకు చేరుకొంది.ప్రజాదరణతోనే వృద్ధిపొందింది.
  తొలితరం గాత్రసంగీతంలో పేరుగాంచిన కొందరి జాబితా 1.డి .కె.పట్టమ్మాళ్.2.యం.యల్.వసంతకుమారి.3.యం.యస్.సుబ్బులక్ష్మి.4.యన్.సి.వసంతకోకిలం .5.టి.బృంద 6.రాధా-జయలక్ష్మి. 7.ముత్తయ్య భాగవతార్ 8.మైసూర్ వాసుదేవాచార్ 9.చెంబై వైద్యనాథ  భాగవతార్ 10.అరియకుడి రామానుజ అయంగార్ 11.సెమ్మంగుడిశ్రీనివాస అయ్యర్. 12.ముసిరి సుబ్రమణ్య అయ్యర్. 13.మహారాజపురం విశ్వనాథ అయ్యర్.14.అలత్తూర్ బ్రదర్స్. 15.యం.డి.రామనాథన్ 16.మదుర మణి అయ్యర్ .17.మహారాజపురం సంతానం.18.కె.వి.నారాయణస్వామి.19. శీర్కాళి గోవిందరాజన్.
  తరవాతి తరంవారు ;- డా.యం.బాలమురళీ కృష్ణ 2.టి.యన్.శేషగోపాలన్.3.ఆర్.వేదవల్లి.4. కె.జె.జేసుదాస్. 5.నేదునూరి కృష్ణమూర్తి.6.నూకలచినసత్యనారాయణ. 7.బాంబే సిస్టర్స్. 8.ప్రిన్స్ రామవర్మ. 9.మండా సుధారాణి. 10.యస్.ఆర్.జానకీరామన్. 11.మండపాకశారద . 12.పంతుల రమ 13. శ్రీరంగం  గోపాలరత్నం .
   ఇటీవల కాలంలో పేరుపడుతున్నవారు.1.సుధారఘునాథన్. 2.నిత్యశ్రీ.3. ఉన్నికృష్ణన్. 4.ప్రియా సిస్టర్స్. 5.మల్లాది బ్రదర్స్.
  వాయిద్యకారులలో కొందరు ప్రసిద్ధులు;-
  వయొలిన్;-- 1.కున్నక్కుడి వైద్యనాథన్.2.టి.చౌడయ్య.3.ద్వారం వెంకటస్వామినాయుడు 4.లాల్గుడి జయరామన్. 5.యం.యస్.గోపాలకృష్ణన్. 6.యల్.వైద్యనాథన్. 7.యల్.సుబ్రమణ్యం. 8.టి.యన్.కృష్ణన్. 9.యల్.శంకర్.10. టి. వి. గోపాలకృష్ణన్ 11.గణేష్=కుమరేష్.
   వీణ;= 1.ఈమని శంకరశాస్త్రి 2.యస్.బాలచందర్. 3.సి.హెచ్.చిట్టిబాబు. 4.గాయత్రి. 5.రాజేష్ వైద్య.  
  మురళి;= టి.ఆర్.మహాలింగం . 2.యన్.రమణి.3.ప్రపంచం సీతారాం. 4.విశ్వనాథన్. 5.భాస్కరన్. 6.సిక్కిల్ సిస్టర్స్.
 నా దస్వరం. ;=1.నామగిరిపేట కృష్ణన్ .2.షేక్ మహబూబ్ సుభాని .3.షేక్ చిన మౌలానా సాహెబ్.
  మృదంగం;= 1.పాల్ఘాట్ మణి అయ్యర్. 2.పళని సుబ్రమణి అయ్యర్. 3.పాల్ఘాట్ రఘు. 4.యల్లా వెంకటెశ్వర రావు.
  ఘటం;=1.టి.ఆర్.వినాయకం(విక్కు).
  కంజీర;= 1.హరిశంకర్. 2.గణేష్.
  మాండొలిన్;=యు.శ్రీనివాస్.
  గిటార్ =ఆర్.ప్రసన్న.
  మోర్సింగ్;=శ్రీరంగం కన్నన్
 చిత్రవీణ;=యన్.రవికిరణ్.
  జలతరంగిణి;= అనయంపట్టి యస్.గణేశన్.
     శాగ్జోఫోన్;- కదిరి గోపీనాథ్.
    ఏ జాబితా  కూడా సంపూర్ణం కా లేదు.నాకు తెలిసినంతవరకు వ్రాయగలిగాను.పై జాబితాలో  కీర్తిశేషులు,సుప్రసిద్ధులై ఇంకా మనమధ్య ఉన్నవారు, వర్ధమాన కళాకారులు అందరూ ఉన్నారు.నెటి యువతీయువకుల్లో కూడా శాస్త్రీయ సంగీతాన్ని(గాత్రం,వాద్యములు,) అభ్యసిస్తున్నవారు చాలామంది ఉండడం సంతోష దాయకమే. (ఇంకా ఉంది).    

7, నవంబర్ 2013, గురువారం

Sastreeyasangeetam-2;composers 

 కర్నాటక సంగీతంలో  గాత్రానికి సహకారంగానూ,స్వతంత్రంగానూ కొన్నివాద్యాలని వాడ్తారు.1.తంత్రీ వాద్యాలు.వయొలిన్, వీణ వంటివి.(stringed instruments)2.సుషిర   వాయిద్యాలు;వేణువు,సన్నాయి వంటివి ( wind instruments ) 3.అనవద్ధ వాద్యాలు.(percussion instruments) మృదంగం  ,డోలు వంటివి.ఈ రోజుల్లో క్లారినెట్.మాండొలిన్,శాక్జొఫోన్ వంటివి కూడా వాడుతున్నారు.
  వాగ్గేయకారులు (composers) ;-- 1.పురందరదాస(1484-1564) కన్నడంలోను,సంస్కృతంలోను ఎన్నోవేల కీర్తనలు రచిస్తే ఇప్పుడు లభ్యమౌతున్నవి 2000.
   2.కనకదాస;-- (1509-1609 )కన్నడంలో 1000 కీర్తనలు
  3.అన్నమాచార్య ;-- 30000దాకా రచించినట్లు ప్రతీతి.కాని నేడు 3600 కీర్తనలు మాత్రం లభ్యం.తెలుగులోను,కొన్ని సంస్కృతంలోను రచించాడు .
  4.అరుణగిరినాథ;--  తమిళంలో దాదాపు  1500 రచనలు చేసాడు.(15 వశతాబ్దం.)
 5.భద్రాచల రామదాసు ;-- (1620-1688) తెలుగులో500 కీర్తనలు రచించాడు.దాశరథి  శతకకర్త కూడా.
  6.క్షేత్రయ్య;-- (1600-1680)తెలుగులో100 పదాలు రచించాడు
   7.నారాయణతీర్థ;- (1650-1745) తెలుగు,సంస్కృతంలో 200 రచనలు
  8.సారంగపాణి;--  (1680-1750) తెలుగులో 200 పైగా పదాలు రచించాడు
  9.విజయదాస- (1682-1755 ) కన్నడంలో 25000  కీర్తనలు రాసినట్లు ప్రతీతి.
  ఇక సంగీతానికి త్రిమూర్తులుగా పేరుపడిన వారు18 వ  శతాబ్దపు మలిభాగంలోను,19వ  శతాబ్దం తొలిభాగంలోను  జీవించారు.సమకాలికులు.తంజావూరు ప్రాంతీయులు.
  1.త్యాగరాజు;- సుప్రసిద్ధులు. వేలకొద్దీ కృతులు పాడినా  ప్రస్తుతం దాదాపు 1000 కీర్తనలే దొరుకుతున్నవి.జీవితకాలం 1767-1845 ప్రహ్లాదవిజయం.నౌకాచరిత్రం అనే సంగీత నాటికలు కూడా రచించాడు.
  2.శ్యామశాస్త్రి;-మీనాక్షీదేవి పైన ఎక్కువ కృతులు రచించాడు.(1762 -1827)
  3.ముత్తుస్వామి దీక్షితులు ;- (1776-1835) 300 కృతులు రచించాడు.సంస్కృతంలో వ్రాసిన ఈ కీర్తనలలో ఒక చోట రాగం పేరును సూచించడం ఈయన ప్రత్యేకత.
  వీరుగాక,తిరువాంకూర్ ప్రభువు స్వాతితిరునాళ్ (1813-1843 ) బహుభాషావేత్త .చాలా భాషల్లో స్వల్ప   జీవితకాలంలోనే రచించాడు.
  సదాశివబ్రహ్మం,మైసూర్ వాసుదేవాచార్ ,పట్నం సుబ్రమణ్య అయ్యర్, చెప్పుకోదగిన  వాగ్గేయకారులు.
  ఆధునికులు కూడా కొందరు ( బాలమురళీకృష్ణ   వంటివారు ) సంగీతరచనలు కొనసాగిస్తూనేఉన్నారు.చాలామంది వాగ్గేయకారులు తమపేరును ఒకచోట ఉటంకిస్తారు. (ఉదా;'త్యాగరాజనుత 'అన్నట్లు).   

6, నవంబర్ 2013, బుధవారం

sastreeya sangeetam 

  మన భారతీయశాస్త్రీయసంగీతం చాలాకాలం దేశమంతా ఒకే రీతిలో ఉండేది.12వశతాబ్దం నుంచి ముస్లిం దందయాత్రలు ,ఆక్రమణలతో ఉత్తర హిందూస్థానంలో పర్షియన్ సంగీతప్రభావంవలన ఉత్తరాది,దక్షిణాది సంగీతాలు  విభిన్న మార్గాలు అనుసరించాయి. దక్షిణాది లేక కర్ణాటక సంగీతంపై పర్షియన్ ప్రభావం చాలా తక్కువ.ఇది నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా,ఆంధ్ర.తమిళ,కేరళ,కన్నడ ప్రాంతాల్లో వ్యాపించింది.విజయనగర సామ్రాజ్యకాలం నుంచి  మొత్తం దక్షిణ భారతాన్ని తెలుగు రాజులు,ప్రభువులు ,జమీందారులు పాలించడం వలన తెలుగువారేకాక ఇతర భాషల వాగ్గేయకారులు కూడా తమరచనలని చాలా తెలుగులోనే చేసారు.
  మనసంగీతంలో పాశ్చాత్య సంగీతం తోపోలిస్తే haarmony (అనేకవాయిద్యల సమ్మేళనం ) కన్నా melody  (రాగం ,స్వరప్రస్తారం )ముఖ్యం.అలాగే prescribed notations  కన్నా,మనోధర్మం(improvisation) ముఖ్యం.
 సంగీతం సప్తస్వరాల సమ్మేళనం వలన ఏర్పడుతుంది.అవి,1స (షడ్జమ) 2. రి (వృషభ) 3.గ(గాంధార) 4.మ(మధ్యమ) 5.ప (పంచమ) 6.ద (దైవత) 7, ని (నిషాద)
 2.శ్రుతి -(musicall pitch ) స్తాయి.ఇది తప్పిపోకుండా maintainn చేయాలి.దీనికి తంబురా వాడుతారు.
 3.తాళం (fixed time cycle ) లయ.
 4.రాగం మొత్తం 72 మేళకర్త రాగాలు ఉన్నాయి.(జనకరాగాలు).వీట్లోంచి ఎన్నో జన్య రాగాలు సాధించవచ్చును.పాటల్లో వైవిధ్యం ఈ వివిధ రాగాలవలననే కలుగుతుంది.(tunes)
   సంగీతం నేర్చుకొనడానికి ప్రాథమిక మైన  దశ నుంచి ప్రారంభించి క్రమంగా ఉన్నతమైన ,క్లిష్టమైన దశకు చెరుకోవలసి ఉంటుంది.అందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందంటారు.
  మొదట సరిగమలు సరిగ పలకడం నేర్పుతారు. తర్వాత వాటినే జంటగా.సస,రిరి,గగ-,అని సాధనచేయిస్తారు.తర్వాత సరళీస్వరాలు ,గీతాలు నేర్పిస్తారు.
 వర్ణం;-ఇందులో రాగానికి కావలసిన పల్లవి,అనుపల్లవి,చరణం, చిట్టస్వరం(పదాలుల్లేకుండా స్వరాలు మాత్రమే) ఉంటాయి.ఇవి బాగా నేర్చుకుంటే ,శ్రుతి,తాళం,voice culture అలవడుతాయి.
  కృతి(కీర్తన) ;-ఇంకా పై మెట్టు అన్నమాట.వీటిలో,పల్లవి,అనుపల్లవి,చరణాలు ఉంటాయి.పాడినప్పుడు రాగాలాపన,తానం,సంగతులు,గమకాలు వేసి పాడతారు.
 
 ఇవి గాక నృత్యానికి  అనుకూలమైన జావళీలు,తిల్లానలు.భజనపాటలు మొదలైనవి కూడా ఉంటాయి.
  ఈ బ్లాగులు సీరియల్గా వ్రాయదలుచుకొన్నాను.సంగీతంలో ప్రవేశం ఉన్నవారికి ఇవి అనవసరము.  అలాగే అభిరుచి లేనివారికి కూడా అనవసరమే.నాలాగ అభిరుచి ఉన్నా ప్రవేశంలేనివారికోసమే.,నా పరిమితజ్ఞానం తో  వ్రాస్తున్నాను.
               ((ఇంకా ఉంది)).

5, నవంబర్ 2013, మంగళవారం

jayaketanam
 
  అభ్రవీథిలో-అద్భుతం
                 భారతీయ జయకేతనం
  శాస్త్రవేత్తల,మేధావుల
  జ్ఞానరాశుల- ఘనతమప్రయోగం
  అంగారకుని చేరగా -అత్యాధునిక సాంకేతికం
  అగ్నిధారలను చిమ్ముచు,-అంబరం లోకి దూసుకుపోయెను
  నిర్ణీత కాలంలో- నిర్దేశితకక్షను చేరిన
   మంగళయాన క్షిపణి ప్రయోగం
                      భారతీయజయకేతనం
   జయఘోషలతో నినదిద్దాం - జైత్రయాత్రను సాగిద్దాం
   అగ్రదేశాల సరసన -అవలీలగ నిలుద్దాం
   అబ్రవీథిలో,అంబరాంచలాల - అన్నిదేశాలు తిలకించి అబ్బురపడగా
                  ఎగురవేద్దాం భారత జయకేతనం!          
                --------------------
       
3, నవంబర్ 2013, ఆదివారం

gold imports
 ప్రపంచంలో బంగారం దిగుమతిచేసుకొనే దేశాల్లో ప్రధానమైనవి భారత్,చైనాలు.మనదేశంలో కొన్ని పండుగలకి,పెళ్ళిళ్ళకి బంగారం ఎక్కువగా ధనవంతులేగాక మధ్యతరగతివాళ్ళు కూడాకొంటారు.ఇటీవల ప్రపంచంలో ఆర్థికమాంద్యం వలన మన ఎగుమతులు తగ్గిపోయి ,మనం ప్రధానంగా దిగుమతి చేసుకొనే పెట్రోలు,డీజలు ,బంగారం విలువేక్కువై ,ఆర్థికలోటు fiscal  deficit ఎక్కువయింది.అందువలన  కొత్త రిజర్వ్ బాంక్ గవర్నర్ సలహాపై బంగారం దిగుమతిని ప్రభుత్వం తగ్గించివేసింది.దీనితో దేశీయ,అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లు గిరాకి తగ్గి దెబ్బతిన్నాయి.వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చినా  విధానం మార్చుకో లేదు.డీజల్.గ్యాస్ ధరలు కూడాకొంతపెంచారు.దీనితో ద్రవ్యలోటు తగ్గి దేశార్థికపరిస్థితి  కొంత చక్కబడింది.కాని ఇవి ప్రజల్లో వ్యతిరేకత పెంచే  నిర్ణయాలు.(unpopular decisions ) వీటి పరిణామాలు వేచి చూడాలి.   ప్రపంచంలో బంగారం దిగుమతిచేసుకొనే దేశాల్లో ప్రధానమైనవి భారత్,చైనాలు.మనదేశంలో కొన్ని పండుగలకి,పెళ్ళిళ్ళకి బంగారం ఎక్కువగా ధనవంతులేగాక మధ్యతరగతివాళ్ళు కూడాకొంటారు.ఇటీవల ప్రపంచంలో ఆర్థికమాంద్యం వలన మన ఎగుమతులు తగ్గిపోయి ,మనం ప్రధానంగా దిగుమతి చేసుకొనే పెట్రోలు,డీజలు ,బంగారం విలువేక్కువై ,ఆర్థికలోటు fiscal  deficit ఎక్కువయింది.అందువలన  కొత్త రిజర్వ్ బాంక్ గవర్నర్ సలహాపై బంగారం దిగుమతిని ప్రభుత్వం తగ్గించివేసింది.దీనితో దేశీయ,అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లు గిరాకి తగ్గి దెబ్బతిన్నాయి.వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చినా  విధానం మార్చుకో లేదు.డీజల్.గ్యాస్ ధరలు కూడాకొంతపెంచారు.దీనితో ద్రవ్యలోటు తగ్గి దేశార్థికపరిస్థితి  కొంత చక్కబడింది.కాని ఇవి ప్రజల్లో వ్యతిరేకత పెంచే  నిర్ణయాలు.(unpopular decisions ) వీటి పరిణామాలు వేచి చూడాలి.