30, మే 2012, బుధవారం

Diet చాలా మందికి తెలిసే వుంటుంది.ఐనా కావలసిన వారు నోట్ చేసుకోవచ్చును.ఈ ఆహారం 1200 కేలరీల శక్తిని ఇస్తుంది.ఇది దాదాపుగా గుండెజబ్బు,రక్తపోటు,మధుమేహం ఉన్నవారికి అందరికి పనికి వస్తుంది.ఐతే స్థూలకాయం కూడా ఉంటే మరి కొంచెం తగ్గించి 1000 కేలరీల ఆహ్హారం తీసుకోవాలి.
   ఉదయం 7-30=8గం. 2,3 వెల్లుల్లి రేకలు.6-8 నానపెట్టిన మెంతులు మంచినీళ్ళతో.అరకప్పు నీళ్ళలో పావుకప్పు కాకరకాయ రసం.
   8-30=9 గం.-అల్పాహారం (breakfast) 2ఇడ్లీలు చట్నీతో.|లేక 1పరాటా కూరతో.అరకప్పు పాలు,లేక పాలతో కలిపి టీ లేక కాఫీ. పాలలో కొవ్వు ఉండకూడదు. చక్కెర వేసుకో కూడదు.  
   10-30=11గం.-1చిన్న కమలా లేక నారింజ పండు.
  12-30=1-30-భోజనం (lunch) -2 పుల్కాలు|లేక జొన్నరొట్టెలు ; చిన్న గిన్నెలో అన్నము ,ఉడకబెట్టిన కూరతో.;చిన్న గిన్నెలో పప్పు ,\లేక సాంబారు.
  4-6గం.మధ్య- - కొవ్వులేని అరగ్లాసు పాలు లేక పాలతో టీ లేక కాఫీ తాగవచ్చును.చక్కెర వేసుకోకూడదు.
  చిన్నగిన్నెలో సగం వేయించిన శనగలు,|లేక మొలకెత్తిన శనగలు,
  8-30==9గం.రాత్రి-భోజనం.(dinner) 2పుల్కాలు|లేక జొన్న రొట్టెలు ;1గిన్నె ఉడికించిన కూరగాయలు .1గ్లాసు కొవ్వులేని మజ్జిగ.
  10-11గం.మధ్యరాత్రి =1చిన్నగ్లాసుతో కొవ్వుతీసిన పాలు.
   Note;- పాలు,టీ, కాఫీలలో చక్కెర బదులు sugar free  మాత్రలు  1 లేక 2 వాడ వచ్చును.
 సాధారణ సూత్రములు.(general principles) 1.నెయ్యి,వెన్న ,కొబ్బరి,వాటితో వండిన పదార్థాలను వాడకూడదు.2.మిఠాయిలు ,మైదా,కేకులు ,తినకూడదు.పనస,మామిడి ,సీతాఫలం,వంటి గ్లూకోజ్ ఎక్కువగా వుండే పండ్లను తినకూడదు.టిన్స్ లోని ఆహారాన్ని వర్జించాలి.(tinned foods) .మాంసాహారం బాగ తగ్గించాలి.వదలి వేయడం మంచిది.చేపలు తినవచ్చును.బరువు పెరగకుండా చూసుకోవాలి.వయసుని బట్టి వ్యాయామం చెయ్యాలి.ఆహారంలో ఉప్పు తగ్గించాలి.చక్కెర వేసుకోకూడదు.మద్యం,పొగాకు ,వాడకూడదు.
   

3, మే 2012, గురువారం

national film awards ఈ రోజు జాతీయచలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని టీ.వీ.లో కొందరైనా చూసివుంటారు.ఫిలింఫేర్ అవార్డులలాగ glamour లేకుండా అంతా అఫీషియల్ గా జరిగింది.కాని ఈ జాతీయ అవార్డులు ని చాలా ప్రముఖంగా,ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తారు.ఎక్కువగా మళయాళీ,కన్నడ ,బెంగాలీ ,మరాఠీ పేర్లే వినిపించాయి.ఒక్క తెలుగు పేరు కూడా వినిపించకపోవడం తో మనస్సు చివుక్కుమంది.మన తెలుగు చలన చిత్రాల ప్రమాణాలు 'కళాత్మకంగా ' చూస్తే ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమౌతుంది.
   కాని ఒక విషయం రాయదలుచుకొన్నాను.వచ్చే ఏడాది అయినా దర్శకుడు కె.విశ్వనాథ్ గారికి ప్రతిష్ఠాత్మక మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ,ఆం.ప్ర.ప్రభుత్వము గట్టిగా కృషి చెయ్యాలి.అందుకు ఆయన అన్ని విధాలా అర్హుడు కాబట్టీ.
  రెందవ విషయం; మొదటి తెలుగు టాకీ 'ప్రహ్లాద ' ను ,సాంఘిక చిత్రాలకి మార్గదర్శకంగా 'గృహ లక్ష్మి ' చిత్రాన్ని తీసిన H.M.రెడ్డి పేరిట  మన రాష్ట్రంలో ఏ అవార్డూ లేక పోవడం శోచనీయం. ఇకమీదైనా ఆలోటు తీరుతుందని ఆశిస్తున్నాను.

2, మే 2012, బుధవారం

veyipadagalu-Novel.
 విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆరాధించేవారు ఉన్నారు.తీవ్రంగా వ్యతిరేకించేవారు ఉన్నారు.ఆయన భావజాలమే ideologyయే దీనికి కారణం .కాని ఆయన ప్రతిభ,పాండిత్యం,కవితాప్రావీణ్యం, బహుముఖప్రజ్ఞల గురించి మాత్రం అందరూ ఏకీభవిస్తారు.ఐతే ప్రస్తుతం వీటి గురించి వ్రాయడం లేదు.వేయిపడగలు నవలలోని అంశాలగురించి వ్రాయదలిచాను.50 సం; లో సుబ్బన్నపేట అనే వూళ్ళో వచ్చిన మార్పులు (అంటే ఆంధ్రదేశపు పల్లెలు,పట్నాలలో వచ్చిన మార్పులకు ప్రతీకగా ) చక్కగా చిత్రించారు.విచిత్రమేమంటే అభ్యుదయనిరోధకుడు అని నిరసించిన వారే అవే అభిప్రాయాలని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.ముఖ్యంగా  వామపక్షీయులు, పర్యావరణవాదులు,మానవహక్కులసంఘాలు.
 1.ఆయన ఆ నవలలో వరిపంట విస్తరించడాన్ని వ్యతిరేకించారు.ముతకధాన్యాలు,మెట్టపంటల్నిప్రోత్సహించాడు.అవే బలవర్ధకాలన్నారు
 2.జానపదకళలని వర్ణించారు.వాటి క్షీణతని గురించి బాధపడ్డారు.
  3.ముఖ్యంగా చేతి పనులు ,వృత్తుల విధ్వంసాన్ని నిరసించారు.
  4.పర్యావరణం ఎలా పాడయిపోతున్నదో వివరించారు.
  5.గ్రామాలు రాజకీయాలతో ఎలా కలుషితం అవుతున్నవో బాగా  చిత్రించారు.6.మానవ,కుటుంబ సంబంధాలు ఎలా విచ్చిన్నమౌతున్నవో వర్ణించాడు.
   ఈ రోజుల్లో ఇంచుమించు ఇదే భావాలతో ,అంశాలతో ఆధునికులు కథలు రాస్తున్నారు. విశ్వనాథవారు ఇవన్నీ ఊహించి ముందుగానే prophetic గా రాయడం గమనించవలసిన విషయం. అందుకే మనం ఆయనతో కొన్ని చాందసభావాల గురించి విభేదించినా ' వేయి పడగలు ' తెలుగులో గొప్ప నవలలలో ఒకటి అని అంగీకరించాలి. 

1, మే 2012, మంగళవారం

japan ఈ మధ్య the shrinking country అని ఒక వ్యాసం చదివేను.అందులో ప్రధానాంశాలు మాత్రం పేర్కొంటున్నాను.జపాన్ అభివృద్ధి చెందిన సంపన్నదేశమని మనకు తెలిసిందే. కాని ఒక దశాబ్దంగా ఆర్థికంగా depression లో ఉన్నది.దానికి తోడు జనాభా తగ్గుతున్నదట.కారణం ; చాలామంది యువతీ యువకులు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతున్నారట.చేసుకొన్నా 30,35 సం; దాటాకగాని చేసుకోటం లేదట. సహజీవనం ' చేస్తున్నవారు కూడా  వారి సంప్రదాయ బలంవల్ల  వివాహం కాకుండా పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు.మరొక విషయం; విదేశీయులు వాళ్ళ దేశానికి వలస రావడం జపాన్ వారికి వ్యతిరేక భావం వుంది.ఆయుప్రమాణం బాగాపెరగడం వల్ల దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి బాలల సంఖ్య తగ్గిపోయింది.పై కారణాల వలన జపాన్లో జనాభా (ముఖ్యంగా కష్టపడి పనిచేయగల యువ జనుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది.
  ఇటువంటి పరిస్థితులే అమెరికా, ఇంగ్లాండు వంటి దేశాల్లో కూడావున్నా ,వివాహం లేకుండా సహజీవనం చేస్తూ పిల్లలను కనడానికి ఆక్షేపణ లేదు.కొంతవరకు ఇతర దేశాలవారి వలసల్ని అనుమతిస్తారు.అందువల్ల అక్కడ పనిచేయగలవారి జనాభా అంతగా తగ్గడంలేదు.
   ఈ విస్   హయాలు మనం కూడా పరిశీలించవలసి వుందనుకొంటున్నాను.

japan
 ఈ మధ్య the shrinking country అని ఒక వ్యాసం చదివేను.అందులో ప్రధానాంశాలు మాత్రం పేర్కొంటున్నాను.జపాన్ అభివృద్ధి చెందిన సంపన్నదేశమని మనకు తెలిసిందే. కాని ఒక దశాబ్దంగా ఆర్థికంగా depression లో ఉన్నది.దానికి తోడు జనాభా తగ్గుతున్నదట.కారణం ; చాలామంది యువతీ యువకులు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతున్నారట.చేసుకొన్నా 30,35 సం; దాటాకగాని చేసుకోటం లేదట. సహజీవనం ' చేస్తున్నవారు కూడా  వారి సంప్రదాయ బలంవల్ల  వివాహం కాకుండా పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు.మరొక విషయం; విదేశీయులు వాళ్ళ దేశానికి వలస రావడం జపాన్ వారికి వ్యతిరేక భావం వుంది.ఆయుప్రమాణం బాగాపెరగడం వల్ల దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి బాలల సంఖ్య తగ్గిపోయింది.పై కారణాల వలన జపాన్లో జనాభా (ముఖ్యంగా కష్టపడి పనిచేయగల యువ జనుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది.
  ఇటువంటి పరిస్థితులే అమెరికా, ఇంగ్లాండు వంటి దేశాల్లో కూడావున్నా ,వివాహం లేకుండా సహజీవనం చేస్తూ పిల్లలను కనడానికి ఆక్షేపణ లేదు.కొంతవరకు ఇతర దేశాలవారి వలసల్ని అనుమతిస్తారు.అందువల్ల అక్కడ పనిచేయగలవారి జనాభా అంతగా తగ్గడంలేదు.
   ఈ విస్   హయాలు మనం కూడా పరిశీలించవలసి వుందనుకొంటున్నాను.