30, ఆగస్టు 2011, మంగళవారం

upasanti


   బాధాతప్తహృదయానికి -మృదువచనామృతసేచనం
   క్రొధారుణనేత్రానికి-కృపాపాంగ వీక్షణం
   వేదనక్షుభిత జీవికకు -వీడని తోడగు నెచ్చెలి
   క్షుదాక్రోశ జఠరానికి -కూరిమి తో నిడు అన్నము
   శొధన మగ్నుడగు శాస్త్రజ్ఞునికి - సులువగు పరిష్కారము
   మేథో మథన విశంకితునకు -మేలగు పథ నిర్దేశము
   వ్యాధి గ్రస్త శరీరానికి -వరిష్ఠ మగు ఔషధము    
                   ---------------------

28, ఆగస్టు 2011, ఆదివారం

samasya

    amendment- ఆఖరి చరణం -పరుని పైన సాద్వి మరులు గొనెను -అని ఉండాలి కదా  

my new blog

౧.అన్నాహజారే  దీక్షని ,ఆయన సాధించిన విజయాన్ని అందరం అభినందిద్దాం .దానితో బాటు మరొక్క విషయం గుర్తు చేసుకోవాలి. మన రాజ్యాంగం ,ప్రజాస్వామ్యం కూడా అభినందనీయమే. భారత్ వంటి దేశాల్లోనే  ఇలాంటి సత్యాగ్రహం,అహింసా ఉద్యమం సాధ్యమౌతుంది. నక్సలైట్ ఉద్యమం వంటి హింసాయుత ,దౌర్జన్యా,ఉద్యమాలు మన ప్రజలకు నచ్చవు.అవి విజయం సాధించలేవు.
 ౨.చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తుంటారు. కాని ఇందుకు నేను విభేదిస్తున్నాను.యువతీ యువకులు ముందు వారివారి రంగాల్లో ,వ్రత్తుల్లో రాణించాలి.ధనార్జన చెయ్యాలి.భోగభాగ్యాలతో సుఖించాలి.సమాజాన్ని ,ప్రపంచాన్ని బాగా అధ్యయనం చెయ్యాలి.౪౫,౫౦ సం;;వయస్సు లో రాజకీయాల్లో ఆసక్తి   ఉంటె చేరవచ్చ్ను.క్రమంగా ఉన్నత స్థానాలకి ప్రయత్నించవచ్చును.౭౫-౮౦సమ్;తర్వాత రా  జకీయాల్లోనుంచి విశ్రాంతి తీసుకోవాలి.ఇది నా అభిప్రాయం.

25, ఆగస్టు 2011, గురువారం

samasya

  గ్రహణ కాలమ్ము నందున ఖరకిరణుని
 కాంచు వేడ్కతో మసిబూసి కరమునందు
 ముకురమునజూడ వింతగా ముదము మీర
 హస్తగతుదయ్యే సూర్యుడత్యద్భుతముగా

24, ఆగస్టు 2011, బుధవారం

new poem

 చైత్ర వీణా తంత్రి ఝనం ఝణ నిక్వాణం
గ్రీష్మ మృదంగ లయ భీషణ తాళ ధ్వానం 
శ్రావణ నీల పయోధర జలతరంగిణి రావం   
కార్తిక మధు మురళీ కమనీయ రాగం 
పౌష్య నర్తకీ మణి పద కింకిణి ధ్వనులు 
శిశిర సారంగీ విశీర్ణ శోకమూర్చనలు 
      ఋతు గాన సభ లోన 
      ప్రతి ఏట  సంగీతం 
    ----------------------------

కమనీయం: smasyapooraNam

కమనీయం: smasyapooraNam koodali.org

smasyapooraNam

       విద్య నిచ్చి బ్రోచు విమలాంగి  శారద 
       కమలజునకు  భార్య ; కమలయే గద
       ఆమె  అత్తగారు ; ఐనను నది ఏమొ
       ఉండరొక్క చోట  ఒద్దికగను  
           ------------------

22, ఆగస్టు 2011, సోమవారం

viral fevers

ఈ మధ్య వైరల్ జ్వరాలగురించి వింటున్నాము.మెడికల్ గ్రందాలనుంచి ,అంతర్జాలంలోనూ,వీటిగురించి తెలుసుకోవచ్చును.కాని అందరికీ అంత ఓపిక ఉండదు.అందుచేత  డాక్టర్గా క్లుప్తంగా తెలియ జేస్తున్నాను.
 ఈవైరస్లకు కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి ౧.అవి ఇతర జీవకనాలలోనే వ్రిద్ధి చెందగలవు.౨.గాలి ద్వారా ,రోగి తుమ్మినా,దగ్గినా తుమ్పురులద్వార ,ఆడిస్ దోమకాటుద్వారా వ్యాపిస్తాయి.౩.కొన్నికలుషిత రక్తంద్వారా ,కొన్నిలైంగిక సంపర్కం ద్వారా సంక్రమించవచ్చును.౪.రోగిశరీరంలోకి  ప్రవేసిన్చాక రెండు ,మూడు రోజులు స్తబ్దంగా వుంటాయి. 
  ౫రోగలక్షణాలు =జ్వరము,తలనొప్పి.ఒడలంతా నొప్పులు,గొంతునొప్పి ,దగ్గు సాధారణంగా ఉంటాయి.౬.మామూలుగా వారంరోజులలో తగ్గిపోతుంది.౭.ఐతే కొన్నికేసులలో న్యుమోనియా వంటి విషమ పరిణామాలు కలగవచ్చును.౮.వైరసులకు విరుగుడు మందు (స్పెసిఫ్జ్క్ )లేదు.వాక్సీనులు ప్రయోగం చేస్తున్నారు. 
 వైరసులలో రకాలు ==౧ఇన్ఫ్లుఎంజా -ఒకోసారి సర్వత్ర వ్యాపిస్తుంది (ఎపిదమిక్) జలుబు ,దగ్గు,గొంతునొప్పితలనొప్పిసాధారణం.౨దేన్గ్వే జ్వరం.కొన్నికేసులు సులువుగా తగ్గినా .కొన్నిటిలో రక్తస్రావం ,షాకు,ఊపిరితిత్తులలో కఫం వంటి అనేక విషమపరినామాలు కలిగి ప్రాణాంతకం కావచ్చును.ఇటువంటి కేసుల్లోతలనొప్పి ఉన్నా ఆస్ప్రిన్ వంటి మందులు ఇవ్వరాదు.ఆడిస్నే దోమ కాటు వలన సంక్రమిస్తుంది.రక్తంలో ఫలకికలు (#ప్లేట్లెట్స్తగ్గిపోవుట వలనవాటిని రక్తదానం ద్వారా ఎక్కించాలి.౮స్వైన్ఫ్లూ =ఇన్ఫ్లుఎన్జా  వంటిది.పందులవంటిజంతువులనుండి సంక్రమిస్తుందిna
  చికిత్స ==రోగలక్షణాల బట్టి ఉంటుంది.పరసేటమాల్ వంటివి సరిపోతాయి. కానిఅన్ని కేసుల్లోను కాదు.ఏదుర్లక్షనాలు కనిపించినా మంచి ఆస్పత్రికి తీసుకొనివేల్లాలి.డెంగ్వె జ్వరంలో ,జ్వరంతగ్గినా కీళ్ళనొప్పులు చాల  
రోజులు ఉండిపోవచ్చును. పరిశుభ్రత దోమల నిర్మూలన వంటి జాగ్రతలు ముఖ్యం. ==

17, ఆగస్టు 2011, బుధవారం

phalitam

            పూలు రాలినగాని-పుట్టవు ఫలములు
   ఫలము రాలినగాని-కలుగవు విత్తనాల్
   ఆకు రాలినగాని-ఆమని విరియదు
   వడగాడ్పు పిదపనే-వర్షాగమనమౌను
   పురిటినొప్పులతోనె-పుత్రోదయమ్మౌను
   చీకటి ముసుగును- చీల్చి ఉదయమ్మౌను
   చెమటోడ్చిననుగాని - సిరిసంపదలు రావు
   బాష్పధారలతోనె - బాధానివృత్తి యౌను
              ---------------------
             

15, ఆగస్టు 2011, సోమవారం

.K.L.Saigal

          ఒక బాధామయతప్త జీవన విషాదోద్విగ్నతాతీవ్రతల్
   వికలాత్మావ్యధితార్త విఫలప్రేమార్ద్ర గీతమ్ములన్
   ప్రకటింపన్ మధుమత్తకంఠ విరళప్రాశస్త్య భావమ్ముతో
   చకితుల్జేయును చిత్రగీతప్రియులన్ సైగల్ సుధాగానమున్  
              ------------------------ 

కమనీయం: Rajanikantarao

కమనీయం: Rajanikantarao

12, ఆగస్టు 2011, శుక్రవారం

Rajanikantarao


బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి శ్రీవేణుగోపాల్గారు ఏదొ కోడ్ లో రాయడంవల్ల చదవలేకపోయాను.నాకు తెలిసిన నాలుగు ముక్కలు రాస్తున్నాను.రజని అని పిలవబడే ఆయన మా చిన్నప్పటికే ప్రసిద్ధుడు .ఇప్పుడాయన  కి  90 పైనే ఉంటాయి.రేడియొ లో ఆఫీసర్గా  పనిచేస్తూ ,ఎన్నో లలితసంగీత గేయాలకి ,నాటకాలకి సంగీతం సమకూర్చేవారు.ప్రయోక్తగా ఉండేవారు. నాకు బాగా
 జ్ఞాపకమున్నవి.    .- రాజేస్వరరావు పాడిన "ఓహో విభావరీ" ,సూర్యకుమారి పాడిన "శతపత్రసుందరి" రజని గేయాలే.స్వర్గసీమ సినిమాలో దేశమంతా మారుమోగిన  భానుమతి పాడిన "ఓహోపావురమా" పాటకి స్వరకల్పన ఆయన చేసిందే.కవిగా గాయకుడిగా  సంగీతకర్తగా  మహోన్నత వ్యక్తి  రజని .ఈ తరం వారికి తెలియడానికి  ఈ కొన్ని మాటలు రాసాను.

7, ఆగస్టు 2011, ఆదివారం

V.I.P.Syndrome


V.I.P.Syndrome;(వీ.ఐ.పి.సిండ్రోం)-శ్రీమతి సోనియా గాంధి వ్యాధి గురించి కొంతవరకు మాత్రమే తెలుస్తున్నది.దీనిపై  కొన్ని అనుమానాలు సహజంగా కలుగుతున్నవి.ఈబ్లాగు గైనకాలజిస్టులను ,సంప్రదించినతర్వాతే రాస్తున్నాను.
 మేడం సోనియాకి గర్భాశయ ద్వార కేన్సర్ అంటున్నారు.8 నెలల నుండి చికిత్స చేసినాతగ్గకపోతే అమెరికాలో ప్రసిద్ధ హాస్పటల్లో సర్జరీ చేసారట .ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి  1.సెర్వైకల్కేన్సర్ లో 4దశలు ఉంటాయి.మొదటి ప్రారంభదశ లోనే కొన్ని పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చును.కనీసం 2వ దశలోనైనా తెలుసుకోవచ్చును.వెంటనే ఆవిడ వయస్సు బట్టి గర్భాశయాన్ని సర్జరీతో తీసివెయ్యాలి.అవ్సరమైతే అండాశయాలని,గ్రంధులను కూడా తీసివెయ్యాలి  .తర్వాత  కీమోథెరపీ  ,రేడియేషన్ చెయ్యవచ్చును.ఈ చికిత్సలు,సర్జరీలు చేసే సమర్థులైన డాక్టర్లు,అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పటల్సు ధిల్లీలోనేగాక ఇంకా చాలానగల్లో మన దేశంలోనే ఉన్నాయి.1.సోనియా జబ్బు తీవ్రమైనాక వైద్యసలహాకి  వెళ్ళారా?2.వ్యాధి కనిపెట్టడంలో ఆలస్యం జరిగిందా ?3.ఇండియాలోనే ముందే  అపరేషన్ ఎందుకు జరగలేదు?సో నియా గాంధి పూర్తి మెడికల్ రికార్డు చదివితేగాని చెప్పలేము.
   అతిముఖ్యులకు v.v.i.p.s) సరీఇన చికిత్స జరగడం కష్టం.సామాన్యులకే బాగ జరుగుతుంది.అమితాభ్ బచ్చన్ కీ ఇలానే జరిగింది.కారణాలు.1.వీ.ఐ.పీలకు సర్జరీలు చెయ్యడానికి డాక్టర్లు జంకుతారు.2డాక్టర్లసలహాలని వాళ్ళూంటాయి, సరిగా పాటించరు.3.సలహాదార్లు ఎక్కువై ఒకోసారి పరస్పర విరుద్ధ్మైనవిగా ఉంటాయి.4.వాళ్ళకి విశ్రాంతి ఉండదు.అందువల్ల అశ్రద్ధ కావచ్చ్ను.5.సామాన్యులకంటే వీరికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ గా వుంటుంది. దీనినే డాక్టర్లు అV.I.P.SYNDROMEఅని అంటుంటారు.
 ఏమైనా మేడం సోనియా అమెరికా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో తిరగి వస్తారని ఆశిద్దాము.

5, ఆగస్టు 2011, శుక్రవారం

jeevadhara


వంశధార,నాగావళి,వడివడిగా వస్తున్నవి
పరుగులిడుచు వస్తున్నవి.
 తరుగుల్మలతాదుల తడిమి తడిపి వస్తున్నవి
దరుల దరసి ఒరసుకొని పరవళ్ళు త్రొక్కుచును
 గిరుల కాంతారముల దాటి క్రింది క్రిందికి దుమికి
 రమ్యభూముల రాజనాల పంటచేలను ప్రోదిచేయుచు
 వడివడిగా వస్తున్నవి  వయ్యారంగా వస్తున్నవి

కళింగసీమకు కటిసూత్రములై -కనకరుచిదీప్తులెగయ
బౌద్ధవిద్యా నిలయములకు -భవ్య పుణ్యక్షేత్రములకు
పేరు గాంచిన సీమను  పెన్నిధిగా బ్రోచు తల్లులు
      నదీమతల్లులు
వంశధార ,నాగావళి, వడివడిగా వస్తున్నవి

1, ఆగస్టు 2011, సోమవారం

another poem-svecha


స్వేచ్చ==మధుమక్షికమును నేనైన --మనుజులకు దూరముగ
          నడవిలో నాపట్టు నమరించుకొందు
          పావురమ్మునునేనైన--బహుదూరమగుచోట
          గూడు చేసుకొనినే --గోప్యముగ నుండెదను ;
          నెమలినినేనైన-- నెవ్వారు చొరరాని
          ఏతోపులోనో ఏకోనలోనో --స్వేచ్చమై విహరింతు
                        నటనమాడుచును
          మదకరినినేనైన-- మావటీలకు లొంగి
          దాస్యమ్ము చేయక -- దవ్వులకేగి
          సరసులో తానాలు --సలుపుచునుందు ;
          ధనలోభి, క్రూరాత్ముడతి దురాశాపరుడు
          మానవునికి దూరముగ -మసలుటే మాకు
          స్వేచ్చా ప్రదమ్ము - సుఖ శాంతికారకము .