7, జనవరి 2013, సోమవారం

కమనీయం: NRI autobiography

కమనీయం: NRI autobiographyNRI autobiography

NRI autobiography




  పుస్తకం పేరు;'నేలా,నింగీ,నేనూ '
   భాష;తెలుగు; రచయిత;డా;ప్రయాగమురళీమోహన్ కృష్ణ.
  ప్రచురణ;ఎమెస్కో బుక్స్;హైదరాబాద్ -500 029
   ముద్రణ-2011;మూల్యం-రూ.150 .పుటలు=494.
  ఒక NRI ఆత్మకథ  అని రాసుకొన్న పుస్తకాన్ని  ఈమధ్యనే చదివాను.శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట దగ్గర గొటివాడ అనే అగ్రహారంలో జన్మించి ,వైజాగ్ లో మెడిసిన్ చదివి ,కొంతకాలం ప్రభుత్వ సర్వీసులో పనిచెసినతర్వాత,అనెస్థీషియా లో స్పెషలైజ్ చేసిన డాక్టరుగారు.
  ఆ తర్వాత అనూహ్యంగా విదేశాలకి వెళ్ళి,3 దశాబ్దాలు పైగా 6 దేశాలలో ( ట్రినిడాడ్ ,ఐర్లండ్,ఇంగ్లండ్,డెన్మార్క్, స్వీడన్,నార్వే)  లలో బాగా పనిచేసి పేరు తెచ్చుకున్నారు. వృద్ధాప్యంలో మనదేశానికి  తిరిగి వచ్చి ఇక్కదే ప్రశాంతజీవనం గడుపుతున్నారు.తన సబ్జెక్టు అనస్తీషియా మీద రెండు పుస్తకాలు రచించారు.
 500పేజీల గ్రంథంలో,మొదటి 280 పేజీలు తన బాల్యమ్నుంచి ఇండియాలో జీవితం,తర్వాత 140 పేజీలు  విదేశాల్లో   జీవిత విశేషాల గురించి చివరి 60 పేజీలలో మళ్ళీ మనదేశంలో జీవితం గురించి రాసారు.చిన్న చిన్న విషయాలు కూడా వదలిపెట్టలేదు.
  దీనిద్వారా పూర్వపురోజులు,ఇప్పుడు మనదేశంలో పరిస్థితులు, మార్పులు తెలుస్తాయి.అభివృద్ధి చెందిన విదేశాల గురించి ,అనేక వైద్య విషయాలు తెలుస్తాయి.ఎన్నాళ్ళు విదేశాల్లో ఉన్నా రచయితకి వున్న స్వదేశాభిమానం,సంప్రదాయాలమీదా ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.సులభంగా చదువుకుపోగల పుస్తకం.శైలి బాగుంది.
  నాకు ప్రత్యేక ఆసక్తి ;ఇందులో పి.జి.కె.(పంతుల గోపాలకృష్ణారావు) అనబడే  రచయిత మిత్రుడు నాకు స్వయానా మేనల్లుడు కావడం.అలాగే కుమారగుప్తా,కొందరు డాక్టర్లు,ప్రొఫెసర్లు పరిచయం ఉన్నవాళ్ళు కావటం ఆసక్తి కలిగిస్తుంది.
  ఇటీవలికాలంలో ఆత్మకథలు బాగా వస్తున్నవి.మంచిదే.ఎలాంటి వారి జీవితంలోనైనా ఎంతో కొంత తెలుసుకోవలసినదీ,ఆసక్తికరమైనదీ ఉంటుందని నా అభిప్రాయం.
    ' నేలా,నింగీ,నేనూ ' అందరూ చదవవలసిన గ్రంథం.మరొక్క విశేషం;చిన్నప్పుడు చదువురాని బడుద్ధాయి అనిపించుకొన్న  వ్యక్తే స్వయంకృషితో పెద్ద డాక్టర్ గా ఎదిగి పేరొందడం ప్రశంసనీయమే. 

6, జనవరి 2013, ఆదివారం

Hindu Gods




 ఈ మధ్య అక్బరుద్దీన్ ప్రేలాపనలలో హిందూ దేవతలను దూషించిన దానిపై పలువురు ఆగ్రహించారు.అతన్ని తీవ్రంగా శిక్షించాలీన్నారు.నిజమే.నేను కూడా ఏకీభవిస్తున్నాను.నేను కూడా ఖండిస్తున్నాను.కాని ఒక్క విషయం;  మన సినిమాల్లో,ముఖ్యంగా తెలుగు సినిమాల్లో యముడు,కృష్ణుడు ,మొ;దేవతల గురించి బఫూన్ల లాగ చిత్రించినా ఎవరూ మాట్లాడరేమి?సెన్సారుబోర్డు వారు కళ్ళు మూసుకొంటున్నారా?ఇది చాలా అభ్యంతరకరమైన విషయం కాదా?