16, అక్టోబర్ 2017, సోమవారం



 


  ఈ మధ్య తాజ్ మహల్ గురించి ఒక బి.జె.పి.నాయకుడు; దానిని విదేశీ దురాక్రమణదారు,దుర్మార్గుడు కట్టించాడు .మన సంస్కృతికి విరుద్ధమని ఇంకా ఏదో సెలవిచ్చాడు.సరే అతని వాదనని ఒప్పుకుందామనుకొండి.ఇప్పుడా తాజ్ మహల్ని ఏంచెయ్యాలి?దేశవిదేశాలనుంచి లక్షలాది పర్యాటకుల్ని ఆకర్షిస్తూ,కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సంపాదిస్తున్న ఈ అందమైన కట్టడాన్ని,కూల్చేయాలని అతని ఉద్దేశమా?మరి ఆగ్రాకోట,ధిల్లీ  లో ఎర్రకోట ,కుతుబ్ మినార్  ,వీటి సంగతేమిటి?ఎర్రకోట మీదనుంచి ప్రధాని జాతీయ జెండా ఎగరవేస్తారే?మన హైదరాబాదుకే iconic building ఐన చార్ మినార్ సంగతేమిటి?ఒక్క ముస్లిం ప్రభువులు కట్టించిన వాటికేనా యీ రూలు వర్తించేది లేక విదేశీ పాలకులు కట్టించిన వాటికన్నిటికీ వర్తిస్తుందా?బ్రిటిష్ పాలకులు కట్టించిన వందలాది కట్టడాల సంగతి అలాఉంచండి.మనరాజధాని కొత్త ధిల్లీ కట్టింది వాళ్ళే కదా.దేశాధినేత నివసించే భవనాల్లోకల్ల ప్రపంచంలోనే పెద్దది ,grandest ఐనది రాష్ట్రపతిభవన్ విదేశీ సామ్రాజ్యవాదులు   కట్టించారుకదా. రష్యాలో కమ్మ్యూనిస్టులు పరిపాలించినప్పుడు కూడా తాము ద్వేషించే జారు చక్రవర్తులు కట్టించిన క్రెం లిన్ ని ఉపయోగించుకొన్నారుకాని  పడగొట్టలేదు.మన కిష్టమున్నా లేకపోయినా ఇటువంటి కట్టడాలు మన వారసత్వంheritage గా ఉంటాయి.వాటిని పరిరక్షించుకోవడం నాగరకతా లక్షణం.పాడు చేయడం అనాగరకతా లక్షణం(barbrrism..) 

19, జనవరి 2016, మంగళవారం

#Medical checkup




 ఈ మధ్య బొంబయి పోలీస్ ఫోర్స్ లో నలభై శాతం ఫిట్ గా  లేరని తెలిసింది.మన రాష్ట్రంలో కూడా పోలీసులందరికీ,ఆఫీసర్లకూ మెడికల్ పరీక్ష నిర్వహిస్తే చాలామంది ఫిట్ గా లేరని తెలుస్తుంది.అలాగే ఇతర డిపార్ట్  మెంట్ల లో కూడా, మధుమేహం,రక్తపోట్ల తో ,అధిక బరువు,గుండె,ఉదర,శ్వాసకోశ జబ్బులతో  కొంతమంది బాధపడుతున్నట్లు  తెలుస్తుంది.అలా తెలుసుకోవడం వలన సకాలంలో ట్రీట్  మెంట్ తీసుకోడానికి వీలవుతుంది.40 సం; నుంచి ఇటువంటి జాగ్రతలు  తీసుకొంటే మంచిది.ఈ సంగతి అందరికీ తెలిసినా చాలామంది అశ్రద్ధ చేస్తారు.అలా చెయ్యవద్దని నా హితవు. 

12, జనవరి 2016, మంగళవారం

some misconceptions


 కండ్ల గురించి,వాటి కొన్ని జబ్బుల గురించి ,తప్పు అభిప్రాయలను తొలగించి,సదవగాహన కలిగించుటకై  ఇది వ్రాస్తున్నాను.
  1.పెద్దలకేగాని చిన్నపిల్లలకి కంటి అద్దాలు అవసరములేదనుకొనుట  తప్పు.కొంతమంది పిల్లలలో హ్రస్వ దృష్టి,చెదిరిన చూపు,myopia,astigmatism ఉండవచ్చును.వాటిని అద్దాలతో సవరించవచ్చును.
  2.కొంతకాలము వాడినతర్వాత అద్దాలు తీసిపారవేయవచ్చుననుకొనుట తప్పు.డాక్టర్ చెప్పినంతకాలము వాటిని వాడవలసిందే.ఏడాది కొకసారి  పరీక్ష చేయించుకొనుట మంచిది.
 3.కండ్లు ఎర్రబడి,నీరు కారుతుంటే ఇంటి వైద్యం ఏవో చుక్కలు వేసికొనుట మంఛిది  కాదు.కంటి డాక్టర్ కి చూపించి తగిన మందు చుక్కలు వాడాలి.
  4.మెల్లకన్నును 'సిరిమెల్ల ' అని అశ్రద్ధ చెయ్యరాదు.మొదటిలోనే స్పెషలిస్టు కి చూపించి వైద్యం చేయించవలెను.అద్దాలవలనగాని ,శస్త్రచికిత్స  వలన గాని  మెల్లను బాగు చెయ్యవచ్చును.

some misconceptions


 

 కండ్ల గురించి,వాటి కొన్ని జబ్బుల గురించి ,తప్పు అభిప్రాయలను తొలగించి,సదవగాహన కలిగించుటకై  ఇది వ్రాస్తున్నాను.
  1.పెద్దలకేగాని చిన్నపిల్లలకి కంటి అద్దాలు అవసరములేదనుకొనుట  తప్పు.కొంతమంది పిల్లలలో హ్రస్వ దృష్టి,చెదిరిన చూపు,myopia,astigmatism ఉండవచ్చును.వాటిని అద్దాలతో సవరించవచ్చును.
  2.కొంతకాలము వాడినతర్వాత అద్దాలు తీసిపారవేయవచ్చుననుకొనుట తప్పు.డాక్టర్ చెప్పినంతకాలము వాటిని వాడవలసిందే.ఏడాది కొకసారి  పరీక్ష చేయించుకొనుట మంచిది.
 3.కండ్లు ఎర్రబడి,నీరు కారుతుంటే ఇంటి వైద్యం ఏవో చుక్కలు వేసికొనుట మంఛిది  కాదు.కంటి డాక్టర్ కి చూపించి తగిన మందు చుక్కలు వాడాలి.
  4.మెల్లకన్నును 'సిరిమెల్ల ' అని అశ్రద్ధ చెయ్యరాదు.మొదటిలోనే స్పెషలిస్టు కి చూపించి వైద్యం చేయించవలెను.అద్దాలవలనగాని ,శస్త్రచికిత్స  వలన గాని  మెల్లను బాగు చెయ్యవచ్చును.

8, జనవరి 2016, శుక్రవారం

islamic terrorism




 నేను ముస్లిం వ్యతిరేకిని కాను.అనేక రంగాల్లో వాళ్ళు మన భారతదేశానికి వారి CONTRIBUTION అందిస్తున్నారు.అందరు ముస్లింలూ టెర్రరిస్టులు  కాదు. కాని వారిలో ఒకవర్గంవారు ఉగ్రవాదానికి పాల్పడుతూ ఉంటారు..నాకు కొందరు మంచి  ముస్లిం మిత్రులు ఉండేవారు కూడా.కాని ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి.ఎక్కడైన ఒకప్రాంతంలో  వారు మెజారిటీలో ఉంటే అక్కడ వారు ప్రత్యేక రాజ్యాన్ని  ,లేక మినీ పాకిస్థాన్ను స్థాపించుకోడానికి ప్రయత్నిస్తారు.ఇప్పటికే  ఉత్తర్ ప్రదేశ్,బీహార్,బెంగాల్,అస్సాం రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలలో మెజారిటీగా ఉన్నారు.దీనికి కాంగ్రెసే కాక మిగతా పార్టీలు కూడా బాధ్యులు.ఇప్పటికైనా మేల్కొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కింది చర్యలు తీసుకోవాలి.
              1.బాంగ్లాదేశ్ సరిహద్దుని పూర్తిగా కంచెతో మూసివెయ్యాలి.అవసరమైనచోట్ల మాత్రం కంట్రొల్డ్ గా వర్తకవ్యాపారాలు అనుమతించాలి.
               2.విదేశీయులను గుర్తించి  వారికి  పౌరసత్వ హక్కులు,వోటింగు హక్కులూ రద్దుచెయ్యాలి.
               3.హిందువులతోబాటు ముస్లిం,క్రైస్తవ మతస్తులకు కూడా 2రు పిల్లల కుటుంబ నియంత్రణ విధిగా పాటించాలి.                                      

29, డిసెంబర్ 2015, మంగళవారం

RAJAAJEE




 ఈ మధ్య కాంగ్రెస్ పత్రికలోనే నెహ్రూ,ఇందిరా గాంధీలకు వ్యతిరేకంగా రాసారట.కొన్ని విషయాలు నేను విశదపరచదల్చుకొన్నాను.మనదేశానికి స్వరాజ్యం వచ్చేనాటికి మేము కాలేజిలో చదువుకొనేవాళ్ళం. అప్పుడు ముఖ్యులూ గొప్పవాళ్ళైన నాయకులు  గాంధిజీ,నెహ్రూ,పటేల్,అజాద్,రాజేంద్రప్రసాద్.నేతాజీ (సుభాస్ చంద్ర బోస్ ) గొప్పనాయకుడు ఐనా మరణించినట్లు సమాచారం(విదేశాల్లో ఒక విమానప్రమాదంలో ) ప్రజాదరణ పాపులారిటీ ఎక్కువ ఉండటంచేత నెహ్రూజీ  ప్రధానమంత్రి ఐనాడు. కాశ్మీర్,చైనాల విషయంలో నెహ్రూ తప్పుడు,బలహీన విధానాలను నేను కూడా వ్యతిరేకిస్తున్నాను.కాని ఆయన నవభారతనిర్మాత అనిఒప్పుకోవాలి.ఎన్నో పారిశ్రామిక,విద్యుత్,నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాడు.రాజ్యాంగ ,సాంఘిక,సంస్కరణలని ఎన్నో ప్రవేశపెట్టాడు.ఐతే నెహ్రూ బదులు పటేల్ ప్రధాని ఐవుంటే బాగుండేదని కొందరు విశ్వసిస్తారు.ఇవన్నీ చరిత్రలోని ifs and buts కదా.
    కాని నేనిప్పుడు వ్రాయదలుచుకొన్నది రాజాజీ (రాజగోపాలాచారి)గురించి.ఆయనకూడా మేధావి,గొప్పనాయకుడే.కాని ఇతరనాయకులనుంచి విభేదించేవాడు. 1942 లోనే పాకిస్తాన్ ఇవ్వక తప్పదని  చెప్పాడు.కాంగ్రెస్ సోషలిస్టు పాలసీలను వ్యతిరేకించాడు.'పర్మిట్,లైసెన్స్,రాజ్ ' ని రద్దుచెయ్యమన్నాడు. చివరకు 1990 లో మళ్ళీ కాంగ్రెస్ ప్రధాని ఐన పీ.వీ.నరసిమ్హారావు గారు రాజాజీ పాలసీలను అమలు పరచారు.
        పైన పేర్కొన్న నాయకులందరూ (వారిలోవారికి విభేదాలు ఉన్నా) నిజాయితీకలవారు, ,నిస్స్వార్థపరులూ ,దేశభక్తులూ.
         నాకు తెలిసిన విషయాలు ఇక్కడ వ్రాశాను.
             

18, డిసెంబర్ 2015, శుక్రవారం

renDu paarTeela naaTakam

#GST BILL#modalaina  mukhyamaina

 

 GST BILLవంటి బిల్ల్స్ ని పార్లమెంట్ లో పాసవకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకొనంటున్నదనిB,J,P,ప్రభుత్వం ఆరోపిస్తున్నది .మా ప్రభుత్వకాలంలో ఇలాగే మీరు ఇదె బిల్లులిని అడ్డుకొన్నారని కాంగ్రెస్ జవాబిస్తున్నది ,ఈ మధ్య మామిత్రుడొకడు ,ఇద్దరికీ GST bill పాసవడం  ఇష్టం లేదని explain చేసాడు. ఉదాహరణకి మన ఇచ్చాపురం దగ్గర ఒడిస్సా ,ఆంధ్ర సరిహద్దులో టొల్ల్ గేట్ రోజుకి ఆదాయం30లక్షలు .అందులో రాజకీయనాయకులకు ,ప్రజాప్రతినిధులకు,పెద్ద అధికారులకు,చివరకు  గుమాస్తాలకు,అటెండర్లసహా అందరికీ వారి వారి వాటాలు ఉంటాయి .ఇలా దేశమంతా  ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయో వాటి మొత్తం ఆదాయం . ఎంతో ఆలోచించుకొండి.  ఇంత ఆదాయాన్నిఏ పార్టీవాళ్ళయినా వదులుకొంటారా అందుకే జీ,యస్.టీ బిల్లు ఎప్పటికీ పాసవదనిచెప్పాడు.