16, అక్టోబర్ 2017, సోమవారం 


  ఈ మధ్య తాజ్ మహల్ గురించి ఒక బి.జె.పి.నాయకుడు; దానిని విదేశీ దురాక్రమణదారు,దుర్మార్గుడు కట్టించాడు .మన సంస్కృతికి విరుద్ధమని ఇంకా ఏదో సెలవిచ్చాడు.సరే అతని వాదనని ఒప్పుకుందామనుకొండి.ఇప్పుడా తాజ్ మహల్ని ఏంచెయ్యాలి?దేశవిదేశాలనుంచి లక్షలాది పర్యాటకుల్ని ఆకర్షిస్తూ,కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సంపాదిస్తున్న ఈ అందమైన కట్టడాన్ని,కూల్చేయాలని అతని ఉద్దేశమా?మరి ఆగ్రాకోట,ధిల్లీ  లో ఎర్రకోట ,కుతుబ్ మినార్  ,వీటి సంగతేమిటి?ఎర్రకోట మీదనుంచి ప్రధాని జాతీయ జెండా ఎగరవేస్తారే?మన హైదరాబాదుకే iconic building ఐన చార్ మినార్ సంగతేమిటి?ఒక్క ముస్లిం ప్రభువులు కట్టించిన వాటికేనా యీ రూలు వర్తించేది లేక విదేశీ పాలకులు కట్టించిన వాటికన్నిటికీ వర్తిస్తుందా?బ్రిటిష్ పాలకులు కట్టించిన వందలాది కట్టడాల సంగతి అలాఉంచండి.మనరాజధాని కొత్త ధిల్లీ కట్టింది వాళ్ళే కదా.దేశాధినేత నివసించే భవనాల్లోకల్ల ప్రపంచంలోనే పెద్దది ,grandest ఐనది రాష్ట్రపతిభవన్ విదేశీ సామ్రాజ్యవాదులు   కట్టించారుకదా. రష్యాలో కమ్మ్యూనిస్టులు పరిపాలించినప్పుడు కూడా తాము ద్వేషించే జారు చక్రవర్తులు కట్టించిన క్రెం లిన్ ని ఉపయోగించుకొన్నారుకాని  పడగొట్టలేదు.మన కిష్టమున్నా లేకపోయినా ఇటువంటి కట్టడాలు మన వారసత్వంheritage గా ఉంటాయి.వాటిని పరిరక్షించుకోవడం నాగరకతా లక్షణం.పాడు చేయడం అనాగరకతా లక్షణం(barbrrism..)