21, నవంబర్ 2011, సోమవారం

ghantasala


   ఓ ఘంటసాలా , మధుర సంగీత లోలా , గంధర్వ లోక వాసీ  భూతలప్రవాసీ,
  జనరంజనము చేయ  చనుదెంచి  మరలావు, మా గుండెలో నిలిచి రాగమై మ్రోగావు,
  నీలాల గగనాన నిండిన వెన్నెలలో ,నీలిమేఘాలలో గాలికేరటాలలో
  కొండగాలి తిరిగితే  గుండె వూసులాడితే ,నీవు పాడిన పాట వినిపించు నేవేళ ,=ఓ ఘంటసాలా =
   మది శారదాదేవి మందిరమే నీకు  ,మధు మురళీగాన మాధుర్యమే నీవు,
  శివ శంకరీమంత్ర చింతనను చేసావు ,ఆలపించితివి గీతా సుధా బోధనలు నీవు ,=ఓ ఘంటసాలా =
   మోహనము పాడితే మోహనాస్త్రముగాదె ,కల్యాణి నీ నోట కళ్యాణ శుభకారి ,
   పాడుతా తీయగా అని పాడేవు అద్భుతముగా ,మరువ లేని మనీషీ ,మరలి రాని మహతీ .=ఓ ఘంటసాలా =

      డిసెంబర్ నాలుగో తేదీ ఘంటసాల జయంతి లో పాడుటకు నేను రచించిన పాట.
 
 .

5 వ్యాఖ్యలు:

Suryanarayana Vulimiri చెప్పారు...

శ్రీ రమణారావు గారు, నమస్కారం. చాల బాగుందండి మీరు వ్రాసిన పాట. "భూలోక ప్రవాసీ:, "మరలి రాని మహతీ" అన్న పదాలు చక్కగా ప్రయోగించారు. "గాలి కె(కే)రటాలలో" పదంలో చిన్న అచ్చు తప్పు దొర్లింది. మీరు గాయకులన్నమాట. చాల సంతోషం మాస్టారు.

పంతుల జోగారావు చెప్పారు...

ఘంటసాల గురించిన మీ గీతం చాలా బాగుంది. స్వర పరచిన మీ పాట వినాలని కూడా ఉంది.

Sanghamithra చెప్పారు...

చాల బాగుంది. దీనికి ఎవరైనా బాణీ కట్టి వినిపిస్తే బావుణ్ణు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
ఘంటసాల పాటలతో అల్లిన మీ పాట చాలా బాగుంది. నిజంగా ఆ పాటలు మరపు రానివి ,మరువ లేనివి .తమరు పాడినవి రికార్డు చేసి మాకు వినిపించ గలిగితే ముదావహం.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
ఘంటసాల పాటలతో అల్లిన మీ పాట చాలా బాగుంది. నిజంగా ఆ పాటలు మరపు రానివి ,మరువ లేనివి .తమరు పాడినవి రికార్డు చేసి మాకు వినిపించ గలిగితే ముదావహం.