29, ఏప్రిల్ 2011, శుక్రవారం

satyasaibaba=contd.

ఆరోజుల్లోనే సత్యనారాయణరాజుకి జ్ఞానోదయం కలిగింది.తాను షిర్దీ సాయిబాబా అవతారంగా ప్రకటించేడు.స్కూలు మానివేసాడు. ప్రతి గురువారం పాండురంగస్వామి గుడిలో భజనలుచేసి "చక్కెరపొట్లాలు "స్రుష్టించి భక్తులకు ఇచ్చే వాడు.ఒకరోజు హనుమంతరెడ్డి అనే విద్యార్ధి నాయకుడూఅ పొట్లాన్ని బాబా మీదికే విసిరికొట్టాడు.ఐనా కోపగించుకోక ,బాబా అతనిని ఏమీ అనవద్దని అందరినీ శాంతపరచారట.ఈవిషయం విన్నాను, కాని చూడలేదు. తరువాత హనుమంతరెడ్డి బాబా భక్తుడయాడు. మరి కొన్నాళ్ళకే సాయిబాబా కుటుంబం అందరూ ఉరవకొండ విడిచి పుట్టపర్తికి వెళ్ళిపోయారు.ఆతర్వాత ఆయనపేరు,ప్రఖ్యాతులు ,కథలు,మహిమలు అన్నీవిండం,చదవడమే కాని వెల్లి చూడలేదు.=== రమణారావు.ముద్దు