30, ఏప్రిల్ 2011, శనివారం

గల్పిక - 2

2.గల్పిక;అర్ట్ బుచ్వాల్డ్ రచన 'మేడ్ ఇన్ యూ.యస్ .యే ఆధారంగా.========మేడ్ ఇన్ ఇండియా==
గాంధీగారి విదేశీవస్తు బహిష్కరణ,స్వదేశీవస్తు ఉద్యమం గురించి చదివి వంటపట్టించుకొని స్వదెశీ వస్తువుల్నే కొనాలనినిశ్చయించుకొన్నాను.ఈ మధ్య మా మున్సిపాలిటీ వారు కొన్ని పనులు చేయించడానికి పూనుకొని పెద్దయంత్రాలను కొనాలనుకొన్నారు.మార్కెట్లో అందుకు సరిపోయే యంత్రాలు తయారుచేసే కంపెనీలు రెండే వున్నాయి. ఒకటి కొమటూసు అనే జపాన్ కంపెనీ ,రెండుభూలోక్ అనేఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీదే కొనాలని కొందరు దుమారం లేవదీశారు. సరేననిభూలోక్వారికే ఆర్డర్ ఇచ్చారు. కొన్న తరవాతతెలిసిందండీ.కొమటూసు మెషీను చెన్నై దగ్గరమనకంపెనీలొనే తయారవుతుందని.భూలోక్ మెషీను జపాన్లో క్యోటో దగ్గర తయారవుతుందని.!
ఒకసారి మా వాళ్ళతో చీరలు కొనటానికి వెళ్ళాము.బెనారస్,కంచి,గద్వాల్ చీరలు కొన్ని సెలెక్టు చేసుకొన్నారు.మాటల్లో తెలిసింది సిల్కుదారం చైనానుంచి ,జరీ తైవాన్ నుంచి వస్తాయని.చీరలనేతమాత్రం మనదేశంలోనేనని.
మరొకసారి మ్యూజిక్సిస్టం కొందామని బజారంతా తిరిగాను.అన్నెవిదెశీబ్రాండ్లే వున్నాయి.చివరకు ఒక సందులో గోల్మాల్చంద్ షాపులోస్వర అనేపేరుతో ముంబైలో తయారైన సిస్టం దొరికింది.ఐనా అంత సులువుగా వదలను కదా.గట్టిగా అయిష్టంగానే ప్రశ్నించేసరికి అయిష్టంగానే చెప్పాడు.కంపెనీ ఇండియందే ఐనా విడిభాగాలు జపాన్,కొరియాలనుంచి వస్తాయని ,వాటిని అసెంబుల్చేసి ,జలగంలొ పై డబ్బా తయారుచేసి కంపెనీముద్రతో అమ్ముతారని చెప్పాడు. షాపుఓనరు .కాని, నాసమస్య ఏమంటే పూర్తిగాభారత్లోనే తయారయే వస్తువుల్నే కొనాలని.ఆమాట చెప్తేఅతను అలాగయితే ఖాదీభండారుకి వెళ్ళండి,లేకపోతే లేపాక్షి ఎంపోరియంకి వెళ్ళండి,అనిసలహా ఇచ్చాడు. అక్కడయినా బొమ్మలువగైరాలకి రంగులూఅవీ విదేశాలనుంచి వస్తాయేమో కదా అన్నాను.'అదెలాచెప్పగలమండీ ,వాళ్ళనే అడగండీని నా చాదస్తానికి చిన్నగానవ్వుతూ అన్నాడు.
సరేనని లేపాక్షికి వెళ్ళి చూసాను. అక్కడి వస్తువులు ఏవీ నాకు అందుబాటు ధరల్లో లేవని తెలుసుకొని ఇంటి దారి పట్టేను.

కామెంట్‌లు లేవు: