2, మే 2011, సోమవారం

సాయి బాబా - 3

సత్యసాయిబాబా == నిరుడు ౨౦౧౦లొ బెంగుళూరులో ఉన్నప్పుడు ఎందుకో పుట్టపర్తికి వెళ్ళాలనిపించింది.మా అబ్బాయి వాళ్లతో కలిసి ,ముందు లేపాక్షి చూసి దగ్గరలోవున్న పుట్టపర్తి వెళ్ళాము. ప్రశాంతినిలయం ,అక్కడి వాతావరణం నచ్చాయి.హాస్పటల్ ,యూనివర్సిటీ బాగున్నవి.సాయంత్రం బాబా దర్సనం అయింది.అప్పటికే ఆయనకు పక్షవాతం వచ్చుటచేత వీల్చైర్లో చుట్టూ తిప్పి తీసుకోనివేల్లారు.ఆయన ఏమీ మాట్లాడలేదు. నా అభిప్రాయమేమంటే సత్యసాయిబాబా మహిమలు ,భగవంతుని అవతారమని నమ్మినా ,నమ్మకపోయినా ,ఆయన చేసిన,చేయించిన ప్రజోపయోగమైన అనేక ఘనకార్యాలను మనం ప్రసంసించాలి.ఆయనది సామాన్యకుటుంబంఆయన స్వంతడబ్బుతో కాకపోయినా కోట్లకొద్దీ ధనంఆయన ప్రభావంవలననే భక్తులు ఇచ్చారుఅందరికీ ఇస్తారా ?ఆయన నిర్యాణం తరవాత కూడా ప్రాజెక్టులన్నీ కొనసాగిస్తామని ట్రస్టు .వారుచెప్పారుకదా.వారు చెయ్యకపోతేనేప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వేచిచూద్దాముఅంతేకాని కొందరు.చేస్తున్నట్లు నిందించడం తప్పు.నేను చూసినంతవరకూ సాయిసంఘాలు ప్రజాసేవ చేస్తున్నారు.నేను నిర్వహించిన నేత్రవైద్య శిబిరాల్లో సత్యసాయి సేవకులు స్వచ్చందంగా వచ్చి రోగులకు సేవచేసేవారు.==రమణారావు.ముద్దు .