31, మే 2011, మంగళవారం

టెలి ఫోన్ ... గల్పిక - 5


గల్పిక-5
---------  టెలిఫోన్
           ---------  అలెక్జాండర్ గ్రహాం బెల్ టెలిఫొన్ కనిపెట్టింది దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు సులభంగా మాట్లాడుకొడానికి .కాని ఆ టెలిఫొన్ యంత్రాంగం శాఖోప శాఖలుగావిస్తరించి  ఈనాడు పరిస్థితి ఎలా ఉందో ఊహించుకొండి. గ్రహాంబెల్ టెలిఫొన్ కనిపెట్టినప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు జరిగాయని ఊహించుకొండి. బెల్ పక్క గది లోకి వెళ్ళి అక్కడ పొరబాటున ఒంటిమీద యాసిడ్ వొలకగా ఆనొప్పితో ఇలా ఫొన్లో అంటాడు  "వాట్సన్,ఇలా రా ఒకసారి నీతో మాట్లాడాలి." వాట్సన్ నుంచి జవాబు బదులు ఒక మెషీన్ బదులు చెప్తుంది."మీకు కావలసిన డాక్టర్ పేరు తెలిస్తే నం.1 నొక్కండి.తెలియకపోతే నం.2 నొక్కుతే రిజిస్టర్ చేస్తారు.అండమాన్ దీవుల యాత్రకు వెళ్ళాలంటే నం.3 నొక్కండి.అత్యవసరమైన పరిస్థితి ఐతే మీ సోషల్ సెక్యూరిటీ నంబరు,మెడికల్ ఇన్స్యూరెన్స్ నంబరు కొట్టి ,తర్వాత నం.4 నొక్కండి.డాక్టర్ వాట్సన్ గారి తోనే మాట్లాడాలనుకొంటే మ్యూజిక్ సింఫనీ పూర్తయే దాకా ఆగి నం.5 నొక్కండి "
  ఆన్సరింగ్ మెషీన్ చెప్పినట్లు గ్రహాంబెల్ 5 నొక్కుతాడు.కాని జవాబురాదు.కనెక్షన్  తెగిపోతుంది. చివరకు  వాట్సన్ ఆ గదిలోకి ఏదో పని మీద వస్తాడు.గ్రహాంబెల్గారు అతనితో అంటాడు." ఇందాక యాసిడ్ పడినప్పుడు నిన్నుపిలుద్దామని ఫొన్ చేసినప్పుడు నంబర్  1 నొక్కడం  మరిచిపోయాను "
        ( ఆర్ట్ బుఖ్వాల్డ్ "బెల్ ఆన్ ది టెలిఫొన్ " ని అనుసరించి ) రమణారావు.ముద్దు   

2 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

మీ టెలి ఫోన్... గల్పిక చాలా బాగుంది. మీ టపాతో పాటు గ్రాహంబెల్ చిత్రంతో పాటు, అతను తయారు చేసి, వాడిన ఫోను బొమ్మ కూడా ఉంచడం సంతోషం కలిగించింది. అభినందనలు. ఇలాగే మంచి మంచి టపాలు పెడుతూ ఉండండి.

కమనీయం చెప్పారు...

thanks for your appreciation.
Iam posting one.more galpika.
ramanarao.muddu