17, ఆగస్టు 2011, బుధవారం

phalitam

            పూలు రాలినగాని-పుట్టవు ఫలములు
   ఫలము రాలినగాని-కలుగవు విత్తనాల్
   ఆకు రాలినగాని-ఆమని విరియదు
   వడగాడ్పు పిదపనే-వర్షాగమనమౌను
   పురిటినొప్పులతోనె-పుత్రోదయమ్మౌను
   చీకటి ముసుగును- చీల్చి ఉదయమ్మౌను
   చెమటోడ్చిననుగాని - సిరిసంపదలు రావు
   బాష్పధారలతోనె - బాధానివృత్తి యౌను
              ---------------------
             

1 వ్యాఖ్య:

Saikiran Pamanji చెప్పారు...

కష్టపడిన వారికే సుఖాలు దొరుకుతాయని, సుఖాలు పొందే అర్హత కలుగుతుందని చాలా చక్కగా చెప్పారు.( నాకు అర్థం అయినంతవరకు). చాలా చక్కటి పదాల పొందిక.