16, జులై 2011, శనివారం

jogarao kathalu -contd.

12.పట్టు పరికిణీ ;=ఇతరులకు బట్టలు కుట్టి జీవిస్తూ తన కూతురు పట్టుపరికిణీ కావాలనే కొరిక తీర్చలేని పేదరాలి కథ.మనసుని కలచివేస్తుంది.
13.ఇంటింటిబూరి ;=అసహాయురాలైన స్త్రీకి సహాయం చెయ్యగలిగినా సకాలంలో అందించకస్వార్ధపరుడై ,ఆమె పాప జబ్బుతో చనిపోడానికి కారకుడైన ఒక గుమస్తా కథ.హృదయ విదారకమైన కథ. మధ్యతరగతి స్వార్థ పరత్వాన్ని ,అవినీతిని ఎండగట్టుతుంది.
     జొగారావు గారి కథల్లో "గుండెతడి" ఉంటుంది.మధ్యతరగతి మనస్తత్వాన్ని వారి కష్టాలని ,సుగుణాలని, అవగుణాలని కూడా ప్రతిఫలిస్తాయి.ఎక్కువ కథలు విషాదాంతాలే. కొన్ని మాత్రం సరదాగా, చిన్న కొసమెరుపులతో అలరిస్తాయి.ప్రసిద్ధ కథారచయిత పంతుల జోగారావు రచించిన ఈ గుండెతడి కథాసంపుటి పాఠకుల అభిమానాన్ని చూరగొంటుందని విశ్వసిస్తున్నాను.

1 కామెంట్‌:

కథా మంజరి చెప్పారు...

నా కథలను చక్కగా విశ్లేషిస్తూ టపారాసినందుకు మీకు నా ధన్యవాదాలండీ, రమణారావుగారూ.
ప్రముఖ (నేత్ర) వైద్యు లయిన మీ చల్లని చూపు నా కథల మీద పడడం నా అదృష్టంగా భావిస్తున్నాను.