29, జులై 2011, శుక్రవారం

javali, padam

జావళి,పదం:
పూర్వం సినిమాల్లో జావళీలు, పదాలు ఉండేవి.
1.జావళి నృత్యానికి అనువైనదని,సాహిత్యం (చరణాలు)తక్కువగా ఉంటుందని,పరకీయనాయికసంబంధి2.పదంలొ సాహిత్యం(చరణాలు)ఎక్కువగా ఉంటుంది,స్వకీయనాయికసంబంధి  అని ప్రసిద్ధసంగీతవేత్త సంగీతరావుగారు నాకు చెప్పారు.
వీటిలో  శృంగారం ,మధురభక్తి,సమ్మిళితమైవుంటాయి.రసజ్ఞులు,అభిజ్ఞులు వీటి అందాన్ని,మాధుర్యాన్ని ఆస్వాదించగలరు.పాత సినిమాలలో సంగీతదర్శకులు వీటిని కంపోజ్ చేసేవారు.ఇందులో కొన్ని సంప్రదాయంగా వస్తున్నవి,మరికొన్ని సినిమాకోసం రచించినవి.
నాకు గుర్తున్నవి,ఇష్టమైనవి కొన్ని ఉదహరిస్తాను.ఈరకంపాటలని భానుమతిగారు ఎక్కువగా పాడినట్లున్నది.ఎందుకంటే ఆమె వేశ్య,దేవదాసి పాత్రలు
వేసి మెప్పించారు.ఐనా ఆమె హీరొయిన్ ఇమేజ్ చెక్కుచెదరలేదు.భానుమతి జావళీలు.
   1."మంచిదినము నేడే" స్వర్గసీమ చిత్రం
   2. "మల్లీశ్వరి"లో  "పిలచిన బిగువటరా"
   3."రారా నా సామి రారా" విప్రనారాయణ చిత్రం
   4."మేలాయె నీవేళ" చింతామణి లోది.
   పై పాత లన్నిటినీ పాడటమేగాక భానుమతి నృత్యం కూడా చేయడం విశేషం.
   5.భక్త పోతనలో "ఇది మంచి సమయము రారా",మరొక చిత్రంలో
  6. (పేరు గుర్తు లేదు) చెలియా మనకేలనే"-అనే బెజవాడ రాజరత్నం ప్లే బాక్ ,పాటలు.
  7. జయసిమ్హ చిత్రంలో "నడిరేయి గడిచెనే చెలియా"అని వహీదా నృత్యానికి సుశీల పాదిన పాటలు కూడా చాలా బాగా ఉంటాయి.
    తుకారాంలో కాంచన నృత్యానికి,ముత్యాలముగ్గులో హలం నృత్యానికి ప్లేబాక్ పాటలు కూడా ఈ కోవకే చెందుతాయికాని అవి కొంచెం మోడరంగా ఉంటాయి.
'క్షేత్రయ్య' సినిమాలో ఆయన పదాలని రామకృష్ణ పాడితే నాగేశ్వరరావు చక్కగా అభినయించేరు.

కామెంట్‌లు లేవు: