www.srikurmamtemple.com www.srikurmamtemple.blogspot.com
శ్రీ కూర్మం దేవాలయం చాలాప్రాచీన మైనది.విష్ణు,పద్మ,పురాణాల్లో దీని ప్రస్తావన ఉన్నది, చారిత్రకంగా ఇప్పటి ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడినది.కళింగరాజులు ,అనంతవర్మ చోడ గంగ దేవ ,( కీ.శ1134)అనంగ భీమ( కీ.శ1211)రాజుల శాసనాలు ఉన్నవి.ఈ దేవాలయాన్ని ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు ,చైతన్య ప్రభు,దర్శించారని అంటారు.ఈ ఆలయం కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నది.

1.విష్ణుమూర్తి కూర్మావతారానికి దేశంలో ఇదొక్కటే ఆలయం.
2. ఒక్క ఆలయానికే .రెండు ధ్వజ స్తంభాలు ఇక్కడే .ఉన్నాయి.
3 దుర్గాదేవిఇక్కడ వైష్ణవి రూపంలో ఉన్నది
.4. .కుడ్య చిత్రాలు ఉన్నకొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి
.5. శివాలయాన్ని వైష్ణవ ఆలయంగా మార్చేరని ఒక వాదన ఉన్నది. శివాలయంలో వలెనె దేవుడికి ప్రతి రోజు అభిషేకం జరుగుతుంది
.6..తాబేలు ఆకారంలో మూలవిరాట్టు ఒక పక్కగా ఉంటుంది. నిర్మాణము,శిల్పము. : ఆలయం కళింగ,దాక్షిణాత్య పద్ధతుల మేళవింపుతో నిర్మించబడినది.ప్రదక్షిణ పథంలో నూటఎనిమిది స్తంభాలు అలంకరణ ,శిల్పంలో ఒకదానితో మరొకటి పోలిక లేకుండాచక్కగా నిర్మించారు.స్తంభాలపైన, గోపురంపైన వివిధదేవతలు ,పురాణ కథలు, లతలు, పుష్పాలు మనోహరంగా చెక్కబడిఉన్నవి. గర్భ గుడి ముందు భోగ మంటపం, ఆస్థాన మంటపం, ఉన్నవి.గర్భగుడి మీద గోపురం ఐదు అంతస్తులుగా ఉన్నది.గుడి ముందు ఒకటి ,వెనుక మరొకటి ధ్వజస్తంభాలు ఉన్నవి.రెండవది పాడయిపొతే సినిమా నటుడు శ్రీహరి మళ్ళీ ప్రతిష్ఠించారుట.
శ్రీ కూర్మం ఫొటోలు కొన్ని చూడండి:

ఈ ఆలయం లో గోడల మీద అనేక గాథలు చిత్రింపబడి ఉన్నాయి.కాని కాలక్రమంలో అవి మాసిపోయిఉన్నవి .కృష్ణం వందే జగద్గురుం సంస్థ వారు విష్ణు గాథలను చక్కటి ఆయిల్ పెయింటింగ్స్ వేయించి గోడల కు తగిలించారు.ఇంకా అనేక విధాలుగా ఈ సంస్థవారు,దేవ దాయ శాఖ వారు,ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
2 కామెంట్‌లు:
గత ఏడాది మేము శ్రీకూర్మం వెళ్ళి దైవదర్శనం చేసుకున్నాము.చాలా పురాతనమైన కోవెల.కోవెల ఆవరణలోనే పదుల సంఖ్యలో తాబేళ్ళు తిరుగుతూ కనిపించాయి.పురాతనమైన ఆలయం గురించి చాల బాగ వివరించారు.శ్రీకాకుళం జిల్లాలోని మరిన్ని విశేషాల గురించి తెలియజేస్తారని ఆశిస్తూ...
ఓం నమఃశ్శివాయ
కామెంట్‌ను పోస్ట్ చేయండి