29, జూన్ 2011, బుధవారం

డా.భోగరాజు పట్టాబి సీతారామయ్య

డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆయన పూర్తీ పేరు.అందరూ పట్టాభి అనే వారు.టంగుటూరి ప్రకాశం వలె మాస్లీడర్ కాకపోయినా  ఆనాటి కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యుడు .ఇంటర్నెట్ లో ఆయన గురించి సమాచారం సరిగా Iలేదు.నాకుతెలిసిన సంగతులు క్లుప్తంగా వివరిస్తాను.

 1..ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ  జల ఉష  అనే నౌకను లాంచ్ చెయ్యడానికి విశాఖపట్నం వచ్చి నప్పుడు ఆంద్ర యూనివర్సిటీ లో సభ జరిగింది.అప్పుడు.నేను ఆయనను చూసాను.ఎర్రగా ,కొంచెం పొట్టిగా ఉండేవారు

.2  .ఆయన మెడికల్ డాక్టరు అయినా రాజకీయాల్లో మునిగి తేలే వారు

3.అఖిల భారత కాంగ్రెస్స్ వర్కింగ్ కమిటీలో సభ్యుడు

.4.ఒక సారి అ. భా.కాంగ్రెస్ అధ్యక్షుడు అయినారు

5.తెలుగు లోను ,ఇంగ్లీషు లోను గొప్ప వక్త .

6.1939కాంగ్రెస్ అధ్యక్షపదవికి నేతాజీ సుభాస్ చంద్ర బోసు తో పోటీ చేసి ఓడిపోయారు .గాంధీజీ పట్టాభి ఓటమి నా ఓటమి అన్నారు.తీవ్ర వాదిఅయిన బోసు కాంగ్రెస్ నుంచి వేరే విడిపోయి వేరేఫార్  వర్డ్ బ్లాక్  అనేపార్టీ స్థాపించారు.

7..అన్నిటి కన్నా  ముఖ్యం ,పట్టాభి గారు దేశీయ సంస్థలను ఎన్నిటినో స్థాపించారు. అందులో కొన్ని ముఖ్యమైనవి :ఆంధ్రాబ్యాంకు ,ఆంధ్రా ఉ.సైంటిఫిక్ కంపెనీ .ఆంధ్ర ఇంస్యూరెన్స్  కంపెనీ .కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీ మొదలైనవి.

8..స్వరాజ్య ఉద్యమాలు లో పాలుగొన్నారు

9.స్వతంత్రం వచ్చాక రాష్ట్ర గవర్నర్గా పని చేసారు.
                                                         
                                                                   
                                                                              డా.భోగారాజు

                                                                            జల ఉష             ఇంకా వివరాలు తెలిసిన వారు రాస్తే సంతోషిస్తాను. 

1 వ్యాఖ్య:

Vinay Datta చెప్పారు...

మా తాతగారు ( మా ఆయనకి తాతగారు ) గుడిమెళ్ళ వెంకటేశ్వర్లు గారు ఈ విషయాలు నాకు చెప్పారు :

పట్టాభి సీతారామయ్య గారివి పడక కుర్చీ రాజకీయాలు. నేరుగా ప్రజలలో కలిసేవారు కాదు. సాధారణంగా పెద్దల సమావేశాలు ముగిశాక ' గాంధీజీ ఫలానా విషయాలు చెప్పారు. నెహ్రూ గారు ఈ విషయాలను ప్రతిపాదించారు. ' అంటూ లోపల జరిగిన విషయాలను బయట ఉన్న వారికి చెప్పేవారట.

తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఏర్పాటైన కమిటీ ( జె వి పి ) ముందు పట్టాభి హాజరైనప్పుడు ' మీకు వేరే రాష్ట్రంతో పనేమిటి? ఏమిటి మీ ప్రత్యేకత? ' అని అడిగారట. వెంటనే ఆయన జేబులోనుంచి ఒక నాణేన్ని తీసి వాళ్ళ ముందు గిరాటు వేసి ' ఇది ఏంటి? ' అని అడిగారట. 'ఒక అణా' అని సమాధానమిచ్చిన పెద్దలతో ' వన్ అణా ' అని ఇంగ్లీషులో రాసి దాని కింద ' ఒక అణా ' అని తెలుగులో మాత్రమే రాసారు. తమిళంలో, కన్నడంలో, మరే భాషలోనూ రాయలేదు ఇంగ్లీషు వాడు. ఇదీ మా ప్రత్యేకత ' అని సమాధానం చెపారట.

గుంటూరులో ఆయన కృషితో ఏర్పడిన కాలనీకి ఒక పేరున్నా 'పట్టాభి పురం' అంటారు. దానిపక్కన ఏర్పడిన మరొక కాలనీ ' చిన్న పట్టాభిపురం ' అయ్యి మొదటిదాన్ని ' పెద్ద పట్టాభిపురం ' గా మార్చేసింది.

madhuri.