10, జూన్ 2011, శుక్రవారం

స్వర్గీయ నటరాజ రామ కృష్ణ గారికి నివాళి

శ్రీ నటరాజ రామకృష్ణ గారి గురించి రాయడానికి నాకు నృత్యం గురించి ఎక్కువగా తెలియదు. కాని ఒకటి ,రెండు 
సంగతులు మాత్రం రాస్తాను .నేను మెడికల్ కాలేజిలో చదివేటప్పుడు ,మా క్లాస్మేట్ చలపతిరావు ఆయన దగ్గర 
నృత్యం నేర్చుకొని ,కాలేజి ఫంక్షన్ లో ఆడవేషంతో "మొక్కజొన్నతోటలో"పాట అభినయించేవాడు.(1954 -55).
అప్పటికి మాస్టారికి ఇంకా అంతప్రసిద్ధి లేదు. వైజాగ్ లో ఉండేవారు.తరవాత 1980 ప్రాంతంలో మా అమ్మాయి అరంగేట్రం కి  ఆయన రాలేకపోయినా, ఆశీర్వాదం పంపించేరు.మా మేనకోడలు ఆయన దగ్గర నృత్యం అభ్యసించింది.
ప్రఖ్యాత నర్తకులు ,పత్రికలూ, టి.వి.చానల్సు, ఆయనగురించి చెప్పినవి అంతాచూసి, చదివి ఉంటారు. కూచిపూడి
దేవదాసి,పేరిణి నృత్యాలకి ఆయన చేసినసేవ ,ఆంధ్ర నాట్యానికి ఆయన తెచ్చిన గుర్తింపు చిరస్మరణీయం. తెలుగు నటరాజుకు నివాళులు అర్పిస్తున్నాను.    

 రమణారావు.ముద్దు