14, ఏప్రిల్ 2012, శనివారం

communist China
 వేగంగా అగ్రరాజ్యంగా వృద్ధి చెందుతున్న చైనాతో మనదేశం ఎలా వ్యవహరించాలి అన్నది ముఖ్యాంశం.టిబెట్ ని ఆక్రమించేవరకు మనకు చైనాతో  సరిహద్దు లేదు .తరవాత చైనాతో సరిహద్దు సమస్య తలెత్తింది.1962 లో చైనా మనపై దండెత్తి ఆక్ -సయ్ -చిన్ కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది.పైగా అరుణాచల్ తమదే అంటున్నది.
  రెండవది; మనకు వ్యతిరేకంగా ఉండే పాకిస్తాన్ తో స్నేహం చేసి సహాయం ,చేస్తూ ఉంటుంది. మూడు; ముందు ముందు ప్రపంచంలో వనరులకోసం ,వ్యాపారం ,ఖనిజాల కోసం చైనా, ఇండియా ల మధ్య పోటీ ఉంటుంది అనుకొంటున్నారు.నాల్గు; టిబెట్ పీఠభూమి లో పుట్టే పెద్దనదుల జలాలను ఉత్తరానికి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నది.ఇది జరిగితే మన దేశమే కాక బర్మా,థయిలాండ్, వీత్నాం ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నదీజలాల కొరతను ఎదుర్కోవలసి వస్తుంది.(సింధు, సట్లెజ్ ,బ్రహ్మపుత్ర,సాల్వీన్ మీకాంగ్ నదులు టిబెట్లో జన్మిస్తాయి. )2050 నాటికి చైనా,అమెరికాల తర్వాత మూడవ అగ్రరాజ్యంగా భారత్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, భారత్ల మధ్య వాణిజ్యం పెరుగుతున్నది.ఈ నేపథ్యంలో ఇండియా చైనా పట్ల ఏ విధానాలు అవలంబించాలన్నది పెద్ద ప్రశ్న.మన నాయకులు,నిపుణులు ,మిలిట్రీ ,సివిల్ అధికారులు జాగ్రతగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి.ఈ రెండు పెద్ద రాజ్యాల మధ్య ఘర్షణ రెండింటికి మంచిదికాదు.
  ఏమైనా చైనా పాకిస్తాన్ల మధ్య మైత్రి ,అణు ఆయుధాల ఉత్పత్తి సహకారం దృష్ట్యా మనం కూడా మన బలాన్ని బాగా పెంచుకో వలసి వుంటుంది.కాని సాధ్యమైనంత వరకు చైనాతో సత్సంబంధాలకై ప్రయత్నం చెయ్యాలి.(eternal vigilance is the price of Liberty )అన్నారు కదా!
   ఈ బ్లాగు పరంపరపై పాఠకుల విజ్ఞతకే ,వారి conclusions కి వదిలివేస్తున్నాను.
                    (సమాప్తం )