10, ఏప్రిల్ 2012, మంగళవారం

china-contd-10
 ఐనా అతివిశాలము,అధికజనాభా గల వ్యావసాయిక దేశమైన చైనాలొ గ్రామీణప్రాంతాలు,మారుమూల ప్రాంతాల్లో నిరక్షరాస్యత,పేదరికం ,వెనుకబాటుతనం ఇంకా ఎక్కువగానే ఉండినవి.పట్టణప్రజలు,ముఖ్యంగా యువత లో చైతన్యం ఎక్కువయింది.
   ఇక రాజకీయ పరిణామాల విషయం;; వివరాలలోకి పోకుండా క్లుప్తంగా ఇలాగ సమీక్షించవచ్చును.1.రిపబ్లిక్ స్థాపన తర్వాత ఎన్నికలు జరిగాయి.(కాని అప్పట్లో స్త్రీలకు వోటు హక్కు ఇవ్వలేదు.)  సన్యెట్సెన్ (sun yet sen)అనే యువనాయకుడు చాలా ప్రజాదరణ కలిగిఉండేవాడు.అతనికి దక్షిణ చైనాలో ఎక్కువ బలం ఉండగా ,ఉత్తర చైనాలో యువాన్షికాయ్ (yuvanshikayi) అనే నాయకునికి ఎక్కువ బలం ఉండినది.వీరి మధ్య విభేదాలవలన అంతర్ యుద్ధం జరిగింది.చివరికి సన్యత్సెన్ మరణించాక అతని పార్టీకి కౌమింటాంగ్ పార్టీకి (koumintang party)కి చియాంగ్కైషెక్ (chiyang kai shek ) అనే మిలిటరీ జనరల్ నాయకుడై 1924 నుండి 1949 వరకు చైనాను పాలించాడు.
  ఇతని కాలంలో మావో  సే తుంగ్ (mao tse djang)) నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి బలపడింది .కొమింటెర్న్ (communist international) సలహాలతో నడచింది.నేషనలిస్ట్ కొమింటాంగ్ తో తలపడి పొరాడింది. పారిశ్రామిక దేశాల దృష్టి తో మార్క్స్ రాసిన దానిని గ్రామీణ,వ్యవసాయ చైనాకి మావో అన్వయించి గెరిల్లా పోరాటం కొనసాగించాడు.కొమింటాంగ్ సైన్యాలు వెంట తరుముతూ వుండగా 20000మంది అనుచరులతో 3000 మైల్లు ప్రయాణం చేసి యనాన్ ప్రాంతంలో(మంగొలియా సరిహద్దుకు దగ్గరగా స్థావరాన్ని ఏర్పరచుకొన్నాడు. దీనినే ప్రసిద్ధమైన లాంగ్ మార్చ్ (long march )అని పిలుస్తారు.