10, ఏప్రిల్ 2012, మంగళవారం

CHINA-contd.10


 

   జపాన్ యుద్ధకాలంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజాబలం బాగా సంపాదించుకున్నది. మావో సమర్థనాయకత్వం,ఎత్తుగడల వలన కొమింటాంగ్ ప్రభుత్వ సైన్యాలను పూర్తిగా ఓడించగలిగింది.చైనాని దాదాపు అంతటినీ ఆక్రమించింది.చియాంగ్ కై షేక్ లక్ష సైన్యంతో ఫార్మోజా దీవికి (నేటి తైవాన్) పారిపోయి అక్కడ అమెరికా రక్షణలో ప్రభుత్వం కొనసాగించేడు.
 1949లో  బీజింగ్ రాజధానిగా  కమ్యూనిస్టు రిపబ్లిక్ ప్రకటించ బడినది.మావో పార్టీ కార్యదర్శి ఐనా సర్వాధికారి అతడే.అతని సహచరులలో లీ షా చీ (lee shao chi ) రిపబ్లిక్ అధ్యక్షుడు; చౌ ఎన్ లే (chou en lay )  విదేశాంగ మంత్రి; లింబియావో (lin bi yao ) సర్వసేనాధిపతి.
 అసలు చైనా లో భాగాలు కాని (హాన్ జాతి వారి రాష్ట్రాలు కాని ) ప్రాంతాల సంగతి 1.మంచూరియా ; జపాన్ సైన్యాల ఉపసమ్హరణ తర్వాత కమ్యూనిస్టు సైన్యాలు మంచూరియాను ఆక్రమించేయి .2.మంగొలియా ; సోవియట్ యూనియన్ సహాయంతో స్వతంత్ర రాజ్యమైనై.3.ఇన్నర్ మంగోలియా ;ఇక్కడ్డ హాంజాతి ప్రజలు కూడా నివసిస్తూ ఉండటం వలన చైనా రిపబ్లిక్ లో భాగంగా కలిపివేసారు.4.సిన్ కి యాంగ్ ; ఉయిఘర్ జాతి ముస్లిములు ఉన్న ఎడారి ప్రదేశం.వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడినా అణచివేసారు.5.టిబెట్ ; చాలా కాలం ఇది స్వతంత్ర రాజ్యం.బ్రిటిష్ హయాంలో దీనిపై చైనాకి నామమాత్రపు సార్వభౌమ అధికారం ఇస్తూ ఒడంబడిక జరిగింది.దీని ఆధారంగా శాంతికాముకులు,సైన్యబలం లేని టిబెటన్లను అణచివేసి ఆక్రమించుకున్నారు.బౌద్ధ మతగురువు దలై లామా కొందరు అనుచరులతో కలసి రహస్యంగా 1959లో మనదేశానికి పారిపోయి వచ్చి శరణార్థిగా ఉంటున్నాడు.6.తైవాన్ ద్వీపం; అమెరికన్ నౌకా ,రాకెట్ సైన్య రక్షణలో స్వతంత్ర రాజ్యంగా ,ప్రజాస్వామిక విధానంలో ఉన్నది.ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది.7.హాంగ్కాంగ్; లీజు ఒడంబడిక కాలం పూర్తయాక 1999లో ఈ బ్రిటిష్ కాలనీ తిరిగి చైనాలో ప్రత్యేక ప్రతిపత్తితో చేరిపోయింది.ఆర్థికంగా సంపన్నమైన నగరం.
 చైనా సైన్యాన్ని P.L.A.peoples liberation army  అంటారు.