6, ఏప్రిల్ 2012, శుక్రవారం

China-contd-9

౧౮వ శతాబ్దంలో ఉన్నత స్థితిలో ఉన్న మంచూ సామ్రాజ్యం ౧౯వ శతాబ్దిలో కూడా కొనసాగినా ఇబ్బందుల్ని ఎదుర్కొంది.కొంత ప్రతిష్తను కోల్పోయింది.మొదట పేర్కొన్న ఆరుగురు చక్రవర్తుల తర్వాత మరి ఆరుగురు చక్రవర్తులు పాలించారు.చివరి నలబది సంవత్సరాలు నామమాత్రంగా ఇద్దరు చక్రవర్తులు ఉన్నా చిక్సీ అనే రాజమాత తెర వెనుక నుంచి పరిపాలన నిర్వహించింది.
   బ్రిటన్,ఫ్రాన్స్ ,పోర్చుగల్ ,హాలండ్ వంటి పాశ్చాత్య దేశాలు అప్పటికే ఇతర దేశాల్లో సామ్రాజ్యాలు స్థాపించుకొని ,చైనాలో వర్తకం,స్థావరాలు,రేవు పట్టణాల్లో ఆధిపత్యం గురించి చైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ,రాయితీలు రాబట్టే వారు.
  ఇండియాలో తమ స్వాధీనంలో ఉన్న ప్రాంతాల్లో గంజాయి పంటను ప్రోత్సహించి  బ్రిటిష్ వారు దానిని చైనా వర్తకులతో కలసి ఆ దేశానికి ఎగుమతి చేసేవారు .ఇండియా ,ఛీ నాలలో  పూర్వకాలం నుంచి నల్లమందు వైద్యానికి వాడేవారు.కాని దానిని వ్యసనంగా మార్చి ప్రజలని దానికి బానిసలుగా చేసారు.గంజాయిని నిషేధించి ,మాన్పించడానికి ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమైనవి.ఈ విషయంలో బ్రిటిష్ ,చైనా నౌకా దళాలకు పోరాటం జరిగింది.అందులో చైనా ఓడిపోయింది.దీనినే నల్లమందు యుద్ధం అంటారు.ఇది చైనా దేసభక్తులకు అవమానం గా తోచింది.
   స్వతహాగా హాన్జాతి వారికి మంచూ జాతి మీద గల వైమనస్యం తిరుగుబాట్లకు దారితీసింది.ఇందులో ముఖ్యమైనది ఎర్ర తలపాగాలు లేక red  Turbans  అనే సంఘం వారి తిరుగుబాటు.
  ఎక్కువ కాలం ,దాదాపు ఇరవయి సంవత్సరాలు జరిగిన ఉద్యమం,విప్లవం టైపింగ్ తియాన్గో '(heavenly kingdom of great peace )1899 లో తీవ్రమైనది.హాంగ్ క్సిక్వాన్ అనే యువకుడు క్రైస్తవ మాట ప్రభావం చేత తనను తాను ఏసుక్రీస్తు అపరావతారంగా భావించుకొని ప్రకటించుకొన్నాడు. 20000మన్ది అనుచరులను సంపాదించి యాన్గ్సీ నదీ ప్రాంతాన్ని ,అక్కడ కొన్ని నగరాలను స్వాధీన పరచుకొన్నాడు.కొంత సైన్యాన్ని రాజధాని బీజింగ్ పైకి ముట్టడికి పంపించాడు.కాని మంచూ రాజులు విదేశీ సైనిక సహాయంతో ఈ తిరుగుబాటుని అణచివేశారు.
  ఉత్తరాన రష్యా సామ్రాజ్య విస్తరణ ఆందోళన కలిగించింది.జపాన్ కూడా బలపడి కొరియా,మంచూరియాలను ఆక్రమిన్చెఅ ప్రయత్నం చేసింది.కాని అగ్రరాజ్యాల పరస్పర వైరుధ్యాల వలన రష్యా,జపాన్ల ప్రయత్నాలు ఫలించలేదు .
 మరొక ముఖ్యమైన తిరుగుబాటు మల్లయోధుల తిరుగుబాటు Boxers rebellion .కాని ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు.విదేశీయులు,వారి మతస్తులైన క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగింది.చాలామంది క్రైస్తవుల్ని ,మిశానరీలను చంపేశారు.చర్చీలను ద్వంసం చేసారు.కాని ప్రభుత్వం చూస్తూ మిన్నకుండింది.అంతర్జాతీయంగా దీనిపై తీవ్ర ఆందోళన కలగడంతో పాశ్చాత్య దేశాలు తమ సైన్యాలు పంపి ఈ తిరుగుబాటుని అణచివేసాయి.
 19va శతాబ్దంలో జాతీయ, అంతర్జాతీయ మార్పులు చాల జరిగాయి.శాస్త్రీయ విజ్ఞానం పెరిగింది.ఆధునిక విద్య,భావాలు అభివ్రిద్ది చెందాయి.రైలు మార్గాలు,టెలిగ్రాఫు వంటివి ప్రవేశ పెట్టబడినవి.స్త్రీలపై నిర్బంధాలు కొన్ని తొలగించారు .అందంకోసం బాలికల పాదాలు ఎదగకుండా కట్లు కట్టే దురాచారం నిషేధింపబడినది.
   సరిహద్దుల్లో తిరుగుబాట్లు జరుగుతూ ఉండేవి.కేంద్ర ప్రభుత్వం బలహీనపడి రాష్ట్ర గవర్నర్లు, పాలెగార్లు బలపడ్డారు.
   ఈ నేపధ్యంలో జాతీయ,ప్రజాస్వామిక  ఉద్యమం విజయవంతమై ,రాజరికం తొలగింపబడి రిపబ్లిక్ స్థాపించబడినది.అప్పటి చక్రవర్తి పేరు  పీ-యూ.చంతిపిల్లవాడు .అందువలన సంరక్షకులతో రాజప్రాసాదం లోనే ఒక భాగం లో ఉంచారు. 1911 లో రిపబ్లిక్ ప్రకటించబడి చైనా రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ఆధునిక యుగంలోకి అడుగుపెట్టింది.కాని ముందు ముందు ఎన్నో అంతర్పోరాటాలు,యుద్ధాలు,రక్తపాతం,కరవుకాటకాలు అనుభవించింది.
   (మిగతా మరొక సారి.)