6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

naa amerikaa yaatra--3: Independence Day

3-7-13  ఈ వేళ కిందికి దిగి, రోడ్డు దాటి హడ్సన్ నదివైపు వెళ్ళాము. మెట్లు దిగి కిందికి వెళ్తే అక్కడ కార్లు,బస్సులు తిరగడానికి ఒకరోడ్డు, సైకిళ్ళు, పాదచారులు తిరగడానికి మరో రోడ్డు ఉన్నాయి. ఆ రోడ్డు మీద చాలా మంది యువతీ యువకులు, సైకిళ్ళమీద తిరుగుతూ, మధ్యవయస్కులు 'జాగింగ్ ' చేస్తూఉన్నారు. కొందరు వృద్ధులు, ఒంటరిగా ఉండే స్త్రీలు పెంపుడు కుక్కల్ని తీసుకొని తిరగడానికి వస్తుంటారు.నది వొడ్డున పైకప్పు ఉన్న ఆ దారిలో అక్కడక్కడ పూలతొట్టెలు, చిన్నపార్కులతో  అందంగాఉంది. ఆకుపచ్చని గొడుగులకింద వున్న కాంటీన్లో కాఫీ తాగి తిరిగివస్తుంటే వాన పట్టుకుంది. అరగంట ఆగి వాన తగ్గాక తిరిగి వచ్చాము. అమెరికాలో మనకుమల్లే ప్రత్యేకంగా వానాకాలం ఉండదు. కాని వాతావరణాన్ని చాలా కరెక్టుగా సమాచారం చెప్తారు.
ముఖ్యంగా నదీతీరాలవంటి ప్రదేశాల్ని, అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారు. అదే మన దేశమో ఎలా మురికిగా ఉంటాయో తెలిసిందే. దీనికి నిధులలోటు ఒక కారణం కావచ్చు. కాని ప్రజలూ, ప్రభుత్వమూ చూపే నిర్లక్ష్యం, అశ్రద్ధ కూడా కారణాలే.

4--7--13:- 4th  of  July , American Independence Day: ఇవేళ అమెరికా స్వాతంత్ర్య దినం. హడ్సన్ (Hudson) నదిలో నౌకలని నిలబెట్టి వాటినుంచి బాణాసంచా కాలుస్తారు. సాయంకాలం నుంచి ట్రాఫిక్ నిబంధన, పోలీసు పహరా ప్రారంభమైనది. కొందరు కార్లలో ఇతర ప్రాంతాలనుంచి వచ్చి వీక్షించారు. కొందరు పడవలు, క్రూయిజ్ల (cruise) నుంచి వీక్షించారు. మేము మాత్రం మా ఇంట్లోనుంచే చూడగలిగాము. రాత్రి9-30 నుంచి 10 గంటలదాకా ఆ కార్యక్రమం కొనసాగింది. ఎంతో గొప్పగా, మనోజ్ఞంగా సాగింది. నవరత్నాలు రాశులుగా ఆకాశం లోంచి రాలుతున్నట్లు అనిపించింది. జాతీయ కార్యక్రమం కాబట్టి ప్రభుత్వశాఖ నిర్వహిస్తుంది అనుకొన్నాము. కాని, అమెరికా కదా, దీన్ని కూడా ఒక ప్రైవేటు కంపెనీ కి అప్పజెప్పారు. మొత్తం మీద జులై నాలుగు ఉల్లాసంగా గడిచింది.
(ఇంకావుంది)











1 కామెంట్‌:

www.apuroopam.blogspot.com చెప్పారు...

మూడు భాగాలూ ఇప్పుడే చూసి చదివాను.విశేషాలన్నీ వివరంగా వ్రాయండి. ఆసక్తితో చదువుతాము.