7, సెప్టెంబర్ 2013, శనివారం

naa amerikaa yaatra--4
 ఇవేళ,న్యూయార్కు నగరం విహంగవీక్షణానికి  టాక్సీలో బయలుదేరాము.(5-7-13.0)మా డ్రైవరు ఒక సర్దార్జీ.మర్యాదగా,సంస్కారవంతుడుగా వున్నాడు.న్యూయార్కులో చాలామంది టాక్సీడ్రైవర్లు భారతీయసంతతికి చెందినవారు.ఒక పద్ధతిలో మేము చూడాలనుకున్నవన్నీ తిప్పి చూపించాడు.కొలంబియా యూనివర్సిటీ,బ్రాడ్వేలో వున్న పెద్ద షాపులు,ఆఫీసులు,5వ ఎవెన్యూలోవున్న ఎంపైర్ స్టేట్ బిల్డింగు,ఇంకా టైంస్ స్క్వేర్  కార్నెజీ హాలు,లింకన్ సెంటర్ ,కొలంబస్ సర్కిల్,సెంట్రల్ పార్కు  ఎత్తైన క్రిస్లర్ బిల్డింగు,అంతర్జాతీయ వాణిజ్యకేంద్రం వాల్ స్ట్రీట్,చూసాము.ఉగ్రవాదులు కూల్చివేసిన world trade centre స్థానం లో కొత్తగా కట్టిన ఫైనాన్షియల్ సెంటర్ చూసాము.అంతర్జాతీయంగా పేరుబడ్డ ఫాషన్ దుస్తులు,వస్తువుల షాపులు లూయీవుటన్,క్రీస్టీ,స్వరోకీ మొదలైన పెద్ద షాపులన్నీ అక్కడ ఉన్నాయి.   రెండు పెద్ద చర్చిలు  ,ప్రసిద్ధమైన మెట్రొపాలిటన్,గుగిన్ హీం  మ్యూజియములు చూసాము.మూడు గంటలసేపు తిరిగి ,న్యూయార్కులో,మాన్ హాటన్  land marks చూసాక హడ్సన్ నది రేవు దగ్గర కారు దిగిపోయాము.
  అక్కడ ఫుల్ సర్కిల్ టికెట్లు కొని క్రూయిజ్ లాంచిలో నదిలో రెండున్నర గంటలు ప్రయాణం చెసాము.మళ్ళీ నదిలోనుంచి ఇటు మాన్ హాటన్ అటు న్యూజెర్సీ లోని విశేషాలు చూస్తూ,ఎల్లిస్ దీవి పక్క లిబర్టీ విగ్రహం పక్కనుంచి వెళ్ళాము.100 సం;క్రితం ఫ్రెంచి  ప్రజలు అమెరికా ప్రజలకి సుహృద్భావ సూచకంగా ఈ విగ్రహాన్ని బహూకరించారు. స్వేచ్చా,స్వాతంత్ర్యాలకి ప్రతీకగా ఉన్న ఈ statue of liberty  ని వేలాది యాత్రికులు సందర్శిస్తూ వుంటారు.దీనిని,కంచుbronze  తో తయారుచేసారట.పీఠమునుంచి  ఎత్తినచేతిలోని కాగడా వరకు 300 అడుగులకన్నా ఎక్కువగానేఉంటుంది.మొత్తం 20 వంతెనల కిందనుంచి ప్రయాణం చేస్తూ హడ్సన్ నది,ఈస్ట్ రివర్  లోనుంచి సముద్రంలోకి వెళ్ళి,తిరిగి వచ్చాము.ఈ వంతెనలలో బ్రూక్లిన్ బ్రిడ్జి ,వాషింగ్టన్, క్వీన్స్బరో బ్రిడ్జిలు ముఖ్యమైనవి.న్యూజెర్సీ ,మాన్ హాటన్లను కలిపే బ్రూక్లిన్ బ్రిడ్జి నిచాలాసినిమాల్లో చూసేవుంటారు.ఇది suspension bridge.న్యూయార్క్ నగరం 5 బరోలుగా విభజించబడివుంది.అవి 1,మాన్ హాటన్,2.బ్రూక్లిన్ 3. బ్రాంక్స్ 4.క్వీన్స్ బరో. 5.స్టాటిన్ ఐలండ్.వీటిని కలుపుతూ ఈ వంతెనలను నిర్మించారు.బయట నుంచి చూసిన వీటిలో  కావాలనుకొన్నవి మళ్ళీ లోపలకి వెళ్ళి  ఇంకో సారి వెళ్ళి చూద్దామనుకున్నాము.  

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

Good going.Add photos if possible