8, సెప్టెంబర్ 2013, ఆదివారం

nayagara-contd.
 మా లాడ్జ్ పక్కనే ఒక పంజాబీ భోజనశాల ఉండడం చేత రాత్రి మీల్స్ కి ఇబ్బంది లేకపోయింది. రాత్రిపూట  విద్యుద్దీపాల కాంతిలో మళ్ళీ జలపాతాన్ని చూదవచ్చని  మా అబ్బాయి వెళ్ళాడు. కాని నేను వెళ్ళలేకపోయాను. చూసి తిరిగివచ్చి  ఇంద్రధనుస్సు వంటి రంగుల విద్యుద్దీపాల కాంతుల్లో జలపాతాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. కెనడా వీసా  ఉన్నవాళ్ళు అక్కడ కొండమీద ఉన్న హొటల్స్ లో దిగి దగ్గరగా నయాగరాని చూస్తూ గడుపుతారట. మాకు కెనడా వీసా లేదు. (ఎవరికైనా, మెర్లిన్ మన్రో నటించిన నయాగరా సినిమా గుర్తుందా ?).

మరునాడు ఉదయం అల్పాహారంతీసుకొని, స్టేషన్ కి వెళ్ళి రైల్ లో రాత్రి 11గంటలకి న్యూయార్క్ చేరుకున్నాము. ఇక్కడ విమానాశ్రయాల్లో లాగే రైల్వే లో కూడా సెక్యూరిటీ చెక్స్, I.D. గుర్తింపు ఉంటుంది. రైలు బయలుదేరడానికి 15 నిముషాలముందు మాత్రమే అనుమతి ఉన్నవారినే ప్లాట్ ఫారం మీదకి రానిస్తారు. మన స్టేషన్లలో కూడా ఇలాంటి సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా! మరొక విషయం; ప్రతిచోట ఎవరూ చెప్పకపోయినా అందరూ' క్యూ ' పాటిస్తారు.క్రమశిక్షణ ఉంటుంది. గట్టిగా మాట్లాడరు.
  నయాగరా చూసాక వ్రాసిన గేయం .;;--
      నయాగరా, నయాగరా !
      బృహజ్జలసాగరా, భీకరా,
      నీ విజృంభణ నరికట్ట నెవరి తరము?
      ఈశానుని జటాజూటమునకు  దక్క,
      ఉప్పొంగిన సాగరతరంగ  ఘోషను మించిన
      ఉన్నత శిఖర నిపాత మహారావం
      తుషారశీకర శీతలవర్షామేఘ నికాయం
     నయాగరా,నయాగరా!