14, మార్చి 2012, బుధవారం

China-5-(contd.)
 ఈ టాంగ్ వంశ పాలనా కాలంలోనే చైనా సామ్రాజ్యం మధ ఏసియాలో సమర్ఖండ్ వరకు ఉత్తరాన మంచూరియా వరకు విస్తరించింది.ఆ కాలంలో (7,8,శతాబ్దులలో  )ప్రపంచంలోనే పెద్ద ,గొప్ప,సామ్రాజ్యంగా వెలసింది.చివరిలో  ఆన్ లుషాన్ అనే సైనికాధికారి తిరుగుబాటు చేసి రాజధాని చాంగాన్ ను ఆక్రమించి ,చక్రవర్తిని తరిమేసాడు.అతని మరణం తర్వాత మళ్ళీ రాజధాని టాంగ్ వంశస్తుల వశమైంది కాని,పూర్వ ప్రాభవం పొందలేక పోయింది.
  A.D.750 నుండి 907 వరకు వరుసగా 15 గురు చక్రవర్తులు పాలించినా ,తిరుగుబాట్లు ,సరిహద్దుల్లో ఆక్రమణలూ ఎక్కువైనవి.10వ శతాబ్దంలో 3రాజ్యాలుగా చీలిపోయింది.ఇందులో ఉత్తరప్రాంతాన్ని పాలించిన వారు చైనా హాన్ జాతీయులు కాదు.ఖిటాన్ అనే జాతి వారు .వారి భాష కూడా వేరు.
  6-10 శతాబ్దుల కాలంలో చైనాలో పరిస్థితులు.
  రాజకీయ పరిస్థితులు ఎలా మారుతున్నా దేశంలో జనజీవితం యధావిధిగా కొనసాగుతూ ఉంటుంది కదా. సిల్క్ బట్టల తయారీ. ఎగుమతులూ కొనసాగుతూ ఉండేది.వెదురు నుంచి కాగితం తయారీ అప్పటికే జరుగుతూ ఉందేది .A.D.8 వ శతాబ్దంలో పేపరు మీద అచ్చులతో ముద్రించడం (block  printing) ప్రారంభ మైనది.యూరప్లో గుటెన్ బర్గ్ ముద్రణా యంత్రాన్ని 15వ శతాబ్దంలో కనిపెట్టేవరకు వాళ్ళకు ప్రింటింగు తెలియదు.మనదేశంలో 18 వ శతాబ్దంలోనే మిషనరీలు అచ్చువేయడం   ప్రారంభించారు.చైనాలో అప్పటి నుంచే బౌద్ధ ,కంఫూసియన్ ,గ్రంధాలు ముద్రించడం ప్రారంభించారు.మన కావ్యాల్లో చీనిచీనాంబరాల ప్రసక్తి క్రీ.పూ.నుండే కనిపిస్తుంది.చైనాలో నదులు,కాలవల ద్వారా,రోడ్ల ద్వారా రాకపోకలు, సరకుల రవాణా,జరుగుతూ ఉండేవి. నౌకల ద్వారా సముద్ర వ్యాపారం జరుగుతూ ఉండేది.(మన దేశం,ఆగ్నేయాసియా దేశాలతో ఎక్కువగా సముద్రమార్గంలోను ,మధ్య ఆసియా,పెర్షియా ,టర్కీ ,యూరప్లతో భూమార్గంలో సిల్కు రోడ్డు పైన వాణిజ్యం జరిగేది.
  ఫ్యూడల్ పద్ధతిలో ,కంఫూషస్ సిద్ధాంతాలప్రకారం జరిగేది.శిక్షలు కఠినం గాఉండేవి.పెద్దలను చిన్నవారు ,యజమానులను సేవకులు,రాజులను ఉద్యోగులు ,ప్రజలు గౌరవించాలి ,ఆజ్ఞలను శిరసావహించాలి.
 ఆ కాలంలో పెద్ద నగరాలు లుయాంగ్ ,చాంగాన్,నాంజింగ్ ,యాంగ్జౌ, గువాంగ్జౌ, చెంగ్డు బీజింగ్,,కొంతకాలం లుయాంగ్, కొంతకాలం చాంగాన్ రాజధానులుగా ఉండేవి.ఉత్తరప్రాంతంలో గోధుమలు,జొన్నలు ,దక్షిణప్రాంతంలో వరి ఎక్కువగా పండించేవారు.పెద్ద పెద్ద కట్టడాలు  కూడా ఇటుకలు,మట్టి,పెంకులు, చెక్క కర్రల తోనే నిర్మించే వారు.
  ఇంతవరకు,10వ శతాబ్ధి   A.D.వరకు చాలా క్లుప్తంగా చైనా చరిత్ర తెలుసుకొన్నాము.ఇంకా ఉంది.to be continued  

 
  

1 వ్యాఖ్య:

తెలుగు భావాలు చెప్పారు...

భిన్నమైన టాపిక్కుని ఎంచుకున్నారు. ఇప్పుడే చదవడం మొదలుబెట్టాను. రామాయణంలో కూడా చైనా ఊసు కనిపిస్తుంది కదా! సుగ్రీవుడు నలుదిక్కులా వానరులను పంపుతూ, చీన మహాచీన ల గురించి చెబుతాడు.

'మహాచీన' అంటే బర్మా అని కొందరు, జపాన్ అని కొందరు అంటుంటారు. దీనిగురించి మీ వద్ద వివరాలేమన్నా ఉన్నాయా?