21, జనవరి 2011, శుక్రవారం

టైమ్ మిషన్

మన లోనే కాల యంత్రములు.
మనస్సు లోనే ఇమిడి ఉన్నవి.
కడు క్లిష్టమైన ఖరీదైన
కాల యన్త్రములతో పని లేదు
మన జ్ఞాపకాలే గతంలోకి
మరల్చుకొని మోసుకొని పోవును
మన స్వప్నాలే భవితవ్యపు మార్గంలో పయనిమ్పజేయును
మనోహరమైన మన భావాలే మరో లోకపు
మందిరములలో విహరిమ్పజేయును.