4, అక్టోబర్ 2014, శనివారం

swatcha Bharat
 స్వచ్చ భారత్ కార్యక్రమాలు.ప్రముఖ నాయకులు,అధికారులు,చీపురుకట్టలతో చెత్త తుడవడం కొత్తకాదు.ఇదే మొదటి సారి కాదు.మరి ఎందుకు  విఫలమౌతున్నదో ప్రతిసారి అని ప్రశ్నించుకొంటే  కారణాలు తెలుస్తాయి.
   1.ఈ కార్యక్రమం కొన్నిసంవత్సరాలు  ఆగకుండా సాగాలి.
   2.సరియైన డ్రైనేజి  కల్పించాలి.
   3.మురుగునీరు ఆధునికపద్ధతిలో  ట్రీట్ చెయ్యకుండా జలాశయాల్లో కలపడాన్ని నిషేధించాలి.
   4.పై విధంగా చెయ్యాలంటే  తగిన నిధులు ఖర్చుపెట్టకుండా సాధ్యం కాదు.
   5.ఇంటింటికీ వెళ్ళి చెత్త కలెక్ట్ చేసి తగిన విధం గా దాన్ని డిస్పోజ్ చెయ్యాలి.అలాచెయ్య కుండా వీధుల్లో చెత్తపారబోసే వాళ్ళకి  జరిమానా విధించి తీరాలి.అంతేకాదు,అలా ఏర్పాటు చెయ్యని పంచాయితీ,మున్సిపాలిటీ  అధికారులపైన కూడా జరిమానా విధించాలి.
   6.ప్రతి ఇంటికి టాయిలెట్(పట్నాలు,పల్లెలు కూడా )ఉండితీరాలి.ఒకసంవత్సరం  గడువు ఇచ్చి ఆలోగా కట్టుకోకపోతే రూ.పదివేలు జరిమానా విధించాలి.మరీ పేదవారయితే ప్రభుత్వమే కట్టించి  ఇవ్వాలి.
    ఇంకా ఇలాంటి చర్యలు కఠినంగా తీసుకోకుండా అరుదుగా పెద్దలు చీపుర్లు పట్టుకుంటె ఏమీ లాభం ఉండదు.ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంటుంది.