31, అక్టోబర్ 2014, శుక్రవారం

janjhavati kathalu=contd(Final)



 మొత్తం మీద ఈ 21 కథలను పరిశీలిస్తే ఇవన్నీ తీవ్రవాద వామపక్ష ధోరణిలో వ్రాసినట్లున్నది.నీటిప్రాజెక్టులకీ,విద్యుత్ ప్రాజెక్టులకీ ఈ రచయితలంతా వ్యతిరేకులని అనిపిస్తున్నది.ఒక ఎకరా కూడా లేని  భూమితో5,6,మంది ఎలాజీవిస్తారు? చిన్న కమతాలు పోవడం మంచిదే కదా!ఒకప్పుడు వీరు ఎదుటి వారిని ఏ కారణాలతో అభివృద్ధి  నిరోధకులన్నారో ,ఇప్పుడదే కారణాలతోపర్యావరణరక్షణ పేరుతో సమర్థిస్తున్నారు.పర్యావరణసమ్రక్షణ మంచిదే.కాని అభివృద్ధి చెందిన ఫ్రాన్స్,జెర్మనీ ,స్విస్స్ వంటి దేశాలు పర్యావరణని   కాపాడుకొంటూనే నగరాలనీ,సంపదనీ.అభివృద్ధినీ సాధించుకోలేదా?
   ఈ కథలు వివిధ కాలాల్లో దశకాల్లో రాసినట్లు కనిపిస్తుంది.కాని దేశంలో జరిగిన,జరుగుతున్న,అభివృద్ధి మాత్రం వీరికి  కాబట్టినట్లు లేదు.పేదరికంతగ్గిందికదా!లేబరుకెంత డిమాండు వుందిప్పుడు?రచయితలు దేశంలో వస్తున్న మంచి, చెడ్డ ,అన్ని మార్పుల్ని బాగా అధ్యయనం  చెసి రాస్తే మంచిదనుకొంటాను.
       ఈ కథా రచయితలందరూ నిష్ణాతులని ముందే పేర్కొనడం జరిగింది.కొన్ని కథాంశాలు,కథనం బాగున్నవని చెప్పవచ్చును.కాని కొన్ని  కథలకు ముగింపు స్పష్టంగా లేదు.కొన్ని కథల్లో  రచయిత చెప్పడంలో గందరగోళంలో పడినట్లు అనిపిస్తుంది.
        ఐనా ఈ కథాసంకలనం శ్రీకాకుళసాహితివారి మంచి ప్రయత్నం అని చెప్పాలి.జిల్లాలోని నదులపేర్లతో కథాసంకలనాలు ప్రచురిద్దామన్న వీరి ప్రయత్నం అభినందనీయం.ఇప్పటికి నాగావళి,వంశధార పేర్లతో రెండు సంపుటాలు వెలువడ్డాయి.ఇది మూడవది.ఇంకా మరికొన్ని వెలువడవచ్చును.వీటన్నిటినీ చదివితే ఉత్తరాంధ్రప్రజా జీవితం,పరిస్థితులు,ఇటీవలి చరిత్ర గురించి పాఠకులకు ఒక అవగాహన ఏర్పడుతుంది. కథరచించిన కాలం పేర్కొనిఉంటే బాగుండేది.
                           (సమాప్తం)  

కామెంట్‌లు లేవు: