28, అక్టోబర్ 2014, మంగళవారం

janjhaavati kathalu-a review.




 జంఝావతి కథలు;శ్రీకాకుళ సాహితి వారి ప్రచురణ.
---------------------------------
శ్రీకాకుళ సాహితి వారు ఉత్తరాంధ్రలోని నదులపేర్లతో అక్కడి రచయితల కథా సంపుటాలు ప్రచురించుదామనే  సంకల్పంలో భాగంగా జంఝావతికథలు ప్రచురించారు.ఇందులో కథకులు చాలామంది ప్రసిద్ధులే.చాలాకథలు పత్రికల్లో వచ్చినవే.మొత్తం 21 కథలు ఇందులోఉన్నవి.
  కథకుల్లో  వామపక్ష తీవ్రభావ ధోరణి స్పష్టంగా ఉన్నది.  ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాల జీవనంలో వచ్చిన మార్పులు,మానవ సంబంధాల  విచ్చిత్తి    కనిపిస్తుంది.
వ్యవసాయంలో వచ్చిన మార్కెట్ ధోరణి,రైతుల కష్టాలు గూరించికూడా చాలామంది రాసారు.దాదాపు అందరూ అక్కడి మాండలికం లోనే బాగారాసారు.కాని మళ్ళీ మనం 50,60,ఏళ్ళ వెనక్కి వెళ్ళగలమా,వెళ్ళడం మంచిదా అని నా సందేహం.
 మొట్టమొదటికథ; కాళీపట్నం రామారావు గారిది (కా.రా.మాస్టారు) '' అన్నెమ్మనాయురాలు " రైతు కుటుంబంలోని  పెద్దావిడ.పొరుగూరివారితో  కోర్టు వ్యాజ్యాలతో చాలాపొలం పోగా మిగిలినదానితో మనమడితో కలిసి కాలం గడుపుతూ ఉంటుంది.మనమడు పొలం అమ్మేద్దమంటాడు.లేకపోతే తనవాటా పంచి ఇమ్మంటాడు.చివరకి తప్పనిసరి అయి వాటా రాసి ఇచ్చేస్తుంది.తరాలలో వచ్చిన భేదం చిత్రిస్తుంది.కథ పెద్దగాలేదు.వ్యాసంలా ఉంది.కథలు రాయడం మానేసిన మాస్టారు మొగమాటానికి కథ రాసి ఇచ్చినట్లు  అనిపిస్తుంది.
  రెండో కథ ; ' సాటింపు ' B.V.A. రామారావు నాయుడు గారి రచన.ఉబ్బసవ్యాధితో బాధపడే చినజన్నోడు అమ్మవారిపండుగలో 'సిరిమాను '  ఎక్కకుండా తప్పించుకోడానికి పక్క వూరికి పారిపోతాడు.కాని ఊరిపెద్దలు అతని కొడుకు వెంకటిని సిరిమానుఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విని,తిరిగివచ్చి తానే సిరిమాను  ఎక్కి ఊరేగింపులో మరణిస్తాడు. ఊరిపెద్ద కొడుకు రాజబాబుని నక్సలైట్లు కాల్చి చంపుతారు.సంబరం ఆగిపోతుంది.మూఢాచారాలకి,ఆధునిక భావాలకి మధ్య ఘర్షణని ఇంకా బాగా చిత్రించి ఉండవలసినది. కాని ఇంతటితో మూఢాచారాలు ఆగిపోతాయా అనే రచయిత ప్రశ్నతో కథ ముగుస్తుంది.
  మూడో కథ; మన్యం పల్లెలో  పండిన పంట అమ్ముతే షావుకారుకే  అమ్మాల. అతడే ధర నిర్ణయిస్తాడు.వాడిదే మొనోపలీ .ఒకసారి అలా అమ్మకుండా ఎదురు తిరిగితే  ముసలయ్యను,పొలీసుల ద్వారా దౌర్జన్యం చేయించి ,పంటని షావుకారుకే చేర్పిస్తారు.మన్యం ప్రజలని షావుకార్లు,పోలీసులు ఎలా  దోచుకొంటున్నారో తెలియజెప్పే కథ.    (ఇంకావుంది) 

కామెంట్‌లు లేవు: