30, అక్టోబర్ 2014, గురువారం

JANJHAAVATI KATHALU--REVIEW--3rd part




  ఉత్తరాంధ్ర ప్రసిద్ధ కథారచయిత రెడ్డిశాస్త్రి గారి కథ ' అస్తమయం ' :లచ్చయ్య దిక్కులేని ముసలాడు.ఎలాగో వూరివాళ్ళ సాయంతో కాలం వెళ్ళబుచ్చుతుంటాడు.అతడి నేస్తం గురయ్య మరో వృద్ధుడు.చాలీ చాలని బతుకు తెరువుమాత్రం ఇస్తున్న చిన్న మెట్టపొలాన్ని అమ్మేసి పట్నానికి పోయి పనిచేసుకొని బతుకుదామని  కొడుకు పోరుపెడుతుంటాడు.ఆ మాటచెప్పి గురయ్య లచ్చయ్య సలహా అడుగుతాడు.లచ్చయ్య ఎటూ చెప్పలేకపోతాడు.చివరకు,తరాలు మారేయని,కొడుకు చెప్పినట్లేచెయ్యమని చెప్తాడు.పొలం అమ్మడం యిష్టం లేని గురయ్య నూతిలోపడి  మరణిస్తాడు.లచ్చయ్య షాక్ తో మరణిస్తాడు.ప్రజలు ' రెండూళ్ళ ముదర బుర్రలు మరి లేకంటా పోయాయి ' అనుకొంటారు.
  వ్యవసాయం గిట్టుబాటుగాక  రైతులు పట్టణాలకి వలసలుపోవడం  ఈ కథలో ప్రధానాంశం.
      ఇక మిగతా కథల గురించి క్లుప్తంగా;--
    'కళింగ ఎక్స్ ప్రెస్ ' (కొప్పల భానునూర్తి) కూడా వలసలగురించి : మొదళ్ళు-చిగుళ్ళు (దాసరి రామచంద్రరావు) బాలకార్మికుల స్థితి ,పిల్లలు స్కూలులో చదువుకొంటూ ఒకవైపు,పనుల్లోకి వెళ్ళవలసిన అవసరం  ఇంకొకవైపు అనే అంశం గురించి."భస్మసిమ్హాసనం' (పంతుల కమలకుమారి" ) కలవంటి కథ.పల్లెల్ని ధ్వంసం చేసి పరిశ్రమలు పెట్టడం గురించి,మత్స్యకారుల జీవితాలలోని కష్టాలగురించి కథాంశం. 'ఆటుపోటు " (చింతాడ తిరుమలరావు) ,రెక్కసాగనికథ(నాగులమహంతి రమణమూర్తి) ఈ రెండు కథలు మధ్యతరగతి చాలీచాలని ఆదాయాల గురించి
 "విరమణలేని కథ"(ఉపాధ్యాయుల గౌరీశంకరరావు)  ఒక మధ్యతరగతి ఉద్యోగి పనిచేసే మిల్లు మూతపడడంతో  యాజమాన్యం ఇచ్చిన పరిహారం చాలకపోగా ,మళ్ళీ వేరే ఉద్యోగం కోసం ప్రయత్నంలో తిరుగుతూ ఉండడం కథాంశం"అనగనగా ఒకరోజు " (పత్తి సుమతి ) పిల్లల చదువు గురించి ఒక గృహిణి పడే పాటులు .''భూతాలసొరగం ''(చింతా అప్పలనాయుడు)  ఒక జంగందొర కాలమానపరిస్థితుల వల్ల తన పాటకి ప్రోత్సాహంలేక ఆదాయంలేక పడే అవస్థల గురించి. ''నీడ '' (పి.వి.నర సిమ్హారావు ) తనకి కొంత ధనసహాయంజేసి,తాను కట్టుకొన్న యింటినే కాజేద్దామనుకొన్న  షావుకారు కి ఎదురుతిరిగి ఇంటిని కాపాడుకొన్న వైనం.''బందెలదొడ్డి '' (కె.వి.కూర్మనాథ్ ) బందెలదొడ్డి లో పెట్టిన పశువులు ,మనుషులు,ముఖ్యంగా తమ యజమానులగురించి వాటి అభిప్రాయాలు చెప్పుకొంటూ మాట్లాడుకొడం  తమాషాగా ఉంటుంది. ''చెలగాటం ''( ఆప్తచైతన్య ) మన్యప్రాంతంలోని హాస్టల్లో ఒక గిరిజనకుర్రాడికి జబ్బుచేస్తే వాడికేమైనా అయితే తన పీకకుచుట్టు కుంటుందని  హెడ్మాస్టర్ కొంత డబ్బిచ్చి వాడిని తండ్రితో ఇంటికి పంపించేస్తాడు. ''పిల్లలకోడి '' (ఆర్.రామక్రిష్ణ) ఇది కూడా పారిశ్రామీకకరణం భ్రమలో పడి ,పొలాలు వదలుకొని పట్టణాలకి వలస పోవద్దని ఉద్బోధించే కథ.
                                (ఇంకా వుంది) 

కామెంట్‌లు లేవు: