21, అక్టోబర్ 2013, సోమవారం




 మనమిప్పుడు ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం ఎలా ఉండాలని ఒక concept పెట్టుకొంటామో, అలాగే పూర్వం ఆదర్శవంతమైన రాజరికం ఎల ఉండాలో ననే conceptఉండేది.మహాభారతంలో నారదముని   ధర్మరాజు కి ఈ పరిపాలనావిషయాలు, రాజధర్మాల గురించి బోధిస్తాడు.వాటిని ఎందరు రాజులు ఆచరించేవారనేది వేరే సంగతి.ధర్మరాజు మాత్రం తనశక్తి కొలది వాటిని పాటిస్తున్నానని చెప్తాడు.ఆ సూత్రాలు కొన్ని ఈరోజు కూడా  పరిపాలకులకు (ministers and highoffcials ) కి వర్తిస్తాయి.అవి ఏమిటంటే;-- 1.ఉత్తమ,మధ్యమ,అధమ,కార్యాలకి ఉత్తమ,మధ్యమ,అధమ వ్యక్తులను నియోగించాలి.2.ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలి.3.రాజ్యం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలను పోషించాలి.4.రాచకార్యాలకి లంచగొండులను,దొంగలను,దుర్జనులను నియోగించకూడదు.5.చెరువులు,ఇతర జలాశయాలను రక్షించాలి.6.రైతులకు విత్తనాలు సరఫరా చెయ్యాలి.7.వర్తకులకు వ్యాపారానికి అప్పులు ఇవ్వాలి.8.వికలాంగులను,వృద్ధులను పోషించాలి.9. ధనాగారములు,ఆయుధశాలలు ,భాండారాలు,దక్షత,నమ్మకం కలవారి చేతనే నిర్వహింపజేయాలి(treasuries,armouries ,stores) 10. గురువులు,వృద్ధులు,శిల్పులు,కళాకారులు,వర్తకులు(businessmen) ,సాధువులు,బంధువులు,ఆశ్రితులు ,వీరిని  పేదరికము పొందకుండా కాపాడాలి.
  మరినేటి పరిపాలకులు పై ధర్మాలు,సూత్రాలు ఎంతవరకు పాలిస్తున్నారో నిర్ణయించుకొనండి.చిట్టచివరి సూత్రాన్నిమాత్రం (బంధుజనులను,ఆశ్రితులను ) బాగానే  పాటిస్తున్నట్లు ఉంది.    

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాలా కాలం నుంచి రాద్దామనుకున్న విషయం మీద మంచి టపా అందించారు.

Meraj Fathima చెప్పారు...

రాచరికాలు చాలా మేలు వేగుల ద్వారా కొంత నిజాన్ని వినగలిగే వారు.
ఆత్మవిమర్శ ఉండేది. ఇతర రాజుల మద్య పోటీ ఉండేది.
ధర్మాన్ని సూత్రంగా పాటించలేరు,
నీతిగా పాటించాలి.
టపా ఉన్నతముగా ఉంది సర్.