15, ఏప్రిల్ 2013, సోమవారం

Jaipoor tragedy.
  ఈ వేళ  జైపూర్ లో జరిగిన దారుణ ప్రమాదం ,ప్రజల నిర్లక్ష్యము  టీ.వీ.లో చూసేఉంటారు.మనకెందుకు ఈ బెడద అని ఇక్కడ కూడా అలాగే జరగవచ్చును.కాని దక్షిణాదికీ ఉత్తరాదికీ భేదం తెలుస్తున్నది.
 1.ఈ ప్రమాదం  ఎక్కడో మారుమూల జరగలేదు.జైపూర్ మైన్ రోడ్ మీద జరిగింది.
 2.తాముస్వయంగా సాయంచెయ్యకపోయినా, సెల్ ఫొన్ ద్వారా పోలీసులకు.ఆంబులెన్స్ కి తెలియజేయవచ్చును కదా?
  3.అక్కడ మనలాగ 100,108 సర్వీసులు లేవా?
  4.ప్రభుత్వసర్వీసులు మనకన్నా అధ్వాన్నం గా ఉన్నట్టు ఉన్నది.
 5.అన్నిటికన్నా ఘోరం గంట సేపు విడియో తీసిన మీడియా వాళ్ళు ఎందుకు సహాయం చెయ్యలేదు?మానవత్వం మంట గలిసిందని పాటలు పాడినవారి మానవత్వం ఏమైంది? 

2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

అక్కడ మీడియా వారికి వార్త, వ్యాపారం కనపడ్డయి తప్పించి, మానవసేవ, తోటి మనిషికి సాయం చేయాలనే స్పృహ లోపించాయి. ఈ పోకడ చాలా ప్రమాదకరం.

Vamshi Puluri చెప్పారు...

అది అక్కడి మనుషుల తప్పోకటి మాత్రమె కాదు. వాళ్ళు అలా వదిలి వెళ్ళడానికి కారణాలు ఎన్నున్డుంటాయి. ముఖ్యంగా పోలిస్, కోర్టు ల తో తలనొప్పి అనే కదా.! అంటే అది మన సిస్టం మొత్తం తప్పే అది. అక్కడ మనం ఉన్నా, ఆ వార్త రాసిన మొనగాడు ఉన్న, ఆ వార్త చానల్ యజమాని ఉన్న అదే చేసేవారేమో. ముందు ఎవరు కదులుతారు అని చూడడమే.. ముఖ్యంగా, కోర్టులు చురుకుగా, న్యాయ పర౦గా పనిచేసి, సామాన్యుల్లో ధైర్యాన్ని నింపితే.. మనలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మన దేశం నిర్లిప్త స్థాయి, నిర్లజ్జ స్థితి ని దాటి నిర్జీవ స్థితికి చేరుకొంది.