23, ఏప్రిల్ 2013, మంగళవారం 


   వరచిరకర కిరణాభరణా,మణిదీపిత మకుటాభరణా
     చంద్రాతపకారణ, ఘనతిమిరహరణా
   జీవనకాలాంకిత మేఘావరణా,జలనిధిధనశోషణ
      అణుశక్తిస్థలభీషణ,సర్వగ్రహవర్తుల చారణ
   భువనైకశరణా ,కృత జననమరణా
     సకలజన చేతనపోషణ
   సురనరమునివర  వందితచరణా
     జయసర్వాత్మక,జయ అరుణారుణ
   జయజయ ప్రత్యక్ష  శ్రీమన్నారాయణ.           

2 వ్యాఖ్యలు:

పంతుల జోగారావు చెప్పారు...

చాలా బాగుంది. అభినందనలు

Pantula gopala krishna rao చెప్పారు...

చాలా ప్రౌఢంగా ఉంది.సర్వసాక్షిని మీరు సన్నుతించిన తీరు అద్భుతం.అభినందనలు.