బాల్యంలో బాడ్మింటన్ లో -ప్రావీన్యంకోసం
ప్రయత్నించి విఫలుడ నయ్యాను.
యౌవనం లో సంగీతం నేర్వాలని
స్వరజతులను దాటలేక పోయాను.
నడివయస్సులో సైకాలజీ నేర్వాలని
అడియాస లే అయినాయి.
వృద్ధాప్యం లో వేదాంతం చదివితే
వేడెక్కి పోయింది తల
మన గమ్యాలన్నీఎందుకో
మహా దూరంగానే ఉంటాయి.
---------------------
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి