31, జనవరి 2014, శుక్రవారం

Andreas Vesalius (1514-1564)
 మానవుడికి తన శరీరం కన్నా సన్నిహితమైనది,కావలసినది మరొకటి లేదు కదా!ఐనా తన శరీర నిర్మాణం గురించి తెలుసుకోడానికి మానవునికి చాలా శతాబ్దాలకాలం పట్టింది.క్రీ.శ.2వ శతాబ్దంలో రోమన్ వైద్యుడు గాలెన్,(Galen) రచించిన గ్రంథమొక్కటే ,తప్పులున్నా ,అసంపూర్ణమైనా ప్రామాణికంగా ఉండేది.16వ శతాబ్దంలో వెసాలియస్ (AndreasVesalius ) స్వయంగా ఎన్నో శవాలని కోసి వివరించేదాకా విద్యార్థులకు,వైద్యులకు శరీరనిర్మాణం గురించి సరిగా తెలియదు.వెసాలియస్ బెల్జియం దేశస్తుడు.చాలాచోట్ల పనిచేసి చివరకు ఫ్రెంచ్ రాజు దగ్గర ఆస్థానవైద్యుడుగా ఉండేవాడు.1538లో అతడు 200 చిత్రాలతో 800 పేజీల మహా గ్రంథాన్ని రచించాడు. TABULEA ANATOMICAE దానిపేరు.అస్తిపంజరనిర్మాణం,గుండె,రక్తనాళాల వివరాలతో ఈ గ్రంథం తరవాతి తరాలవారికి చాలా కాలం ఉపయోగపడినది.ఆధునిక వైద్యశాస్త్రానికి మూలస్తంభాలలో వెసాలియస్ కృషి ఒకటిగా పేర్కొనవచ్చును.