12, ఆగస్టు 2012, ఆదివారం

mullapoodi-2volume




 ఈ మధ్య ముళ్ళపూడి వెంకట్రమణగారు రాసిన కోతికొమ్మచ్చి2వభాగం చదవడం తటస్థించింది.ఇంకా కొందరు చదివే వుంటారు.మొదటి భాగంలో ఆయన చిన్నతనపువిశేషాలు,పేదరికం,పత్రికల్లో ఉద్యోగం.ఫ్రీలాన్స్ జర్నలిజం ,సినిమాల్లో కథలు,దైలాగులరచన గురించిఉన్నాయి.రెండోభాగంలో సినిమాల్లో కథ,స్క్రిప్టు రాయడం ,జ్యోతి పత్రికలో ఉద్యోగం- వీటితో విసిగి బాపూగారితో కలిసి నిర్మాతగామారి సాక్షిచిత్రంతో మొదలుపెట్టి సంపూర్ణరామాయణం వరకు స్వంత సినిమాలు తీసి లాభనష్టాలు,నిందలు,ప్రశంసలు పొందడం -ఇవన్నీఉన్నాయి. ఐతే ఒక కాలక్రమంలేకుండా ,ముందువి వెనక,వెనకవి ముందు రాస్తూ  జంప్ చేయడంవలన కోతికొమ్మచ్చి అనేపేరు పెట్టారు.దీనినిండా,సినిమావాళ్ళ కబుర్లూ,జోకులూ ముళ్ళపూడివారి,ఆయన టిపికల్ శైలి లో ఉంటాయి.స్వయంగా చదువుతేనే  enjoy చెయ్యగలం.మచ్చుకు -క్రూ 'రంగారావు ' ,చంద్రబాబునాయుడుగారిలాగ,' ముందుకు పోతాం ' మాలతీచందూర్గారిలాగ ' ముందే తరిగి వుంచుకున్న కూరముక్కలులాగ ' వంటి ప్రయోగాలు కొల్లలు.హాస్యబ్రహ్మ ముళ్ళపూడివారి కోతికొమ్మచ్చిని తప్పకచదవమని నా సలహా. 

1 కామెంట్‌:

www.apuroopam.blogspot.com చెప్పారు...

కమనీయం గారి రైలు మన పాసింజరు బళ్ళకంటె లేటుగా నడుస్తోంది. కోతి కొమ్మచ్చి మూడవ భాగం కూడా ఎప్పుడో రిలీజయి ముళ్లపూడి వారి అభిమానులందరూ కూడా చదివేసాక ఇప్పుడు రెండవ భాగం గురించి వ్రాయడం అలాగే ఉంది మరి.