4, ఆగస్టు 2012, శనివారం

DR.PINAAKAPAANI డా.శ్రీపాద పినాకపాణిగారి గురించి ,ఆయన శతవత్సర వేడుకల గురించి పత్రికల్లో చదివిఉంటారు.100 ఏళ్ళు జీవించినవారు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చును.ఆయన గత కొన్ని సం.నుండి మంచంపట్టినా స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారట.
  మేము 1950-1955 మధ్య వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజిలో  చదువుతున్నప్పుడు మెడికల్ ప్రొఫెసర్గా ఉండే వారు.అప్పటి పద్ధతి ప్రకారం ఫుల్సూట్లో వచ్చేవారు.అప్పటికే బట్టతల బాగా ఉండేది.'తరనన 'అంటూ మెల్లిగా పాడుకుంటూ ,తల ఊపుతూ,రౌండ్స్ చేస్తుంటే మేము నవ్వుకొనేవాళ్ళం.అలాగని ఆయన తన డ్యూటీని,టీచింగుని అశ్రద్ధ చేసేవారుకాదు.తర్వాత కర్నూలు మెడికల్ కాలేజికి ప్రొఫెసర్ ప్రిన్సిపల్గా బదిలీఅయి అక్కడే రెటైరయి సెటిలయ్యారు.నేదునూరి,నూకల,శ్రీరంగం వంటి మహామహులు ఆయన శిష్యులు.
  పద్మభూషణ్ పినాకపాణీ గారి సంగీతజీవితం గురించి రాసే తాహతు నాకు లేదు.ఆయన గొప్ప theoritician .చాలా మార్గదర్శకమైన సంగీత గ్రంథాలు రచించినట్లు  తెలుసును.కాని ,ఆయన కంఠస్వరం,కచెరీ అంత ప్రజారంజకం గా  ఉండేవికావు.
  ఆయన మెడికల్ప్రాక్టీసు ద్వారా గొప్పగా సంపాదించినట్లులేదు.అప్పట్లో మా ప్రొఫెసర్లు చాలామంది అలాగే ఉండేవారు.ప్రాక్టీసుకన్నా టీచింగు మీద ఎక్కువ ఆసక్తి చూపేవారు.కాని strict గాను ,కోపిష్టులుగాను ఉండేవారు.

1 వ్యాఖ్య:

the tree చెప్పారు...

గురువు గారిని తలుచుకోవడం మంచి అనుభూతి.