12, జులై 2012, గురువారం

GEORGE BERNARD SHAW




 G.B.SHAW లేక జార్జ్ బెర్నార్డ్ షా ఇప్పుడెందరికి గుర్తున్నాడో తెలియదు కాని 20 వ శతాబ్దపు ప్రథమార్థ భాగంలో షేక్స్పియర్ తర్వాత అంత గొప్ప నాటక కర్తగా పేరొందాడు.ఐరిష్ జాతీయుడు.చిన్నతనంలోనే తల్లీ తండ్రీ వేరైపోయారు.ఎక్కువ  చదువుకోలేదు.స్కూలంటే ద్వేషం.తర్వాత ఒక గుమాస్తా పని చేసాడు కాని ఆ ఉద్యోగమన్నా ద్వేషమే.తరవాత జర్నలిస్ట్ గా పనిచేస్తూ రచనలు ప్రారంభించాడు.పెట్టుబడి దారీ వ్యవస్థ అంటే పడదు.సిడ్నీ ,బియాట్రిస్ ,వెబ్ అనే దంపతులతో కలిసి ఫేబియన్ సొసైటీ అనే సోషలిస్ట్ సంస్థ స్థాపించాడు. సహజంగా తెలివయిన వాడు కాబట్టి మంచి నాటకాలను రచించి,నాటక శాలలలో ప్రదర్శింప జేసే వాడు.క్రమంగా మంచిపేరు ,ధనమూ కూడా సంపాదించాడు.1925 లో ఆతనికి  నోబెల్ బహుమతి లభించింది.
  Ideology  లో షా సోషలిజానికి సానుభూతిపరుడు.ధనస్వామ్యానికి ,యుద్ధాలకీ  వ్యతిరేకి.ఐతే తీవ్రవాదాన్ని,హింసామార్గాన్ని వ్యతిరేకించాడు.
 బెర్నార్డ్ షా నాటకాల్లో ప్రసిద్ధమైన వాటిలో కొన్ని ఇస్తున్నాను.-
  1.Saint Joan 2.Androcles and the lion 3.Major Barbara 4.The devil's disciple 5.Candida 6.Arms and the man 7.Mrs.Warren's profession 8.Ceasar and Cleopatra 9.Back to Methusela 10.Pygmalion .ఈయన నాటకాలు చాలా రంగస్థలం మీదే కాక సినిమాలుగాను,టీ.వీ. షోలుగాను నిర్మించారు.పిగ్మాలియన్ హాలీవుడ్లో My fair lady @ అనే మ్యూజికల్ చిత్రంగా ప్రసిద్ధి పొందింది.మన భారతీయభాషా చిత్రాల్లో కూడా అనేక అవతారాలు ఎత్తింది.
  బెర్నర్డ్ షా జననం ;1856-మరణం; 1950 .94 సం.జీవించాడు.
 షా హాస్యప్రియుడు, చతుర భాషి.ఆయన  quotes , witticisms  చాలా ఉన్నాయి.మచ్చుకి ఒక్కటి మాత్రం ఉదహరిస్తాను.
  ఒక పార్టీలో సిన్మా నటి ఒకామె షాతో అందట ' మీరు నేను పెళ్ళి చేసుకుంటే   నా అందమూ,మీ తెలివితేటలూ ఉన్న పిల్లలు పుట్తారు కదా ' అని.(షా అందగాడు కాదు ) దానికి షా జవాబు; 'కాని ఒకవేళ నా అందమూ ,మీ తెలివి తేటలూ ఉన్న పిల్లలు పుట్టుతారేమో '        

1 కామెంట్‌:

Meraj Fathima చెప్పారు...

Sir, ఒక గొప్ప వ్యక్తి గురించి ప్రస్తావించారు. చాలా సంతోషం. ప్రపంచంలో నోబుల్ ప్రైజ్ మరియు ఆస్కార్ అవార్డు రెండూ గెలుచ్కున్న ఒకే ఒక వ్యక్తి బెర్నార్డ్ షా గారు. ఆయనకు 1925 లో సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ మరియు 1938 లో "Pygamalion" అనే ఆయన నవల పై ఆధారిత సినిమా పై ఆయన కృషికి ఆస్కార్ అవార్డు లభించాయి.
అవార్డుల పై ఆసక్తి లేని షా నోబుల్ బహుమతిని పూర్తిగా తిరస్కరించాలనుకున్నారు, కానీ ఆ అవార్డు ఐర్లాండు దేశానికి ఒక నివాళి కావాలనే ఆయన భార్య కోరిక మేరకు షా ఆ అవార్డు స్వీకరించారు, కానీ ఆయన నగదు బహుమతిని మాత్రం స్వీకరించలేదు.
19 వ శతాబ్దపు గొప్ప నాటక రచయిత, London School of Econamics మూల వ్యవస్థాపకులలో ఒకరైన అయిన షా సామ్యవాది, బహుముఖ ప్రజ్ఞాశీలి.
ఇంజనీరింగు, మెడిసిన్ వైపు పరుగులు తీసే, సాహిత్యం మరియు దాని విలువలు గురించి అవగాహన లేని ఈ కాలం పిల్లలకు కొంత అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీదా వుంది.