20, మార్చి 2011, ఆదివారం

గల్పిక

ఈ మధ్య చాలామంది ౧౫ నిమిషాల సేలేబ్రిటీలు అయిపోతున్నారు..మొన్న బజారులో ఒకాయన్నిచూసాను. ఎక్కడో చూసినట్టు అనిపించి అడిగాను. మీరు గానిటి.వీ లో నటించారా అని .తెలుగు దంపుడు చానెల్లో రియాల్టీ షోలో వచ్చేనుకదండీ అన్నాడుసంబరపడిపోతూ..ఎలా సెలెక్టు ఐనారని అడిగాను. పొద్దుటే వాళ్ళ ఆఫీసుకి వెళ్లి క్యూలో నిలబడ్డాను ,గేదెలపాడు నుండి ఇంతవరకూ ఎవ్వరినీ సెలెక్టు చెయ్యలేదని ప్లేకార్డు పట్టుకొని .మా రాజుగాడు కూడా అందులోపనిచేస్తున్నాడులెండి అదీగాక నా పెర్సనాలిటి కూడా పనిచేసింది అన్నాడు నవ్వుతూ.మీరు చూసారు కదా. నేను మా ఆవిడ ఒకరి మీద ఒకరు జోకులువేసుకొని అందరినీ నవ్విన్చేసాము .నాకు గుర్తు లేకపోయినా వున్నట్టు నటిస్తూ ,ఐతే ఇప్పుదేలాగున్నారు అన్నాను .ఎక్కడి కెళ్ళినా జనం గుర్తుపట్టి ఆటోగ్రాఫు అడుగుతున్నారు అన్నాడు .మళ్ళీ టి.వి.లో వేస్తారాఅని అడిగాను.వేస్తానుగాని డబ్బు తీసుకో కుండా మాత్రం వెయ్యను అన్నాడు ప్రొఫెషనల్గా . ---రమణీయం.--ఆర్ట్ బుఖ్వాల్ద్ నిఅనుసరించి సరదాగా.

2 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

మీ గల్పిక చాలా బాగుంది. సరదాగా ఉంది. బుల్లి తెర మీద ఒక్క నిముషం కనబడితేనే తమ జీవితం ధన్యమై పోయినట్టుగా తలచే అల్ప సంతోషులకి కొదవ లేదు. అలాగే, ఒక చిన్న అవకాశం దొరకగానే అమాంతంగా కొండెక్కి కూర్చునే వారూ ఎక్కువే. ఇలాంటి వ్యంగ్యాత్మక రచనలు మీరు ఇంకా చేసి మమ్మల్ని అలరించాలని కోరుతున్నాను.

కమనీయం చెప్పారు...

మీ.మెప్పుకోలు కి,సలహాకి నా ధన్యవాదాలు .అప్పుడప్పుడు సరదాగల్పికలు రాయడానికి ప్రయత్నిస్తాను. రమణీయం