29, జూన్ 2015, సోమవారం

national songs
 '' మా తెలుగుతల్లికి మల్లెపూదండ ''గేయం తెలుగువారి(కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో)జాతీయ గేయం అయింది.ఇందులో originalగా శంకరంబాడి సుందరాచారి రచించిన గేయంలో ' అమరావతీగుహల అపురూపశిల్పాలు  ' అనిఉన్నది.అమరావతిలో గుహలూ లేవు,అందులో శిల్పాలూ లేవు.అందుకని ఆ చరణాన్ని అమరావతీ నగర ' అనిమార్చారు.దరిమిలా ఇప్పుడు ' అమరావతీ గుడుల ' అని మార్చి పాడుతున్నారు.ఆ శిల్పాలులో చాలా భాగం  లండన్ మ్యూజియం లోను,కొన్ని స్థానిక మ్యూజియం లో ను ఉన్నాయి.మొదట్లో టంగుటూరి సూర్యకుమారి పాడిన గ్రామొఫోన్ రికార్డు లోను ' అమరావతీ గుహల ' అనేఉంది.ఇది  మన తెలుగు జాతీయ గేయం కథ.
   ఇక భారత జాతీయ గేయం '' జనగణ మన అధినాయక '' విషయం ;;ఆదిలో దీన్ని రవీంద్ర నాథ టాగూర్ బ్రిటిష్ చక్రవర్తిని కీర్తిస్తూ రాసేడని, అప్పటికింకా టాగూర్గారికి జాతీయోద్యమంతో బాగా సంబంధం లేదని ,తర్వాతనే  బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సర్  బిరుదుని త్యజించారని  ఒక వాదం ఉంది. కాదు ఆ గేయాన్ని భారతమాతను స్తుతిస్తూ రాసిన జాతీయగీతం అని ప్రతివాదం గా చెప్తారు.
   ఇంకొక జాతీయగీతం ''వందేమాతరం' గురించి; ఇది దుర్గామాత గురించి కీర్తిస్తూ రాసింది  దీన్ని పాడమని మమ్మల్ని నిర్బంధిచకూడదని ముస్లిం నాయకుల అభ్యంతరం.కాదు, ఇది భారతమాత గురించి బంకించంద్ర రాసినదని సమర్థిస్తారు. నా ఉద్దేశంలో ఈ గేయం మొదటి నాలుగు చరణాలు దేశాన్ని ఉద్దేశించినవే కాబట్టి

''వందేమాతరం సుజలాం ...నుంచి సుఖదాం వరదాం మాతరం '' వరకూపాడితే ఎవరికీ  అభ్యంతరం ఉండకూడదని.
  ఇలాగే బ్రిటిష్ జాతీయగీతం'  long live the King ' కి  కొందరు రాచరికవ్యవస్థ వ్యతిరెకులు అభ్యంతరం తెలుపుతున్నారు.ఆస్ట్రేలియాలో కూడా కొందరు ఇప్పుడు ఆ దేశం స్వతంత్రమైనది,అన్ని జాతులవారూ నివసిస్తూ ఉన్నారు కాబట్టి బ్రిటిష్ జాతీయ గీతం పనికిరాదంటున్నారు.రెపు స్కాట్లాండ్ విడిపోతే వాళ్ళూ అదే అంటారు.