16, సెప్టెంబర్ 2012, ఆదివారం

Lady Doctors.--pioneers

-
 

  ఈ వ్యాసం నా వ్యాస సంపుటి ' సంధ్యారాగం 'నుంచి తీసి రాస్తున్నాను.మహిళల గూర్చి రాస్తున్న సౌమ్య గారి వంటి వారికి ఉపయోగపడ వచ్చును.
 
 '' స్త్రీలు--వైద్యవృత్తి . ''
  -------------------------
  ఈ రోజుల్లో మహిళలు వైద్య వృత్తి లో అన్ని శాఖల్లోను విరివిగా ఉన్నారు.కాని ఒకప్పుడు మాత్రం చాలా తక్కువగా ఉండేవారు.ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోడమే బాగా తక్కువ కదా. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో వైద్యవృత్తిలో చేరి అందరికీ,తరువాత వారికీ మార్గదర్శులైన మహిళల గురించి తెలియజేస్తాను.
 1. మిస్ హ్యూలెట్ --( Miss Hewlett )1866 మొట్ట మొదట మన దేశంలో వైద్య వృత్తి అవలంబించి మంత్రసానులకు(midwives ) కి తరిఫీదు ఇచ్చింది.
 2.ఆనందీబాయి జోషి M.D.-- అమెరికాలో వైద్యం చదివి కొల్ హాపూర్ హాస్పటల్ స్థాపించిన ప్రథమ భారతీయ మహిళ (A.D.1888 )
 3. మిస్ ఆనీ వాక్ (Miss.Anne walke L.M.& S)భొంబాయిలో మెడికల్ పట్టా పొందిన మొదటి మహిళ.
 4.మిస్ సోఫియా ఇడా స్కుడ్డర్ (Miss.Sophia Ida Scudder M.D.DSc.) భారత దేశంలో జన్మించి ,అమెరికాలో వైద్యం చదివి ,ప్రసిద్ధిపొందిన రాయవెల్లూరు హాస్పటల్ ,మెడికల్ కాలేజి స్థాపించిన ప్రఖ్యాతి పొందిన మహిళ (1918)
 5.మిసెస్.ముత్తు లక్ష్మీ రెడ్డి M.D.C.M. వైద్య రంగం లోనే గాక సాంఘికసేవ ,జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో కూడా కృషి చేసారు. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి వైస్ ప్రెసిడెంట్ గా కొన్నాళ్ళు పని చేసారు.1954 లో  మద్రాస్ కేన్సర్ హాస్పటల్ ని స్థాపించారు.
 6.డా .కెప్టెన్ లక్ష్మి (Dr.Captain Lakshmi ) .నేతాజీ  సుభాస్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ లో పనిచేసారు.ప్రపంచ యుద్ధం తర్వాత వైద్యవృత్తిలో ఉంటూ ,సాంఘిక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.ప్రతిపక్షాల  తరఫున ఒకసారి భారత్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడి పోయారు.ఇటీవలనే  
మరణించారు.
 7.డాక్టర్ సుశీలా నయ్యర్.M.D. -ఢిల్లీ ఆరోగ్యమంత్రి గా (1952-1955) పనిచేసారు.కాంగ్రెస్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.1962లో కేంద్ర ఆరోగ్య మంత్రిగా నియమింపబడ్డారు.సేవాగ్రాం  లో కస్తూర్బా ట్రస్టు ద్వారా పలు ఆరోగ్య కార్యక్రమాలను నిర్వర్తించారు.
 8.డాక్టర్.లాజరస్ (Dr.H.M.Lazarus M.B.B.S.'M.R.C.P.'F.R.C.S.) వాల్తేరులో జన్మించి కొన్నాళ్ళు విశాఖపట్నం  K.G.హాస్పటల్ లో గైనిక్ సర్జన్ గా పనిచేసారు.మేము మెడిసిన్ చదువుతూ ఉన్నరోజుల్లో ఆవిడ పనిచేస్తూ ఉండేవారు.2వ ప్రపంచ యుద్ధ కాలంలో మిలిటరీలో పనిచేసారు.నర్సింగ్,మిడ్వైఫరీ స్కూలుని (Nursing &Midwifery school ) స్థాపించారు.
  కొద్దిమంది pioneers ఐన లేడీ డాక్టర్ల గురించి మాత్రమే వ్రాసాను.ఇటీవల కాలంలో వీరిని అనుసరించి వైద్య,ఆరోగ్య రంగాల్లో వివిధ శాఖల్లో ప్రవీణులు,ప్రఖ్యాతులైన మహిళలు చాలా మంది ఉన్నారు.
              -----------------
   

1 కామెంట్‌:

anrd చెప్పారు...

వైద్యరంగంలోని ప్రముఖులైన మహిళల గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.