13, సెప్టెంబర్ 2012, గురువారం

Alfred Hitchcock ఆల్ఫ్రెడ్  హిచ్కాక్  గురించి కొంత సమాచారం వికీపీడియా లో లభ్యమౌతుంది.కాని స్వయంగా ఆయన సినిమాలు చూసిన అనుభూతి వేరు.జ్ఞాపకమున్నంతవరకు నేను చూసిన చిత్రాల గురించి రాస్తాను.కొన్ని టీ.వీ.పుణ్యమా అని మళ్ళీ చూసాను.ఆ రోజుల్లో సెసిల్.బి.డీమిల్లి అనే ఆయన భారీ సెట్టింగులతో పౌరాణిక ,చారిత్రక సినిమాలు తీసాడు.వాల్ట్ డిస్నీ కార్టూన్ సినిమాలు తీసే వాడు.హిచ్కాక్ ప్రత్యేకత ఉత్కంట,నేరము (suspense,crime ) ప్రధానమైనవి.అలాగని పోరాటాలు,రక్తపాతం ఉండవు.కొన్ని సినిమాల్లో హంతకుడెవరో ముందే తెలుస్తుంది.కాని,సస్పెన్స్ తో కథ నడిపిస్తాడు.ఆయన ప్రకారం కథా,స్క్రీన్ ప్లే పూర్తిగా సిద్ధమైతే సినిమా  దాదాపు పూర్తి అయినట్లే.అతడు పనిచేసినకాలం,తన మాటల్లోనే మూకీ సినిమాలనుండి తెలుపు-నలుపు టాకీలు,రంగుల సినిమాలు,సినిమాస్కోపు,3 Dలు ,టెలివిజన్ సీరియల్స్ వరకు చురుకుగా సాగింది.ఆయన సినిమాలు చాలా వరకు ప్రసిద్ధ నవలలు,లేక యదార్థ సంఘటనలని ఆధారంగా తీసినవే.ఇంగ్లాండ్లో మొదట్లో సినిమాలు తీసి పేరు గడించాడు.అవి 1.MAN WHO KNEW TOO MUCH 2.39 STEPS.3.THE LADY VANISHES.కాని వీటిని నేను చూడలేదు.
  తర్వాత అంతర్జాతీయ సినిమా కెంద్రమైన హాలీవుడ్ కి వెళ్ళి 1939 లో డాఫ్నె ద్యు మారియర్ ప్రసిద్ధనవల రెబెకా ని తెరకెక్కించాడు.దీనికి అకాడమీ అవార్డు కూడా వచ్చింది.ఇందులో ఉత్కంఠ ఉంటుంది కాని క్రైం ఉండదు.పెద్ద భవనంలో ఒంటరిగా ఉన్న యువతి అనుభవాలతో గొప్పగా ఉంటుంది.తర్వాత shadow of doubt తీసాడు.ఆయన్ని అడిగితే అదే తన ఫేవరెట్ సినిమా అన్నాడట.కాని నేను చూడలేదు.తర్వాత suspicion  అన్న సినిమాలో భార్యను హత్య చెయ్యడానికి ప్రయత్నించే భర్తగా ప్రసిద్ధుడైన హీరో కారీ గ్రాంట్ చేత అతని ఇమేజ్ కి విరుద్ధంగా వేయించాడు.విజయం సాధించాడు.అప్పటినుండి (1945)1960 దాకా ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఎన్నో సినిమాలు తీసాడు.master of suspense గా పేరు మారు మోగి పోయింది.
 1945లో స్పెల్బౌండ్ ( spellbound) చిత్రం మనస్తత్వ పరిశోధన,మతిమరుపు (amnesia) మీద తీసాడు.గ్రిగరీపెక్,ఇంగ్రిద్ బెర్గ్మన్ నటించారు.మొదటిసారి అర్థం కాలేదు. మళ్ళీ చూసినప్పుడు తెలిసింది.ఇందులో ప్రసిద్ధచిత్రకారుడు కంపోజ్ చేసిన స్వప్నదృశ్యం ఒక ప్రత్యేకత.నొటొరియస్( notorious )లో మళ్ళీ ఆ హీరో హీరోయిన్లతోనే 2వ ప్రపంచయుద్ధ నేపథ్యంలో గూఢ చర్యల గురించి తీసినది.
  రోప్ (rope) ఇందులో ఒక హాల్ లోనే కథ అంతా జరుగుతుంది.ఇద్దరు స్నేహితులు మూడవ వాణ్ణి చంపి ఒక పెద్ద భోషాణంలో శవాన్ని దాచేస్తారు.చాలమంది అతిథులు వస్తూపోతూ ఉంటారు .చివరికి డిటెక్టివ్ జేంస్ స్టీవార్ట్ రహస్యం కనిపెడతాడు.
   
   strangers on a train ;దీనిగురించి గతసారి వివరంగా రాసాను.క్లైమాక్స్ సీను చాలా బాగుంటుంది.
 Dial M for murder  భర్త తనమీద అనుమానం రాకుండా భార్యను కిరాయి హంతకునితో చంపించడానికి ప్లాను నడిపిస్తాడు.కాని అది బెడిసి కొట్టి తిరిగి అతని దోషం బయలుపడుతుంది.కిరాయిహంతకుడితో  ఆత్మరక్షణకోసం చెసిన పోరాటంలో భార్య వాడినే చంపివేస్తుంది.అంతా సస్పెన్స్ తో నడుస్తుంది.ఇది ఒక నాటకం ఆధారంగా తీసినది.తెలుగులో ప్రఖ్య శ్రీ రామ్మూర్తి గారు నాటకం గా అనువదించేరు.
   (మిగతా మరొక సారి.)